తూర్పు చాళుక్యులు - Grate Thing

Breaking

Home Top Ad

Thursday, September 12, 2019

తూర్పు చాళుక్యులు

తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము.

తూర్పు చాళుక్యుల రాజ్య అవతరణ



పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు



ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేసి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని (ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేసి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ తన ప్రతినిధిగా నియమించాడు. రెండవ పులకేసి మరణించాక ఈ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఒక స్వతంత్ర వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. క్రీ.శ.641-705 మధ్య తూర్పు చాళుక్య పరిపాలనలో మొదటి జయసింహ మరియు మంగి యువరాజు తప్పితే మిగతా రాజుల పరిపాలన కాలం చాల తక్కువగా ఉంది. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల పరిపాలన మరింత క్షీణించింది. అప్పుడు రాష్ట్రకూటులు మరియు పశ్చిమ బాదామి చాళుక్యులు వేంగి సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. మూడవ గుణగ విజయాదిత్యుని పాలనలో అప్పటి రాష్ట్రకూట రాజు అమోఘవర్షునితో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మూడవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులకు సామంత రాజుగా ఉన్నాడు. అమోఘవర్షుడు మరణించిన తరువాత మూడవ విజయాదిత్యుడు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నాడు. తూర్పు చాళుక్యులు అగ్నివేస్య, కౌండిన్య, కౌశిక, గౌతమ, పరాశర, భరద్వాజ, వత్స, శాండిల్య, సంకృతి, హరిత గోత్రములకు చెందినవారని పలువురి అభిప్రాయం. తణుకు తాలూకా జుత్తిగ గ్రామంలో గల సోమేశ్వరుని ఆలయంలో లభించిన శిలశాసనాలు (A. R. No. 748 of 1920.), (A. R. No. 746 of 1920.), తూర్పు గోదావరి జిల్లాలోని ఆడ్డతీగల తాలూకా డి-భీమవరంలో భీమేశ్వర ఆలయంలోని లభించిన శిలాశాసనం (A. R. No. 337 of 1919.) బట్టి తూర్పు చాళుక్యులు చంద్రవంశానికి చెందినవారని తెలుస్తున్నది.

పరిపాలనా యంత్రాంగం

తూర్పు చాళుక్యుల పరిపాలన ప్రారంభంలో వారి రాజ్యసభ బాదామి గణతంత్ర రాజ్య సభగా ఉండేది. తరువాతి కాలంలో రాజ్యంలో సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. వీరు ప్రక్క రాజులైన చోళులు, రాష్ట్రకూటులు, పల్లవులు మరియు కళ్యాణి చాళుక్యులతోను మిత్రత్వం ఉన్నా శత్రుత్వం ఉన్నా సఖ్యతగా మెలిగేవారు. తూర్పు చాళుక్య పరిపాలన యంత్రాంగం హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సప్తాంగాలతో, పద్దెనిమిది శాఖలతో ఉండేది.
  1. మంత్రి
  2. పురోహితుడు
  3. సేనాపతి
  4. యువరాజు
  5. ద్వారపాలిక
  6. ప్రధాని
  7. అధ్యక్ష (విభాగానికి అధ్యక్షుడు) మొదలైనవి .
పరిపాలన ఏవిధంగా జరిగిందని వివరించడానికి ఆధారాలు లేవు. లభించిన ఆధారాల ప్రకారం విషయం, కొట్టం అనే రెండు ఉపవిభాగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కమ్మకొట్టం లేదా కమ్మనాడు మరియు బోయ కొట్టం. రాజ్యంలో దానంగా ఇవ్వబడిన కానుకలు మరియు గ్రామాల వివరాలు రాజ్యప్రకటన కాగితాలు వ్రాసేవారు తమ రికార్డులలో వ్రాసుకొనేవారు. వీటిని నియోగి కవల్లభలు అని పిలిచేవారు వాటికి కప్పం ఉండేది కాదు. ఈ మాన్యాలను శిలాశాసనాలలో పొందు పరచేవారు. మిగిలిన గ్రామాలలో కప్పాలు వసూలు చేయడం జరిగేది. వంశపారపర్యంగా వచ్చే ఆస్తి వల్ల, బయటి వారు ఆక్రమించుకోవడం వల్ల భూముల మీద తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రాజ్యం చిన్న చిన్న విభాగాలుగా విభజించబడింది. వీటిలో ముఖ్యమైనవి ఎలమంచిలి, పిఠాపురం ముదిగొండ. ఈ విభాగాల వారిలో ముఖ్యమైన క్షత్రియ రాజులైన కోన హైహయలు, హైహేయలు, కాలచూరి, కోట, ఛాగి, పరిఛ్ఛేద, వంశజులతో తూర్పు చాళుక్యు రాజులకు వివాహ సంబంధాలు ఉండేవి. వెలనాడు, కొండ అదమటి, మొదలైన క్షత్రియులు కాని వంశాల వారితో కూడా వివాహ సంబంధాలు ఉండేవి.

