విష్ణుకుండినులు - Grate Thing

Breaking

Home Top Ad

Wednesday, September 11, 2019

విష్ణుకుండినులు

విష్ణుకుండినులు సామాన్య శకం 4వ శతాబ్దం నుంచి సామాన్య శకం 7వ శతాబ్దం వరకు దక్షిణ తెలంగాణకొన్ని కోస్తాంధ్ర జిల్లాలను పాలించారు. వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ) ఇతను తెలంగాణలోని ఇంద్రపాలనగరం (ఇంద్రపురి) రాజధానిగా పాలన ప్రారంభించాడు. మొదట దక్షిణ తెలంగాణ జిల్లాలలో పాలన ప్రారంభించి క్రమక్రమంగా తూర్పువైపు కృష్ణా-గోదావరి మధ్యప్రాంతాలను ఆక్రమించారు. సాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధికప్రాంతము పాలించిన రాజవంశమిదియే. విష్ణుకుండినుల వంశావళిని విశేషముగా శోధించిన శంకరనారాయణ ప్రకారము సా.శ. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (సా.శ.400-422), మొదటి గోవిందవర్మ (సా.శ.422-462), రెండవ మాధవవర్మ (సా.శ.462-502), మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ.502-527), ఇంద్రభట్టారకవర్మ (సా.శ.527-555), రెండవ విక్రమేంద్రభట్టారక (555-572) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ సా.శ. 613 వరకు పాలించాడు 4వ మాధవవర్మ "జనాశ్రయఛందోవిచ్ఛితి" రచించాడు. ఇది తెలంగాన నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.

విష్ణుకుండినులలో పదునొకండు అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాల గొప్పవాడు. ఇతడు వాకాటకులతో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు. ఈతనిని త్రికూట మలయాధిపతి అంటారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండయే త్రికూట మలయం. ఇంద్రవర్మ పూర్వదేశాధిపతులతో పెక్కు యుద్ధాలు చేసి దక్షిణ కళింగాన్ని నిలుపుకున్నాడు.

విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పశ్చిమాన తెలంగాణలోని కొల్లాపూర్ వరకును, నైరుతిన కీసర వరకు విస్తరించిఉన్నది. కీసరలో ఉన్న కేసరి రామలింగేశ్వరాలయం ఈ కాలంనాటిదే. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. వీరు బహువిధములైన క్రతువులు ఆచరించారు. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. 'ఘటిక' అను విద్యాస్థానాలు స్థాపించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. బౌద్ధవిహారాలు నిర్మించి వాటికి దానాలు చేశారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. ఈ గుహాలయ స్తంభముల మీద పంజా ఎత్తిపెట్టిన సింహప్రతిమ ఉండుటచేత వీరు సింహలాంఛనులని పరిశోధకుల అభిప్రాయము. పలు శాసముల ప్రకారము వీరి రాజధాని శక్రాభిధానపురి నల్లగొండ మండలము తుమ్మలగూడెం వద్ద శిథిలముల రూపమున నుండి, స్థానికులచే ఇంద్రపాలగుట్ట అని పేర్కొనబడునదే శక్రాభిధానపురి అని చెప్పవచ్చును.

తెలుగు సాహిత్యం

నన్నయకు ముందు
నన్నయ యుగము • శివకవి యుగము
తిక్కన యుగము • ఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగము • రాయల యుగము
దాక్షిణాత్య యుగము • క్షీణ యుగము
ఆధునిక యుగము • 21వ శతాబ్ది

చారిత్రక నగరాలు

పిఠాపురం • భట్టిప్రోలు • వేంగి • ధాన్యకటకము
కొలనుపాక • ఓరుగల్లు • విజయపురి • రాజమహేంద్రవరం
కళింగపట్నం • హంపి • సింహపురి • హైదరాబాదు

పరిపాలించిన రాజులు


1.గోవింద వర్మ-1

మొదటి గోవింద వర్మ మహారాజు అనె బిరుదు నామం స్వీకరించినా, ఇంద్రపాలగుట్ట మరియు శ్ర్రీ పర్వత (నాగార్జునకొండ) శాసనల వల్ల ఇతని కుమరుడు మొదటి మాధవ వర్మ సాంరాజ్య స్తాపన చేసాడని తెలుస్తూంది.

2.మాధవ వర్మ-1 (420-455)

ఇతను రాజ్యాన్ని విస్తరించడానికి ప్రధాన కారకుడు.

