1. ఒకే వ్యక్తిని రెండు లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు
అనే అంశాన్ని ఏ సవరణతో రాజ్యాంగంలో చేర్చారు?
1) 14వ రాజ్యాంగ సవరణ చట్టం 1962
2) 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
3) 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956
4) 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
2. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) గవర్నరిని నియమించేటపుడు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి
2) గవర్నర్‌గా నియమితులయ్యే వ్యక్తి పార్లమెంట్ / రాష్ట్ర శాసన సభలోగానీ
సభ్యుడై ఉండరాదు
3) గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి
4) గవర్నర్ సివిల్ కేసు వేయాలంటే రెండు నెలల ముందు అతనికి నోటీసు ఇవ్వాలి
3. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) రాష్ట్రంలో మంత్రులు గవర్నర్ అభీష్టం మేరకు పదవిలో ఉంటారు
2) గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను నియమిస్తారు
3) రాష్ట్ర అడ్వకేట్ జనరల్ జీత భత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.
4) ఒక రాష్ట్ర గవర్నర్ పదవిలో ఉండగా మరణించిన సందర్భంలో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా గవర్నర్ విధులను నిర్వహించవచ్చు.
4. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) గవర్నర్ ముందస్తు అనుమతితోనే ద్రవ్యబిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టాలి
2) గవర్నర్ తాను జారీ చేసిన ఆర్డినెన్ను ఆర్నెల్లలోపు ఉప సంహరించుకోవాలి
3) గవర్నర్ సిపారసు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లను డిమాండ్ చేయకూడదు.
4) రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాష్ట్రపతి గవర్నర్‌ను సంప్రదించవచ్చు
5. Assertion: రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ ఒక ద్రవ్య
బిల్లుని రిజర్వ్ చేసిన తరవాత రాష్ట్రపతి ఆ ద్రవ్య బిల్లును ఆమోదిస్తే అది చట్ట రూపాన్ని సంతరించు కుంటుంది. అంతేకానీ ఆ ద్రవ్య బిల్లుకు ప్రత్యేకంగా గవ ర్నర్ ఆమోదం అవసరం లేదు.
Reason: గవర్నరు రాష్ట్ర ఆగంతుక నిధి నుంచి అడ్వాన్సులు మంజూరు చేసే అధికారం ఉంది.
1) A, R రెండూ సరైనవి R అనేది Aకు సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి R అనేది Aకు సరైన వివరణ కాదు
3) A సరైంది. R సరైంది కాదు
4) A సరైంది కాదు. R సరైంది
6. శాసనమండలి, శాసన సభ రెండూ ఉన్న రాష్ట్రాల్లో ఏ సందర్భంలో గవర్నర్ ఆర్డినెన్ను జారీ చేయవచ్చు?
1) శాసన మండలి సమావేశంలో లేనపుడు
2) శాసన సభ సమావేశంలో లేనపుడు
3) రెండు సభలు సమావేశంలో లేనపుడు
4) శాసన సభ సమావేశంలో లేనపుడు లేదా శాసన మండలి సమావేశంలో లేనపుడు లేదా రెండు సభలు సమావేశంలో లేనపుడు
7. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) రాష్ట్ర శాసన సభ ఏ అంశాలపై చట్టాలను చేయ గలదో ఆ అంశాలపై గవర్నర్ ఆర్డినెన్లను జారీ చేస్తాడు
2) గవర్నర్ తాను జారీ చేసిన ఆర్డినెన్ను ఉప సంహ రించుకొనే సందర్భంలో రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి
3) గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అతని విచక్షణాధికారం కాదు.
4) ఏ రాష్ట్రంలో అయితే రెండు సభలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్సును రెండు సభల్లో ప్రవేశపెట్టాలి.
8. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి సమష్టిగా రాష్ట్ర విధాన సభకు బాధ్యత వహించాలి అని పేర్కొన్నారు?
1) 162
2) 163
3) 164
4) 165
9) ఏదైనా ఒక అంశం గవర్నర్ విచక్షణాధికారం కిందికి వస్తుందా లేదా అనే విషయంలో అంతిమ నిర్ణయం) తీసుకొనే అధికారం ఎవరికి ఉంది?