సమాజం

వేంగి సామ్రాజ్యంలోని ప్రజలు అభ్యుదయ భావాలు కలిగినవారు. తూర్పు చాళుక్యుల రాజ్యం విస్తరించాక హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు రాజ్యం అంతా తిరిగి అక్కడి ప్రజల గురించి ఉదాత్త స్వభావం కలవారని, నల్లటి ఛాయ కలిగిన వారని, కళలు అంటే అత్యంత ప్రీతి కలిగిన వారని వ్రాసుకొన్నాడు. సమాజంలోని ప్రజలు వంశ పారంపర్యంగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. ముందు నిరాకరించినా బౌద్ధులు, జైనులు కూడా వర్ణాలు పాటించేవారు.చాళుక్యులు క్షత్రియ కులస్తులు.వీరు తమిళులైన చోళులను వివాహాలు చేసుకున్నారు.కాక బోయ, సరవర అనే తెగలు కూడా ఉండేవి.
చతుర్వర్ణాలు : బ్రాహ్మణులు సమాజంలో గౌరవాన్ని అనుభవించారు. వీరు శాస్త్రాలు, వేదాలలో ప్రావీణ్యత కలిగినవారు. వీరికి రాజులు భూములు, నిధులు విరాళంగా ఇచ్చేవారు. వీరు పరిపాలన యంత్రాంగంలో మంత్రుల వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుభవించేవారు. కొంత మంది బ్రాహ్మణులు సైన్యంలో చేరి ఉన్నత పదవులు అనుభవించారు.
క్షత్రియులు పరిపాలనా వర్గానికి చెందిన వారు. వీరికి యుద్ధమంటే ఉన్న ప్రీతి వల్ల రెండు శతాబ్దాలపాటు యుద్ధాలు జరిగాయి.
వైశ్యులు: ఈ వర్ణానికి చెందినవారి హస్తాలలో వర్తకం అభివృద్ధి చెందింది. వీరి సంఘం చాలా శక్తి వంతమైన సంఘంగా పెనుగొండ వద్ద ఉండేది. దీనికి 17 శాఖలు ఉండేవి. సమాజ కార్యకలాపాలు చూడడానికి సమయ మంత్రి ఉండేవాడు.
శూద్రులు: ఈ వర్ణం వారు సమాజంలో అధిక సంఖ్యలో ఉండేవారు. వీరిలో మళ్ళీ వివిధ తెగలు ఉండేవి. సైన్యములో వీరికి ఉద్యోగాలు కల్పించబడేవి. ప్రతిభ చూపిన వారికి రాజ్యంలో సామంత రాజుల లేదా మాండలికుల హోదా కల్పించబడేది.

