IMPORTANT BITS ON INDIAN HISTORY l TELUGU - Grate Thing

Breaking

Home Top Ad

Friday, October 11, 2019

IMPORTANT BITS ON INDIAN HISTORY l TELUGU



1. జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు జరిగిన ఏ సంఘటన భారతీయుల్లో జాతి పరంగా ఏకం
కావాలనే చైతన్యాన్ని అధికం గా కలిగించింది? 
ఎ) ఇల్బర్ట్ బిల్లు వివాదం (1883) 
బి) సివిల్ సర్వీసెస్ వయోపరిమితి తగ్గింపు (1866) 
సి) ఆయుధ నియంత్రణ చట్టం (1878) 
డి) ప్రాంతీయ భాషా పత్రికల చట్టం(1879) 

2. 'ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా' గ్రంథ రచయిత ఎవరు? 
ఎ) వెడ్డర్ బర్న్ 
బి) జార్జ్ యూల్
సి) విలియం డిగ్బీ
డి) ఎ.ఒ. హ్యూమ్ 

3. జాతీయ కాంగ్రెస్ కు పునాది వేసిన సంస్థగాకింది వాటిలో దేన్ని పేర్కొంటారు? 
ఎ) ఇండియన్ అసోసియేషన్ 
బి) ఇండియన్ సొసైటీ 
సి) ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 
డి) ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ 

4.తొలిసారిగా భారత జాతీయ జెండా (ఆకు పచ్చ, ఎరుపు, పసుపు రంగులతో కూడిన
త్రివర్ణపతాకం)ను ఎగరవేసింది/ఆవిష్కరిం చింది ఎవరు? 
ఎ) మేడం బికాజీ కామా 
బి) తారకానాథ్ దాస్ 
సి) రాస్ బిహారీ బోస్
డి) అనిబీసెంట్ 

5. పారిశ్రామికీకరణ అధారంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి 1938లో '
జాతీయ ప్రణాళికా కమిటీ'ని ఏర్పాటు చేసింది ఎవరు? 
ఎ) రమేష్ చంద్రదత్ 
బి) సుభాష్ చంద్రబోస్ 
సి) మోతీలాల్ నెహ్రూ
డి) జవహర్లాల్ నెహ్రూ 

6. జాతీయ కాంగ్రెస్ పరోక్ష సహకారంతో నిర్వ హించిన 'వైకోయం సత్యాగ్రహం' దేనికి సంబంధించింది? 
ఎ) నిమ్నజాతుల దేవాలయ ప్రవేశం 
బి) భూమిశిస్తు తగ్గింపు 
సి) వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా
డి) భూస్వాములకు వ్యతిరేకంగా 

7. బెర్కిలీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత, వేదాంత ఆచార్యులుగా పనిచేసిన
ప్రముఖ విప్లవాద నాయకుడెవరు? 
ఎ) మోహన్ సింగ్ 
బి) లాలా హరదయాల్ 
సి) సాహన్ సింగ్ బక్నా 
డి) శ్యాంజీ కృష్ణవర్మ

8.భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషనను తొలి సారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 
ఎ) 1862 కౌన్సిళ్ల చట్టం 
బి) 1892 కౌన్సిళ్ల చట్టం 
సి) 1919 భారత ప్రభుత్వ చట్టం 
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం 

9.మహాత్మాగాంధీ స్థాపించిన 'హరిజన సేవక్ సంఘ్'కు తొలి అధ్యక్షులు ఎవరు? 
ఎ) జి.డి. బిర్లా 
బి) కె. కేలప్పన్ 
సి) బి.ఆర్. అంబేడ్కర్
డి) మహదేవ్ దేశాయ్ 

10. బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో గదర్ పార్టీముఖ్య నాయకుడు ఎవరు? 
ఎ) సూర్యసేన్ 
బి) శిశిర్ కుమార్ ఘోష్ 
సి) జతీంద్రనాథ్ ముఖర్జీ 
డి) రాస్ బిహారీ బోస్ 