3.మాధవ వర్మ-2

5వ శతాబ్ది మధ్య కాలం నాటికి రాజ్య విస్తరణ జరిపిన రాజు. 50 సంవత్సరాల ఇతని పరిపాలనను చరిత్రకారులు స్వర్ణయుగంగా అభివర్ణించారు. ఇతని కాలం లోనే ఒక చిన్న రాజ్యాన్ని పెద్ద రాజ్యంగా మార్చారు. ఆనాటి శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటి అయిన వాకాటక రాకుమారిని ఇతని కుమారుడైన విక్రమేంద్రవర్మ వివాహమాడాడు.
ఈ వివాహ సంబందంతో మరింత శక్తిమంతులైన విష్ణుకుండినులు తమ రాజ్యాన్ని మరింతగా విస్తరించారు. ఆనాటి పొరుగు రాజ్యాల్లో ఒకటయిన ఆనందగోత్రికులని (బహుశా కాంచీపురం పల్లవుల సామంతులు) ఓడించి గుంటూరు, తెనాలి, ఒంగోలు ప్రాంతాలను ఆక్రమించారు. ఈ ప్రాంతాలను ఆక్రమించిన తరువాత విష్ణుకుండినులు తమ రాజధానిని అమరపురి (అమరావతి) కి మార్చారు. ఆక్రమించిన ప్రాంతాలను పల్లవుల నించి కాపాడటానికి మాధవ వర్మ ఆ ప్రాంతాలకు పాలకుడిగా తన కుమారుడు దేవ వర్మని, ఆతని తరువాత మనమడు మాధవవర్మ-3 ని నియోగించాడు.
తరువాత మాధవ వర్మ తన చూపు శాలంకాయనుల అధీనంలో ఉన్న వేంగి పైన మరల్చాడు. వేంగిని స్వాధీనం చేసుకోవడంతో గోదావరి డెల్టా రాజ్య సరిహద్దుగా మారింది. తరువాత రాజధానిని మరింత మధ్యగా ఉన్న బెజవాడ (నేటి విజయవాడ) మార్చాడు. ఈ విజయాలు ఇతనికి దక్షిణాధిపతి అనే బిరుదుని సాధించి పెట్టాయి. ఈ విజయాల తరువాత మాధవ వర్మ అనేక అశ్వమేధ, రాజసూయ, వేదిక క్రతువులు చేసాడు.

వారసులు

విష్ణుకుండినుల వారసులలో మొదటి విక్రమేంద్రవర్మ (సా.శ.502-527), ఇంద్రభట్టారకవర్మ (సా.శ.527-555) పెద్దగా పేరు పొందలేదు. పైగా రాజ్యం క్షీణించింది. ఇంద్రభట్టారకవర్మ తన సామంతుడైన కళింగ పాలకుడితో పోరాడుతూ మరణించాడు. గోదావరికి ఎగువన ఉన్న కళింగ రాజ్యాన్ని విష్ణుకుండినులు కోల్పోయారు.

రెండవ విక్రమేంద్రవర్మ (555-569) విష్ణుకుండినుల ప్రాభవాన్ని తిరిగి సాధించాడు. కళింగ ప్రాంతాన్ని కనిపెట్టి ఉంచడానికి తన రాజధానిని బెజవాడ నుండి లెందులూరుకు (ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నదెందులూరు) మార్చాడు. పల్లవ రాజు సింహవర్మన్ చేసిన దాడిని తిప్పికొట్టడమే కాక, కళింగలో తిరిగి అధికారం నెలకొల్పాడు. ఇతని కుమారుడు రెండవ గోవింద వర్మ కొద్దికాలమే పరిపాలించాడు (569-573)
రెండవ గోవింద వర్మ కుమారుడైన జనాశ్రయ మాధవ వర్మ విష్ణుకుండినులలో చివరి గొప్ప రాజు (573-621). ఇతని పరిపాలన మొదట్లో తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కాని తరువాత అంతా దాడులూ ఆక్రమణలే. తన పరిపాలన 37వ సంవత్సరంలో తన సామంతుడైన గుడ్డవిషయ (నేటి రామచంద్రపురం) పరిపాలకుడు దుర్జయ పృథ్వీమహరాజు తిరుగుబాటును అణిచాడు.