మతాలు - వాటి ఆదరణ

శాతవాహనుల కాలంలో ప్రబలంగా ఉన్న బౌద్ధ మతం చాళుక్యుల కాలానికి క్షీణించింది. బౌద్ధాశ్రమాలు నిర్మానుష్యంగా ఉండేవి. బౌద్ధ స్థూపాల వద్ద నివాసం ఏర్పాటు చేసుకొన్నవారు ఆ స్థూపాలను అంటిపెట్టుకొని ఉండేవారు. అప్పటి చైనా రాయబారి హుయాన్ త్సాంగ్ అందించిన ఆధారాల ప్రకారం 20 బౌద్ధాశ్రమాలు, ప్రతి ఆశ్రమంలోను 3000 బౌద్ధ సన్యాసులు నివసించేవారు. బౌద్ధ మతం క్షీణించినా జైనమతం ప్రజల ఆదరణ కలిగి ఉంది. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాలలో శిథిలమైన విగ్రహాలు చూస్తే తెలుస్తుంది. తూర్పుచాళుక్య రాజులు జైన దేవాలయాలకు నిధులు, విరాళాలు ఇచ్చేవారని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తున్నది. కుబ్జ విష్ణువర్థనుడు, మూడవ విష్ణువర్థనుడు, రెండవ అమ్మ జైన మతాన్ని ఆదరించారని తెలుస్తోంది. విమలాదిత్యుడు, మహావీరుని నియమాలను పాటించాడని తెలుస్తోంది. అప్పట్లో విజయవాడ, జెనుపాడు, పెనుగొండ, మునుగొండ ప్రసిద్ధ జైన క్షేత్రాలు. హిందూ మతం చాళుక్యుల పరిపాలన కాలంలో రాజ్య మతం. హిందూ మతంలోని రెండు విభాగాలలో వైష్ణవం కంటే శైవంకు ఆదరణ ఎక్కువగా ఉండేది. కొంతమంది రాజులు తమను తామే చక్రవర్తులుగా ప్రకటించుకొన్నారు. బౌద్ధ క్షేత్రాలు వీరి కాలంలో శైవ క్షేత్రాలుగా పరిణతి చెందాయి. తూర్పు చాళుక్య రాజులైన రెండవ విజయాదిత్యుడు, మెదటి యుద్ధమల్ల, మూడవ విజయాదిత్యుడు, మెదటి భీముడు శివాలయాలు నిర్మించడం మీద ఆసక్తి చూపారు. దేవాలయాలు దైవారాధనకే కాక నృత్యం, సంగీతం, మొదలైన కళలకు వేదికగా ఉండేవి.

సాహిత్యం

తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పండరంగని శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.

శిల్ప సంపద

శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించడం జరిగింది. రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడని ప్రతీతి. యుద్ధమల్ల విజయవాడలో కార్తికేయుడి దేవాలయాన్ని నిర్మించాడు. ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామంలోని దేవాలయాన్ని, సామర్లకోటలోని చాళుక్య భీమేశ్వర దేవాలయాన్ని కూడా నిర్మించాడని చెబుతారు. పశ్చిమ గోదావరి జిల్లా కలిదిండిలో రాజరాజ నరేంద్రుడు మూడు స్మారక క్షేత్రాలు ఏర్పాటు చేశాడు. తూర్పు చాళుక్యులు చోళ రాజుల, చాళుక్యుల శిల్పశైలిని అనుసరించినా, వారి శిల్పశైలి విభిన్నంగా ఉంది. వారి శిల్పశైలి చెప్పడానికి పంచారామాలలోనున్న దేవాలయాలు, ద్రాక్షారామంలోనున్న భీమేశ్వరాలయం, బిక్కవోలులోనున్న గోలింగేశ్వర దేవాలయం నిదర్శనాలు. బిక్కవోలు లోనున్న గోలింగేశ్వర దేవాలయంలో చెక్కబడిన అర్థనారీశ్వరుడు, శివుడు, విష్ణువు, అగ్ని, చాముండి, సూర్యుడు మొదలైన విగ్రహాలు అప్పటి శిల్పకళను చూపడానికి నిదర్శనాలు.