11. కిసాన్ సభ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు ఎవరు? 
ఎ) స్వామి సహజానంద సరస్వతి
బి) జవహర్‌లాల్ నెహ్రూ 
సి) ఇందూలాల్ యాగ్నిక్
డి) భాయి పరమానంద

12. లక్నో సదస్సు తర్వాత జాతీయ కాంగ్రెసన్నువీడిన మితవాద నాయకులు స్థాపించిన
నూతన పార్టీ పేరేమిటి? 
ఎ) సోషలిస్ట్ పార్టీ 
బి) లిబరల్ పార్టీ (National Liberal Federation) 
సి) స్వరాజ్య పార్టీ 
డి) జాతీయ పార్టీ 

13. భారతదేశాన్ని తల్లిగా భావించి పూజించినప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు? 
ఎ) మహమ్మద్ అలీ 
బి) చిత్తరంజన్ దాస్ 
సి) అరబిందో ఘోష్
డి) జతిన్‌ దాస్ 

14. మతపరంగా ప్రజలను ఏకం చేయడానికి బాలగంగాధర తిలక్ దేశవ్యాప్తంగా.. గణ పతి,
శివాజీ ఉత్సవాలను వరసగా ఏ సంవత్సరాల్లో ప్రారంభించారు? 
ఎ) 1893, 1896 
బి) 1880, 1881
సి) 1890, 1891 
డి) 1885, 1886 

15. 'కాంగ్రెస్' అనే పదాన్ని దేని నుంచి గ్రహిం చారు? 
ఎ) బ్రిటన్ పార్లమెంట్ సమావేశం 
బి) అంతర్జాతీయ మత సమావేశం 
సి) ఉత్తర అమెరికా చరిత్రలో 'ప్రజా సమావేశం' అనే పదం 
డి) కార్మిక సంఘాల సమాఖ్య 

16. 1885లో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంత మంది ప్రతి నిధులు
హాజరయ్యారు?
ఎ) 540 
బి) 54 
సి) 100 
డి) 72 

17. 1889లో భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించిన 'బ్రిటిష్ కమిటీ'ని ఎవరి అధ్య క్షతన
స్థాపించారు? 
ఎ) విలియం వెడ్డర్ బర్న్ 
బి) మహమ్మద్ జిన్నా 
సి) ఎ.ఒ. హ్యూమ్
డి) సురేంద్రనాథ్ బెనర్జీ 

18. జాతీయ కాంగ్రెస్ ను 'ఆయుధాలు ధరించని పౌర తిరుగుబాటు'గా అభివర్ణించింది ఎవరు? 
ఎ) లార్డ్ క్రాస్ 
బి) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 
సి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
డి) లార్డ్ కర్జన్ 

19. 'యురోపియన్స్ డిఫెన్స్ అసోసియేషన్' సంస్థఏ కారణంగా ఇల్బర్ట్ బిల్లును రద్దు చేయాలని
భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనోద్యమం నిర్వహించింది? 
ఎ) యురోపియన్లకే ప్రథమ తరగతి ఉద్యోగాలు కల్పించాలని 
బి) వైస్రాయ్ కౌన్సిల్ లో భారతీయులకుప్రవేశం కల్పించకూడదని 
సి) భారతీయ న్యాయమూర్తులకు యురోపియన్లను విచారించే అధికారం ఉండ కూడదని 
డి) పైవన్నీ 

20. 'బాంబే త్రిమూర్తులు'గా ఎవరిని పేర్కొం టారు? 
ఎ) ఫిరోజ్ షా మెహతా, కె.టి. తెలాంగ్,బద్రుద్దీన్ త్యాబ్ది 
బి) కె.టి.తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్ది, ఎం.జి. రనడే 
సి) బద్రుద్దీన్ త్యాబ్ది, తిలక్, అగార్కర్
డి) తిలక్, అగార్కర్, కె.టి. తెలాంగ్ 