1) సుప్రీంకోర్టు
2) హైకోర్టు
3) రాష్ట్రపతి
4) గవర్నర్
10. కింది వాటిలో గవర్నర్ వివేచనాధికారం కాని దాన్ని గుర్తించండి
1. విధాన సభలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోతే ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం
2. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు హఠాత్తుగా మర ణించిన సందర్భంలో నూతన ముఖ్యమంత్రిని నియమించడం
3. మంత్రిమండలి మెజార్టీ కోల్పోయినపుడు అసెంబ్లీని రద్దు చేయడం
4. ముఖ్యమంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి గవ ర్నరు అతని విధుల్లో సహాయ సహకారాలు అందించడం
11. ముఖ్యమంత్రి సహా మంత్రి మండలిలోని మొత్తం మంత్రుల సంఖ్య ఎంతకు తగ్గరాదు?
1) 15
2) 18
3) 12
4) 16
12. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా బీహార్ రాష్ట్రానికి ఒక గిరిజన మంత్రిత్వ శాఖ ఉండాలి అనే అంశాన్ని మినహాయించారు?
1) 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003
2) 94వ రాజ్యాంగ సవరణ చట్టం 2006
3) 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2009
4) 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011
13. కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో గిరిజన మంత్రిత్వ శాఖను తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు?
1) మధ్య ప్రదేశ్
2) ఒడిశా
3) జార్ఖండ్
4) ఉత్తరాఖండ్
14. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) శాసన సభలో మెజారిటీ కోల్పోయిన మంత్రి మండ లి సలహాకి గవర్నర్ బద్దుడై ఉండాల్సిన అవసరం లేదు.
2) రాష్ట్ర విధాన సభ మంత్రి మండలికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే మొత్తం మంత్రి మండలి రాజీనామా చేయాలి
3) ఏ సభలోను సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమితులైతే అతడు ఆర్నెల్లలోపు ఏదో ఒక సభలోసభ్యత్వం పొందాలి.
4) మంత్రిగా నియమితులైన వ్యక్తి తాను సభ్యుడిగా ఉన్న సభలో మాత్రమే కాక ఏ సభలోనైనా ఓటు వేయవచ్చు.
15. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) ఒక రాష్ట్రంలో మంత్రిగా నియమితులైన వ్యక్తి జీత భత్యాలను ఆ రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది
2) ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే గవర్నర్ ఒక వ్యక్తిని మంత్రిమండలి నుంచి తొలగిస్తారు.
3) గవర్నర్‌కి మంత్రి మండలి అధికార నిర్వహణలో అందించిన సహాయ సహకారాలను గురించిన్యాయస్థానంలో విచారణ చేయవచ్చు.
4) రాష్ట్రంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న ఏ మంత్రి అయినా క్యాబినెట్ నిర్ణయాలను సమర్థించాలి లేక పోతే అతను మంత్రి పదవికి రాజీనామా చేయాలి.
16. ఏ రాష్ట్రాల్లో ప్రస్తుతం ద్విసభా విధానం అమల్లో లేదు?
1) ఉత్తరప్రదేశ్, బీహార్
2) మహారాష్ట్ర, కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్,జమ్ముడికశ్మీర్
4) తమిళనాడు, మధ్యప్రదేశ్
17. రాష్ట్రాల్లో విధాన పరిషత్ ను ఏర్పాటు లేదా రద్దు చేయాలంటే ఏ విధంగా చేయాలి?
1) పార్లమెంట్
2) రాష్ట్రపతి తీర్మానం మేరకు పార్లమెంట్
3) సుప్రీంకోర్టు తీర్మానం మేరకు పార్లమెంట్
4) ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం మేరకు పార్లమెంట్
18. ఒక రాష్ట్ర శాసన సభలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సరైన ప్రాతినిథ్యం లేదని భావించిన పక్షంలో ఆ కమ్యూనిటీ నుంచి గవర్నర్ శాసన సభకు ఒకరిని నామినేట్ చేయాలి అనే అంశం కాల పరిమితిని 95వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎప్పటి వరకు పొడిగించారు?
1) 2020
2) 2022
3) 2024
4) 2026
19. ఇప్పటివరకు పార్లమెంట్ నాలుగు నియోజక వర్గపునర్విభజన కమిషన్లను ఏర్పాటు చేసింది.. అయితే కింది ఏ సంవత్సరంలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన కమిషనన్ను ఏర్పాటు చేయలేదు?