పాలించిన రాజులు:

  • కుబ్జ విష్ణువర్ధనుడు (624 – 641 C.E.)
  • జయసింహ 1 (641 – 673 C.E.)
  • ఇంద్రబట్టారకుడు (673 C.E., seven days)
  • విష్ణువర్ధనుడు 2 (673 – 682 C.E.)
  • మాంగే యువరాజా (682 – 706 C.E.)
  • జయసింహ 2 (706 – 718 C.E.)
  • కొక్కిలి (718-719 C.E., six months)
  • విష్ణువర్ధనుడు III (719 – 755 C.E.)
  • విజయ ఆదిత్య I (755 – 772 C.E.)
  • విష్ణువర్ధన IV (772 – 808 C.E.)
  • విజయ్ ఆదిత్య II (808 – 847 C.E.)
  • విష్ణువర్ధన V (847– 849 C.E.)
  • గుణగ విజయాదిత్యుడు లేదా విజయాదిత్య III (849 – 892 C.E.) తన సోదరులతో: విక్రం ఆదిత్య I, యుద్ధ మల్ల I
  • చాళుక్య భీమ I (892 – 921 C.E.)
  • విజయ్ ఆదిత్య IV (921 C.E., 6 నెలలు)
  • అమ్మ I, విష్ణువర్ధన VI (921 – 927 C.E.)
  • విజయ్ ఆదిత్య V (927 C.E., 15 రోజులు)
  • తదప (927 C.E., 1 నెల)
  • విక్రం ఆదిత్య II (927 – 928 C.E.)
  • చాళుక్య భీమ II (928 - 929 C.E.)
  • యుద్ధ మల్ల II (929 – 935 C.E.)
  • చాళుక్య భీమ III, విష్ణువర్ధన VII (935 – 947 C.E.)
  • అమ్మ II (947 – 970 C.E.)
  • దానర్ణవ (970 – 973 C.E.)
  • జాత చోడ భీమ (973 - 999 C.E.)
  • శక్తి వర్మ I (999 - 1011 C.E.)
  • విమలాదిత్య (1011 – 1018 C.E.)
  • రాజరాజ I నరేంద్ర విష్ణువర్ధన విష్ణువర్ధనుడు VIII (1018 – 1061 C.E.)
  • శక్తి వర్మ II (1062 C.E.)
  • విజయ్ ఆదిత్య VI (1063 – 1068 C.E., 1072 – 1075 C.E.)
  • రాజరాజ II (1075 - 1079)
  • వీర చోళ విష్ణువర్ధన IX (1079 - 1102

బయటి లింకులు

ఆంధ్ర క్షత్రియులు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం) గా విభజిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ


ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో వివిధ యుగాలు, ఆయా సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కాకతీయులు


కాకతీయులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు . శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.
కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).

కుబ్జ విష్ణువర్ధనుడు


కుబ్జ విష్ణువర్ధనుడు బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి తమ్ముడు. క్రీ.శ. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించినాడు. ముందు తన అన్న పులకేశి కి గవర్నరుగా వేంగిని పాలించిన కుబ్జవిష్ణువర్ధనుడు తర్వాత క్రమంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని తూర్పు చాళుక్య వంశానికి పునాది వేశాడు.
తూర్పు చాళుక్యులు వేంగి రాజ్యాన్ని దాదాపు అయిదు శతాబ్ధాలు పాలించారు. వీరు చోళులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు.