21. మితవాదులు.. బ్రిటిష్ ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడానికి కింది వాటిలో ఏ
పద్ధతిని ఎంచుకున్నారు? 
ఎ) స్వదేశీ 
బి) బహిష్కరణ
సి) ఎ, బి 
డి) సత్యాగ్రహం 

22. కింద పేర్కొన్న వారిలో 1906లో ముస్లింలీగ్ స్థాపనతో సంబంధం ఉన్నవారెవరు?
ఎ) ఆగాఖాన్ 
బి) నవాబ్ సలీముల్లా 
సి) నవాబ్ మొహిసిన్-ఉల్-ముల్క్
డి) పైన పేర్కొన్న వారందరూ

23. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజును 'రక్షాబంధన్ దినం'గా
పాటించి బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది ఎవరు? 
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్ 
బి) రవీంద్రనాథ్ ఠాగూర్ 
సి) ప్రమోద్ మిత్రా
డి) స్వామి వివేకానంద 

24. ముస్లింలీగ్ ను వ్యతిరేకించి, తీవ్రవాద జాతీయోద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన
అహోర్ ఉద్యమ ప్రముఖులు ఎవరు? 
ఎ) మౌలానా మహమ్మద్ అలీ 
బి) హకీం హజ్మల్ ఖాన్ 
సి) హసన్ ఇమామ్
డి) పైన పేర్కొన్న వారందరూ 

25. గదర్ పార్టీ వర్గం 1915 ఫిబ్రవరి 21న ఏ ప్రాంతంలో సాయుధ తిరుగుబాటు చేయాలని
నిర్ణయించింది? 
ఎ) మధ్య భారతదేశం 
బి) బెంగాల్ 
సి) పంజాబ్
డి) రాజస్థాన్ 

26. 1916లో ముస్లింలీగ్, కాంగ్రెస్ మధ్య లక్నో ఒప్పందం జరగడానికి ప్రముఖపాత్ర
పోషించింది ఎవరు? 
ఎ) అనిబీసెంట్ 
బి) బాలగంగాధర్ తిలక్ 
సి) లాలా లజపతిరాయ్
డి) అంబికా చరణ్ మజుందార్ 

27. గాంధీజీ దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పత్రిక ఏది? 
ఎ) హరిజన్ 
బి) నవజీవన్ 
సి) ఇండియన్ ఒపీనియన్
డి) యంగ్ ఇండియా 

28. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్నిప్రచారం చేసిన ఫిలిప్ స్ట్రాట్ ఏ దేశస్థుడు? 
ఎ) రష్యా
బి) ఇంగ్లండ్ 
సి) జర్మనీ 
డి) జపాన్ 

29. 'పాకిస్తాన్' పద రూపకర్త ఎవరు?
ఎ) రహమత్ అలీ 
బి) జిన్నా 
సి) మహమ్మద్ ఇక్బాల్
డి) మహమ్మద్ అజం ఖాన్ 

30. కింది వాటిలో గాంధీజీని ప్రభావితం చేసిన గ్రంథాలు ఏవి? 
1) ది మదర్ - గోర్కి 
2) సివిల్ డిస్క్ బీడియన్స్ - తోరో
3) భగవద్గీత 
4) అస్టు దిస్ లాస్ట్ - జాన్ రస్కిన్ 
5) కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విన్ యూ - టాల్‌స్టాయ్ 
ఎ) 1, 2, 3 
బి) 2, 3, 4
సి) 3, 4, 5 
డి) 1, 2, 3, 4, 5 

31. రౌలత్ చట్టాలను కేంద్ర శాసనసభలో సమర్థించిన ఏకైక భారతీయుడు ఎవరు? 
ఎ) శంకర్ నాయర్ 
బి) తేజ్ బహదూర్ సప్రూ 
సి) ఎం.ఆర్.జయకర్ 
డి) డాక్టర్ సత్యపాల్ 

