1. కింది వాటిలో సాంఘిక కీటకం?
1) ఈగ
2)తేనెటీగ
3) దోమ
4) పైవన్నీ
2. తులసి ఆకులో ఉండే ఔషధం ?
1) మార్సిన్
2) క్వినైన్
3) నింబిన్
4) కేంఫర్
3. మగ గాడిద, ఆడ గుర్రాల సంకర సంతానాన్ని ఏమంటారు?
1) హెన్ని
2) పెన్ని
3) మ్యూల్
4) ఏదీ కాదు
4. కంటిలోని జ్ఞాన భాగం?
1) కర్ణబేరి
2) కటకం
3) నేత్ర పటలం
4) రక్త పటలం
5. డెర్మటాలజీ దేన్ని అధ్యయనం చేస్తుంది?
1) పక్షులు
2) చర్మం, దాని వ్యాధులు
3) గుండె
4) నాడీ కణాలు
6. కంటిలో నేత్ర పటలానికి ముందే ప్రతిబింబం ఏర్పడితే ఆ దృష్టి దోషాన్ని ఏమంటారు?
1) హ్రస్వదృష్టి
2) దీర్ఘదృష్టి
3) వక్రదృష్టి
4) సమదృష్టి
7. విషసర్పాన్ని గుర్తించినప్పుడు, దానికి విరుగుడుగా ఇచ్చే ఇంజక్షన్?
1) ఆంటివేలాట్
2) పాలీవేలెంట్
3) న్యూరో వేలెంట్
4) అనస్థీషియా
8. చేప మాంసంలో ఉండే విటమిన్లు?
1) ఎ,బి
2) బి,సి
3) ఎ,సి
4) ఎ,డి
9. సీరం గొనాడోట్రాపిన్ అనే హార్మోను దేనినుంచి సేకరిస్తారు?
1) గర్భంతో ఉన్న గుర్రాలు
2) మగ గుర్రాలు
3) గర్భంతో ఉన్న గాడిదలు
4) ఆవులు
10. నిమ్మలో గజ్జి తెగులు దేని ద్వారా వస్తుంది?
1) వైరస్
2) శిలీంధ్రాలు
3) బ్యాక్టీరియా
4) పైవన్నీ
11. కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
1) రాబర్ట్ బ్రౌన్
2) రాబర్ట్ హుక్
3) ల్యూవెన్‌హుక్
4) అరిస్టాటిల్
12. ఎర్ర రక్తకణాలు ఎన్ని రోజులు జీవిస్తాయి?
1) 115
2) 110
3) 120
4) 128
13. మొక్కల్లో ఆహారోత్పత్తికి తోడ్పడే ప్లాస్టిడ్?
1) క్రోమోప్లాస్ట్
2) క్లోరోప్లాస్ట్
3) ల్యూకోప్లాస్ట్
4) టోనోప్లాస్ట్
14. కొవ్వును నిల్వ చేసే కణజాలం?
1) ఉపకళ
2) నాడీ కణజాలం
3) లిగమెంట్
4) అడిపోస్
15. పొగాకులోని నికోటిన్ ఏ వ్యవస్థపై ప్రభావం
చూపుతుంది?
1) శ్వాస
2) జీర్ణ
3) నాడీ
4) పైవన్నీ
16. కణంలోని శక్తి ఉత్పాదక కేంద్రం?
1) రైబోసోమ్
2) లైసోసోమ్
3) కేంద్రకం
4) మైటోకాండ్రియా
17. పీహెచ్ అంటే?
1) హైడ్రోజన్ అయాన్ల గాఢత
2) నైట్రోజన్ అయాన్ల గాఢత
3) ఆమ్లం గాఢత
4) క్లోరేట్ల గాఢత
18. ద్రవరూప ఆహారం తీసుకొనే జీవి?
1) ఈగ
2)దోమ
3) సీతాకోకచిలుక
4) పైవన్నీ
19. పిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్?
1) పెప్సిన్
2)లెనిన్
3) ట్రిప్సిన్
4) లైపేస్
20. మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి?
1) 2
2) 3
3)1
4) 4
No comments:
Post a Comment