చాళుక్యులు


చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని క్రీ.శ. 6- 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. ముఖ్యంగా వీరు భారత దేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. ఇక్ష్వాకుల పతనము తర్వాత పల్లవుల ధాటికి తాళలేక వీరు కర్ణాటప్రాంతానికి వెళ్ళారు. దుర్గా ప్రసాద్, అడ్లూరి గారి అభిప్రాయములను బట్టి చాళుక్యుల పూర్వీకులు ఆంధ్రులే. రెండవ పులకేశి మారుటూరు శాసనములో 'చాళుక్య విషయము' ప్రసక్తి గలదు. ఈ చాళుక్య విషయము ప్రస్తుత రాయలసీమలోని కడప-కర్నూలు ప్రాంతము. కర్ణాట దేశమందలి బాదామినేలుతున్న కదంబులనోడించి చాళుక్యులు ఒక మహా సామ్రాజ్యము స్థాపించారు.
చాళుక్యులు ప్రధానంగా
బాదామి చాళుక్యులు
తూర్పు చాళుక్యులు
కళ్యాణి చాళుక్యులు
ముదిగొండ చాళుక్యులు
వేములవాడ చాళుక్యులు
యలమంచిలి చాళుక్యులుగా పాలన కొనసాగించారు.చాళుక్యులు తెలంగాణముగుండా తిరిగి ఆంధ్రదేశము ప్రవేశించి వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, చాళుక్య చోళులు మున్నగు శాఖలుగా పరిపాలన చేశారు.

తిరుమల శాసనాలు


తిరుమల శాసనాలలో క్రీస్తుశకం 830 వ సంవత్సరంలో పల్లవ రాజైన విజయదంతివర్మన్‌ శాసనం అతి ప్రాచీన మైనదిగా గుర్తింపు పొందింది.
అందులో పల్లవరాజు సామంతుడైన ఉళగప్పేదుమానార్‌ అనే వ్యక్తి తిరుమల నిత్య దూపదీప నైవేద్యాల కోసం 30 కళంజముల బంగారం చెల్లించినట్లు తెలుస్తున్నది.
తిరుమలేశుని దివ్య చరిత్ర ఆధునీకులకు తెలియచేయడంతో శాసనాలు నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది.

తూర్పు


తూర్పు (East) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఉదయించేసూర్యుడుకి ఎదురుగా నిలబడితే మన ముందు ఉన్న దిశను తూర్పు అని అంటారు. సాధారణంగా ఉపయోగించే మాప్ లో తూర్పు దిక్కు కుడి వైపున ఉంటుంది.
తూర్పు దిశను "పూర్వ దిశ" అని కూడా అంటారు. పడమర దిక్కు దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.

తూర్పు గాంగులు


తూర్పు గాంగులు మధ్యయుగ భారతదేశానికి చెందిన సామ్రాజ్య పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రముతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బంగ లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది. వారి రాజధాని కళింగ నగరం లేదా ముఖలింగం (శ్రీకాకుళం జిల్లా). కోణార్క సూర్య దేవాలయం (ప్రపంచ వారసత్వ ప్రదేశం) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు.
పశ్చిమ గాంగుల సంతతి వాడైన, అనంత వర్మన్ చోడగాంగునిచే ఈ రాజ్యం స్థాపించబడింది. తూర్పు చాళుక్యులు, చోళులతో సంబంధ బాంధవ్యాలు కలిగిన తూర్పు గాంగులు, తమ దక్షిణ దేశ సంస్కృతిని ఒరిస్సా ప్రాంతానికి వ్యాపింపజేశారు. వీరి కాలంలో 'ఫణం' అని పిలువబడిన నాణేలు, చెలామణీలో ఉండేవి. రాజ్యస్థాపికుడైన అనంతవర్మ చోళగాంగుడు, హైందవ మతాభిమాని మరియు లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించాడు. అనంత వర్మ అనంతరం అనేకమంది గాంగ రాజులు కళింగని పరిపాలించారు. వారిలో చెప్పుకోదగినవారిలో నరసింహదేవ వర్మ - 2 (1238–1264), ముఖ్యుడు. నరసింహదేవ వర్మ - 2 నిర్మింపజేసిన ఆలయాల్లో కోణార్క సూర్య దేవాలయం, శ్రీ కూర్మనాధుని దేవాలయం (శ్రీకూర్మం), వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సింహాచలం ముఖ్యమైనవి.
బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన ముస్లిం దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది.