మాధవ వర్మకు సవాలు చాళుక్యులతో ఎదురైంది. 616 లో చాళుక్య రాజైన రెండవ పులకేశి అతని సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడు విష్ణుకుండినుల పై దాడి చేశారు. విష్ణుకుండినుల నుంచి వేంగిని వారి సామంతులైన దుర్జయల నుంచి పిఠాపురాన్ని ఆక్రమించారు. తన 48 వ పారిపాలనా సంవత్సరాన బహుశా చాళుక్యులను తరిమికొట్టడానికి మాధవ వర్మ గోదావరి దాటాడు. కానీ యుద్ధరంగాన ప్రాణాలు కోల్పోయాడు. అతని కుమారుడైన మంచన భట్టారకుడు కుడా బహుశా ఇదే యుద్ధంలో మరణించి ఉండవచ్చు.దీనితో విష్ణుకుండినుల రాజ్యం అంతమయింది.

విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. నాణెముల మీద సూర్యగోళపు మధ్యనున్న ఏకతల దేవాయతన రూపం ముద్రించారు. భారతదేశములో ఇట్టి నాణెములు తొలుతగా ప్రవేశపెట్టినవారు విష్ణుకుండినులు.

మూలాలు

  1.  తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 70
  2.  విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి (దేశము-చరిత్ర), మొదటి సంపుటము, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం) గా విభజిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఉత్తరమధ్య యుగము

(పరిచయం ఇక్కడ వ్రాయాలి)

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగము

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో వివిధ యుగాలు, ఆయా సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఇంద్రపాల నగరం

విష్ణుకుండినులు (5,6 శతాబ్దముల కాలము) నాటి ఆంధ్రుల ఔన్నత్యమునకు పతాకమై నిలచిన ప్రాచీనాంధ్ర మహానగరములలో ఇంద్రపురి లేదా ఇంద్రపాల నగరము ఒకటి.ఈనగరము తర తరములనుండి శిథిలమై నేటికి నామమాత్రావశిష్టమై యున్నది. ఇది నల్గొండ లోని రామన్నపేట తాలూకాకు అయిదు మైళ్ళ దూరంలో ఉన్న భువనగిరి రోడ్డుకు ఆనుకొని తుమ్మలగూడమనె గ్రామమున్నది.ఆ గ్రామమునంటి ఒక చెరువున్నది. ఆసఫ్నహర్ కాలువ ద్వారా ఆచెరువులోనికి నీరు ప్రవేశించును.చెరువుకట్ట సుమారు పొడవు రెండున్నర మైళ్ళు ఉండును.ఆచెరువు కట్టకు, మూసీనదిని ఆనుకొని ఉన్న ఇంద్రపాలగుట్టకు మధ్యగల సువిశాల ప్రదేశములో ఈ ప్రాచీనాంధ్ర మహానగరము శిథిలములున్నవి.ఇంద్రపాల నగరము విష్ణుకుండిన ప్రభువుల కావాసమై ఆంధ్ర దేశమునం దానాటి మహానగరములలో నొకటిగా కీర్తింపబడి యుండవచ్చును.
మూసీనదికి అరమైలు దూరములో నాగవరమను గ్రామమున్నది.నాగవరమునకు తుమ్మలగూడెమునకు మధ్యగల దోరము రెండు మైళ్ళు.ఇంద్రపాలగుట్ట, శిథిల నగరము, నాగవరము ఇంచుమించు కలసియే ఉన్నాయి.సుమారు మూడుమైళ్ళ వరకు వ్యాపించిన ఈ నగరపు శిథిల చిహ్నములు నాగవరములోను తుమ్మలగూడెము చెరువులోను, చెరువు కట్టకును ఇంద్రపాల గుట్టకును మధ్యగల విశాల ప్రదేశములోను కనిపించును.

కీసర (కీసర మండలం)

కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలానికి చెందిన గ్రామం.
ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉంది.కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.

గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. దీనికి 100కి.మీ తీరం వుంది. కృష్ణా నది, సముద్రంలో కలిసేవరకు, ఎడమవైపు కృష్ణాజిల్లా, కుడివైపు గుంటూరు జిల్లాను వేరుచేస్తుంది. ఈ జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణములో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగి రాష్ట్రంలో రెండవ పెద్ద జనాభాగల జిల్లాగా గుర్తింపు పొందింది.ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది.మొగలు సామ్రాజ్యం నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమిషన్ వుద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాల ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైంది.
విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. ఈ జిల్లాను మిరపకాయల భూమి అని అంటారు. రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో వుంది. పొగాకు, మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఎగుమతులు.