32. జతపరచండి.
గ్రంథాలు
 i) జాతీయ కాంగ్రెస్ చరిత్ర     a) పట్టాభి సీతారామయ్య 
 ii) ది నేషన్స్ వాయిస్       b) రాజగోపాలచారి
iii) రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్  ఇండియా c) సి.ఎఫ్. ఆండ్రూఫ్
iv) లెటర్స్ ఫ్రమ్ రష్యా   d) రవీంద్రనాథ్ ఠాగూర్
v) ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సర్వీస్ రచయితలు e) గోపాలకృష్ణ గోఖలే
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e 
బి) 1-c, 2-d, 3-C, 4-b, 5-a 
సి) 1-0, 2-b, 3-C, 4-a, 5-e
డి) 1-ఎ, 2-6, 3-C, 4-e, 5-b

33. 'భారతదేశాన్ని మరోసారి జయించాలి' అనిపేర్కొన్నవారెవరు? 
ఎ) వివేకానంద 
బి) బాలగంగాధర తిలక్ 
సి) దయానంద సరస్వతి
డి) భగత్ సింగ్ 

34. మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ చాస్టర్ గా పని చేసిన మొదటి భారతీయుడు,
'దక్షిణభారతదేశ కురువృద్ధుడు'గా గుర్తింపు పొందిన వారెవరు?
ఎ) జి. సుబ్రహ్మణ్య అయ్యర్ 
బి) ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్ 
సి) పెరియార్
డి) వీరేశలింగం పంతులు 

35. 'మహారాష్ట్ర సోక్రటీస్'గా ఎవరిని పిలుస్తారు?
ఎ) ఫిరోజ్ షా మెహతా 
బి) కె.టి. తెలాంగ్ 
సి) ఎం.జి. రనడే 
డి) అగార్కర్ 

36. బ్రిటిష్ పార్లమెంట్ 'భారత స్వాతంత్ర్య చట్టం'ను ఆమోదించిన తేది? 
ఎ) 1947 జూలై 18 
బి) 1947 జూన్ 3 
సి) 1947 జూలై 20
డి) 1947 ఆగస్టు 3 

37. 'భారతదేశ పాలనకు ప్లాసీలో పునాది పడితే, అమృత్ సర్ లో బీటలు వారింది'
అని పేర్కొన్న నాయకుడు ఎవరు? 
ఎ) మహాత్మా గాంధీ 
బి) జవహర్లాల్ నెహ్రూ
 సి) సర్దార్ వల్లభాయ్ పటేల్
డి) సుభాష్ చంద్రబోస్ 

38. భారత్ లో ఆంగ్ల విద్యకు 'మాగ్నాకార్టా'గా ఏనివేదికను పేర్కొంటారు? 
ఎ) హంటర్ నివేదిక 
బి) మెకాలే నివేదిక 
సి) ఉడ్ నివేదిక
డి) రీడ్ నివేదిక 

39. జలియన్ వాలాబాగ్ దురంతాల పరిశీలనకు బ్రిటిష్ ప్రభుత్వం 'హంటర్ కమిషన్'ను
నియమించగా, కాంగ్రెస్ ఒక స్వతంత్ర కమి టీని వేసింది. దీని కార్యదర్శి ఎవరు? 
ఎ) కె. శాంతారాం 
బి) జె.బి. కృపలాని 
సి) యు.ఎన్. దేబర్
డి) నిజలింగప్ప 

40. కింద పేర్కొన్న ఏ సంవత్సరంలో కాంగ్రెస్ వార్షిక సమావేశాన్ని నిర్వహించలేదు? 
ఎ) 1930
బి) 1935 
సి) ఎ,బి 
డి ) 1947 

41. మహమ్మద్ అలీ జిన్నా ఏ సంవత్సరం నుంచి ముస్లింలీగు శాశ్వత అధ్యక్షుడిగా
నియమితులయ్యారు? 
ఎ) 1936 
బి) 1913 
సి) 1930 
డి) 1940 

No comments:

Post a Comment

Pages

close