తెలుగు ప్రజలు


తెలుగు ప్రజలు భారతదేశంలోని ద్రవిడ జాతికి చెందిన సమూహం. ప్రపంచంలో ఉన్న పెద్ద జాతి సమూహలలో తెలుగు జాతి ఒకటి. తెలుగు ప్రజలలో అధికులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో నివసిస్తారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక పూర్వం, తెలుగు మాట్లాడే ప్రాంతం చాలా విశాలంగా వుండేది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ మరియు ఒడిషా రాష్ట్రాలకు చెందిన అనేక ప్రాంతాలలో తెలుగు సంస్కృతి మరియు భాష కలిగిన వారు వుండేవారు, ఇప్పటికీ ఉన్నారు.
దేశాంతరాల్లో కూడా తెలుగు ప్రజలు నివాసాలేర్పరచుకున్నారు. 18-19 శతాబ్దాల కాలంలో శ్రీలంక మధ్య, తూర్పు ప్రాంతాలను తెలుగు రాజులు పరిపాలించారు కూడా. స్వాతంత్ర్యానికి పూర్వం అనేకమంది తెలుగువారు మయాన్మార్ వలసవెళ్ళి ఆక్కడే స్థిరపడిపోయారు.

తెలుగు సాహిత్యం - నన్నయ యుగము


తెలుగు సాహిత్యంలో క్రీ.శ. 1000 నుండి 1100 వరకు నన్నయ యుగము అంటారు.

పెదవేగి


పెదవేగి (Pedavegi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, అదే పేరున్న గ్రామము.. పిన్ కోడ్: 534 450. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మండలాల్లో ఇది ఒకటి. పెదవేగి గ్రామము పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము అయిన ఏలూరుకు 12 కి.మీ. దూరములో ఉంది. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3153 ఇళ్లతో, 11846 జనాభాతో 4297 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6033, ఆడవారి సంఖ్య 5813. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3690 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 137. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588377.పిన్ కోడ్: 534003.
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి, పెదవేగిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

రాజరాజ నరేంద్రుడు


రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ. 1019–1061) దక్షిణ భారతదేశంలో వేంగి రాజ్యం యొక్క తూర్పు చాళుక్య రాజు. వివాహ మరియు రాజకీయ లింకుల ద్వారా తంజావూరు యొక్క చోళులతో రాజరాజకు సంబంధముంది. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం (రాజమండ్రి) స్థాపించాడు. అతని కాలం సామాజిక మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.

రాజు పేరు


రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో తూర్పు చాళుక్యులు , చాళుక్య-చోళులు ,విష్ణుకుందిని ,భట్ట రాజులుగజపతి రాజులు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు.
ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది.

రాష్ట్రకూటుల శాసనాలు


28.(ఆ.రి.నెం. 331 1905వ సంవత్సరము)
ఇటీవల వైఎస్ఆర్ జిల్లా,జమ్మలమడుగు తాలూకా, దనవులపాడు గ్రామములో కనుగొనిన పాడుబడిన జైన మందిరములోని జైన విగ్రహము ముందున్న pedestal చుట్టూ.తేదీ నిర్ధారితము కాలేదు.నిత్య వర్షుని పరిపాలనా కాలములో ఒక శాంతి అనునతడు శిలాపీఠమును ప్రతిష్ఠించెనని చాటుచున్నది.29.(ఆ.రి.నెం. 391 1904వ సంవత్సరము)
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, మాలెపాడు గ్రామములోని గోపాలకృష్ణస్వామి ఆలయము వెనుక పడి ఉన్న బండ మీద.తేదీ నిర్ధారితము కాలేదు.నిత్య వర్షుని పరిపాలనా కాలములో, వల్లవరాజ యొక్క పట్టమహిషి మరియు ఇతరులు, ఇంత మొత్తము అని వరి ధాన్యము పండే భూమిని వీరిపర్తికి చెందిన నూటెనిమిది మందికి దానమిచ్చెనని చాటుచున్నది. పలు వ్యక్తుల (ఆడా మరియు మగా) పేర్లు పేర్కొనబడినవి.