చాళుక్యులు

చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని క్రీ.శ. 6- 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. ముఖ్యంగా వీరు భారత దేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. ఇక్ష్వాకుల పతనము తర్వాత పల్లవుల ధాటికి తాళలేక వీరు కర్ణాటప్రాంతానికి వెళ్ళారు. దుర్గా ప్రసాద్, అడ్లూరి గారి అభిప్రాయములను బట్టి చాళుక్యుల పూర్వీకులు ఆంధ్రులే. రెండవ పులకేశి మారుటూరు శాసనములో 'చాళుక్య విషయము' ప్రసక్తి గలదు. ఈ చాళుక్య విషయము ప్రస్తుత రాయలసీమలోని కడప-కర్నూలు ప్రాంతము. కర్ణాట దేశమందలి బాదామినేలుతున్న కదంబులనోడించి చాళుక్యులు ఒక మహా సామ్రాజ్యము స్థాపించారు.
చాళుక్యులు ప్రధానంగా
బాదామి చాళుక్యులు
తూర్పు చాళుక్యులు
కళ్యాణి చాళుక్యులు
ముదిగొండ చాళుక్యులు
వేములవాడ చాళుక్యులు
యలమంచిలి చాళుక్యులుగా పాలన కొనసాగించారు.చాళుక్యులు తెలంగాణముగుండా తిరిగి ఆంధ్రదేశము ప్రవేశించి వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, చాళుక్య చోళులు మున్నగు శాఖలుగా పరిపాలన చేశారు.

తిరుమల శాసనాలు

తిరుమల శాసనాలలో క్రీస్తుశకం 830 వ సంవత్సరంలో పల్లవ రాజైన విజయదంతివర్మన్‌ శాసనం అతి ప్రాచీన మైనదిగా గుర్తింపు పొందింది.
అందులో పల్లవరాజు సామంతుడైన ఉళగప్పేదుమానార్‌ అనే వ్యక్తి తిరుమల నిత్య దూపదీప నైవేద్యాల కోసం 30 కళంజముల బంగారం చెల్లించినట్లు తెలుస్తున్నది.
తిరుమలేశుని దివ్య చరిత్ర ఆధునీకులకు తెలియచేయడంతో శాసనాలు నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది.

తెలంగాణ

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి మరియు జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్ హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీసీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

దేవసేన

దేవసేన (క్రీస్తుపూర్వం 450 - క్రీ.శ. 475) ) వాకాటక రాజవంశం యొక్క వత్సగుల్మ శాఖ యొక్క రాజు. అజంతా గుహలు పోషకుడిగా, ప్రముఖుడుగా పేరుపొందిన ఇతని కుమారుడు హరిసేన విజయవంతముగా పరిపాలన చేశాడు. ఇతని కుమార్తె విష్ణుకుండినులు చక్రవర్తి అయిన రెండవ మాధవవర్మ జనాశ్రయాను వివాహం చేసుకున్నది.
అజంతా 16 గుహ వద్ద హరిషేనా యొక్క మంత్రి అయిన వరాహదేవ, హరిసేన యొక్క వంశవృక్షాన్ని దాని పోషకుడు మరియు రికార్డులు; అలాగే వరాహదేవ మరియు అతని తండ్రి హస్తిభోజ వివరణ పొందుపరచ బడ్డాయి. వరాహదేవ తన రాజును సేవించినందున, హస్తిభోజ, దేవసేనకు పనిచేశాడు. దేవసేన ఆనందం కోసం హస్తిభోజకు రాజ్యం నిర్వహణ బాధ్యత అప్పగించగా ఆ ముసుగులో రాజుగా ఉండటంతో దేవసేనకు సేవచేసి తనను తాను నిలబెట్టుకున్నాడు. హిస్సే-బోరాలా రాతి శాసనాలు నందు, సుదర్శన అనే ట్యాంక్ దేవసేన ఆధ్వర్యంలోని ఒక అధికారి అయిన స్వమిల్లదేవచే సృష్టించబడింది.

బహమనీ సామ్రాజ్యము

బహమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్‌ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్‌ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా, ఢిల్లీ సుల్తాన్‌, ముహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్‌ (బీదర్‌) కు తరలించారు. బహమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, మరియు గోల్కొండ సల్తనత్, దక్కన్‌ సల్తనత్ లుగా పేరు పొందాయి.