1) 1952
2) 1962
3) 1982
4) 2002
20. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి
1) స్థానిక సంస్థల ప్రతినిధులు - విధాన పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు సభ్యులను ఎన్నుకుంటారు
2) రాష్ట్రం నుంచి ఎన్నికైన శాసన సభ సభ్యులు, విధాన పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/4వంతు సభ్యులను ఎన్నుకొంటారు.
3) పట్టభద్రులు, విధాన పరిషత్ మొత్తం సభ్యులసంఖ్యలో 1/12 వంతు సభ్యులను ఎన్నుకొంటారు.
4) ఉపాధ్యాయులు, విధాన పరిషత్ మొత్తం సభ్యులసంఖ్యలో 1/12 వంతు సభ్యులను ఎన్నుకొంటారు.
21. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి
1) విధాన పరిషత్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిథ్య ఏకఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నికవుతారు 2) గవర్నర్ ఎవరైనా ఒక వ్యక్తిని విధాన పరిషత్కు నియమిస్తే ఆ అంశాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు
3) శాసన సభ సభ్యుల మొత్తం సంఖ్యలో మూడింటఒక వంతు విధాన పరిషత్ గరిష్ట సభ్యుల సంఖ్యగా ఉంటుంది.
4) విధాన పరిషత్ సభ్యుల కనిష్ట సంఖ్య 40
22. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తిం చండి
1) శాసన మండలి సభ్యులు ఆరేళ్ల కాలవ్యవధికి ఎన్నికవుతారు.
2) శాసన మండలి నుంచి ప్రతి రెండేళ్లకు 1/3 వంతుసభ్యులు పదవీ విరమణ చేస్తారు.
3) ఒక రాష్ట్ర శాసన మండలిలో నామినేట్ అయినసభ్యులు పదవీ విరమణ తరవాత తిరిగి నామినేట్ కావడానికి అనర్హులు.
4) ఒక రాష్ట్ర శాసన మండలిలో పదవీ విరమణ పొందిన సభ్యుడు గవర్నర్ గా పదవీ బాధ్యతలనుచేపట్టవచ్చు.
23. విధాన పరిషత్ కు ఎంపికయ్యే వ్యక్తి సంబంధితరాష్ట్ర శాసన సభ నియోజక వర్గంలో ఓటరై ఉండాలి అనే అంశం గురించి
1) రాజ్యాంగంలో పేర్కొన్నారు
2) ఎన్నికల నియమావళిలో పేర్కొన్నారు
3) రాజ్యాంగ సాంప్రదాయాల్లో భాగంగా ఉంది
4) ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్నారు
24. కింది వాటిలో ఏ అంశం రాష్ట్ర శాసన సభకు, రాష్ట్ర శాసన మండలికి ఎంపిక అయ్యే వ్యక్తి అనర్హత కిందికి రాదు?
1) లాభదాయక పదవులు నిర్వర్తిస్తున్నపుడు
2) దివాలా తీసినట్లు కోర్టు ధృవీకరణ చేసినపుడు
3) మానసికంగా మతిస్థిమితం కోల్పోయినట్లు కోర్టుధృవీకరించినపుడు
4) విదేశీ పౌరసత్వాన్ని పొందనపుడు
25. రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్న వారికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి -
1) స్పీకర్, ఛైర్మన్
2) గవర్నర్
3) రాష్ట్రపతి
4) రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం మేరకుగవర్నర్
26. రాష్ట్ర శాసన సభలో పదో షెడ్యూల్ కిందఅనర్హతను ఎవరు నిర్ణయిస్తారు?
1) గవర్నర్
2) రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం మేరకు గవర్నర్
3) స్పీకర్
4) రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం మేరకు స్పీకర్
27. కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) సభలో సభ్యునిగా ప్రమాణం చేయని సభ్యుడుసభా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు 2) సభలో సభ్యునిగా ప్రమాణం చేయకుండా ఒక వ్యక్తి సభలో పాల్గొంటే అతడు సభలో పాల్గొన్నప్రతి రోజుకు రూ.500 జరిమానా విధిస్తారు
3) రాష్ట్ర శాసన సభ సభ్యుల జీత భత్యాలను రాష్ట్రశాసన సభ నిర్ణయిస్తుంది.
4) ఒక రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి కేటా యించిన నియోజక వర్గాల్లో మాత్రమే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేయాలి.
No comments:
Post a Comment