రాష్ట్రకూటులు


రాష్ట్రకూట వంశం బహు ప్రాచీనమైంది. క్రీ.శ. 6వ శతాబ్దం నుండి ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశంన పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానంలు స్థాపించి, పాలన చేసారు.వీరు తొలుత చాళుక్యులకు సామంతులు.ఇప్పటి మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంనేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యం చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. అద్వితీయ బలపరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధంలో మరణించాడు. రాజ్యం చేసిన కొద్దికాలంలోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశాలను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశంనకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.

రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు


రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి.
నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము , 1195
వేల్పూరు శాసనము, 1199
నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 2 , 1202
నామి రెడ్డి నాగులపాడు శాసనము, 1202
ఎఱకసాని పిల్లలమర్రి శాసనము, 1208
పిల్లలమర్రి శాసనము, కాలము తెలీదు
నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 3 కాలము తెలీదు
ద్రాక్షారామ శాసనము , 1212
చిట్యాలంపాడు శాసనము, 1213
బేతిరెడ్డి సోమవరము శాసనము, 1213
ఎలకుర్తి శాసనము
సోమవరము శాసనము
పాలంపేట శాసనము , 1213
పెద్ద గణపతిరెడ్ది ద్రాక్షారామ శాసనము
డిచ్చకుంట శాసనము
మాచాపూర్ శాసనము
రామన్న పేట శాసనము , 1213
ఊటూరు శాసనము , 1216
మాచాపూర్ శాసనము, 1217
డిచ్చకుంట శాసనము 2, 1217
తాడువాయి శాసనము
నాగులపాడు శాసనము, 1234
సోమవరము శాసనము, 1234
గొడిశాల శాసనము , 1235
ఉప్పరపల్లి శాసనము , 1236
దోసపాడు శాసనము, 1254
కామిరెడ్డి నాగులపాడు శాసనము , 1258
కామిరెడ్డి అన్నవరము శాసనము, 1258
గణపి రెడ్డి మర్రెడ్ల నాగులపాడు శాసనము
నాగులపాడు శాసనము
ధర్మారావు పేట శాసనముఈ శాసనములలో కొన్ని సంస్కృతమునందూ, కొన్ని తెలుగునందూ, కొన్నీ రెండు భాషలయందూ ఉన్నాయి.

విష్ణుకుండినుల శాసనాలు


(ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము)గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీదతేదీ నిర్ధారితము కాలేదు.ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది మరియు అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు విష్ణుకుండి మరియు ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి. అంతేకాక ఈ గ్రామ చరిత్ర కలిగినది,వేల్పూరులొ పెద్దదెవుని దేవాలయము చాలా గొప్పది, ఇది క్రిస్తు .పూ రెండవ శతాబ్దములొ నిర్మితమైనది.ఈ గ్రామములొని చరిత్ర మొత్తము రామలింగస్వామి దేవాలయముతొ ముడిపడి ఉన్నది.దిని వలన ఈదేవాలయ చరిత్ర్ర తెలుసుకొనిన గ్రామ చరిత్ర తెలుసుకొనవచ్చు.

వేంగి


క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని 'వేంగి రాజ్యం అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని 'వేంగి నగరం లేదా విజయవేంగి అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం పెదవేగి అనే చిన్న గ్రామం. ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
వేంగి రాజ్యం ఉత్తరాన గోదావరి నది, ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన కృష్ణానది మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు చాళుక్యుల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.

శాసనం


శాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు.

No comments:

Post a Comment

Pages

close