రాష్ట్రకూటుల శాసనాలు

28.(ఆ.రి.నెం. 331 1905వ సంవత్సరము)
ఇటీవల వైఎస్ఆర్ జిల్లా,జమ్మలమడుగు తాలూకా, దనవులపాడు గ్రామములో కనుగొనిన పాడుబడిన జైన మందిరములోని జైన విగ్రహము ముందున్న pedestal చుట్టూ.తేదీ నిర్ధారితము కాలేదు.నిత్య వర్షుని పరిపాలనా కాలములో ఒక శాంతి అనునతడు శిలాపీఠమును ప్రతిష్ఠించెనని చాటుచున్నది.29.(ఆ.రి.నెం. 391 1904వ సంవత్సరము)
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, మాలెపాడు గ్రామములోని గోపాలకృష్ణస్వామి ఆలయము వెనుక పడి ఉన్న బండ మీద.తేదీ నిర్ధారితము కాలేదు.నిత్య వర్షుని పరిపాలనా కాలములో, వల్లవరాజ యొక్క పట్టమహిషి మరియు ఇతరులు, ఇంత మొత్తము అని వరి ధాన్యము పండే భూమిని వీరిపర్తికి చెందిన నూటెనిమిది మందికి దానమిచ్చెనని చాటుచున్నది. పలు వ్యక్తుల (ఆడా మరియు మగా) పేర్లు పేర్కొనబడినవి.

రాష్ట్రకూటులు

రాష్ట్రకూట వంశం బహు ప్రాచీనమైంది. క్రీ.శ. 6వ శతాబ్దం నుండి ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశంన పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానంలు స్థాపించి, పాలన చేసారు.వీరు తొలుత చాళుక్యులకు సామంతులు.ఇప్పటి మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంనేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యం చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. అద్వితీయ బలపరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధంలో మరణించాడు. రాజ్యం చేసిన కొద్దికాలంలోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశాలను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశంనకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.

రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు

రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి.
నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము , 1195
వేల్పూరు శాసనము, 1199
నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 2 , 1202
నామి రెడ్డి నాగులపాడు శాసనము, 1202
ఎఱకసాని పిల్లలమర్రి శాసనము, 1208
పిల్లలమర్రి శాసనము, కాలము తెలీదు
నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 3 కాలము తెలీదు
ద్రాక్షారామ శాసనము , 1212
చిట్యాలంపాడు శాసనము, 1213
బేతిరెడ్డి సోమవరము శాసనము, 1213
ఎలకుర్తి శాసనము
సోమవరము శాసనము
పాలంపేట శాసనము , 1213
పెద్ద గణపతిరెడ్ది ద్రాక్షారామ శాసనము
డిచ్చకుంట శాసనము
మాచాపూర్ శాసనము
రామన్న పేట శాసనము , 1213
ఊటూరు శాసనము , 1216
మాచాపూర్ శాసనము, 1217
డిచ్చకుంట శాసనము 2, 1217
తాడువాయి శాసనము
నాగులపాడు శాసనము, 1234
సోమవరము శాసనము, 1234
గొడిశాల శాసనము , 1235
ఉప్పరపల్లి శాసనము , 1236
దోసపాడు శాసనము, 1254
కామిరెడ్డి నాగులపాడు శాసనము , 1258
కామిరెడ్డి అన్నవరము శాసనము, 1258
గణపి రెడ్డి మర్రెడ్ల నాగులపాడు శాసనము
నాగులపాడు శాసనము
ధర్మారావు పేట శాసనముఈ శాసనములలో కొన్ని సంస్కృతమునందూ, కొన్ని తెలుగునందూ, కొన్నీ రెండు భాషలయందూ ఉన్నాయి.

విష్ణుకుండినుల శాసనాలు

(ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము)గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీదతేదీ నిర్ధారితము కాలేదు.ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది మరియు అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు విష్ణుకుండి మరియు ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి. అంతేకాక ఈ గ్రామ చరిత్ర కలిగినది,వేల్పూరులొ పెద్దదెవుని దేవాలయము చాలా గొప్పది, ఇది క్రిస్తు .పూ రెండవ శతాబ్దములొ నిర్మితమైనది.ఈ గ్రామములొని చరిత్ర మొత్తము రామలింగస్వామి దేవాలయముతొ ముడిపడి ఉన్నది.దిని వలన ఈదేవాలయ చరిత్ర్ర తెలుసుకొనిన గ్రామ చరిత్ర తెలుసుకొనవచ్చు.
వేంగి
క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని 'వేంగి రాజ్యం అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని 'వేంగి నగరం లేదా విజయవేంగి అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం పెదవేగి అనే చిన్న గ్రామం. ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
వేంగి రాజ్యం ఉత్తరాన గోదావరి నది, ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన కృష్ణానది మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు చాళుక్యుల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.
శాసనం
శాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు.
ఇలాంటి శాసనాలకు భారత్ లో ఉదాహరణలు:
అశోకుడి (శిలా) శాసనం.

No comments:

Post a Comment

Pages

close