జాగ్రఫీ - విశ్వం - సౌరకుటుంబం APPSC GROUP 2 GROUP 3, GROUP 4, VRO, VRA, SI, CONSTABLE, - Grate Thing

Breaking

Home Top Ad

Sunday, February 9, 2020

జాగ్రఫీ - విశ్వం - సౌరకుటుంబం APPSC GROUP 2 GROUP 3, GROUP 4, VRO, VRA, SI, CONSTABLE,

1. భూగోళశాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు?
- జాగ్రఫీ

2. జాగ్రఫీ పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
- గ్రీకు భాష నుంచి, జియో(భూమి), గ్రఫీ(వర్ణన)

3. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
- ఖగోళశాస్త్రం

4. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాల్లో ముఖ్యమైనది ఏది?
- మహావిస్ఫోటన సిద్ధాంతం

5. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
- అబ్బే జార్జియస్‌ లెమాయిట్రే(బెల్జియం)

6. నిహారికలు అంటే ఏమిటి?
- వినీలాకాశంలోని దుమ్ము, ధూళి కణాలు, వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగే మేఘాలు

7. నిహారికలను కనుగొన్న వారెవరు?
- హ్యూజెన్స్‌(ఆస్ర్టియా)

8. నిహారికలలోని అణువుల అభిఘాతం వలన చలనం ప్రారంభమైందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
-ఇమాన్యుయల్‌ కాంట్‌ (బ్రిటన్‌)

9. స్వయం ప్రకాశ శక్తిని కలిగిన ఖగోళ పదార్థాలను ఏమంటారు?
- నక్షత్రాలు

10. నక్షత్రాలు ఎక్కడ జన్మిస్తాయి?
- నిహారికల్లో

11. విశ్వంలో అతి పెద్ద నక్షత్రం ఏది?
- ఎప్సిలాన్‌ ఆరెగా

12. అతి ప్రకాశవంతమైన నక్షత్రం?
- సిరియస్‌-ఎ
13. సూర్యుడు ఏ తరహా నక్షత్రం?
- మధ్య తరహా

14. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
- సూర్యుడు

15. సూర్యుడి తరవాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
- ప్రాక్సిమాసెంట్యారీ

16. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు?
- గెలాక్సీ(పాలవెల్లి)

17. ఇప్పటివరకు విశ్వంలో కనుగొన్న పెద్ద గెలాక్సీ?
-హైడ్రా

18. సూర్యుడు- సౌరకుటుంబం ఉన్న గెలాక్సీ పేరు?
- పాలపుంత

19. పాలపుంతకు ఉన్న ఇతర పేర్లు?
- ఆకాశగంగ, మిల్కీ వే, క్షీరపథం

20. పాలపుంతలోని నక్షత్రాల సంఖ్య సుమారు ఎంత?
- 1.5 మిలియన్లు

21. పాలపుంత ఆకారం ఏది?
- సర్పిలాకారం(అండాకారం)

22. పాలపుంతను ఎస్కిమోలు(కెనడా) ఏమంటారు?
- తెల్లని బూడిద మార్గం

23. చైనీయులు పాలపుంతను ఏమని పిలుస్తారు?
- ఖగోళ నది

24. పాలపుంతను మధ్య ఆసియావారు ఏమంటారు?
- దేవుని పాదముద్రలు

25. గ్రీకులు పాలపుంతను ఏ పేరుతో పిలుస్తారు?
- స్వర్గానికి రహదారి

26. నక్షత్రాల వయసును కొలిచే పరికరం పేరు?
- కాస్మోక్రోనోమీటర్‌

27. నక్షత్రాల ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం ఏది?
- కాస్మోక్రోనోమీటర్‌

28. సూర్యుడు ఎలాంటి గోళం?
- మండే వాయుగోళం(అగ్నిగోళం)

29. నక్షత్రాలు, సూర్యుడిలో శక్తి జనించడానికి కారణమైన చర్య?
- కేంద్రక సంలీనం

30. పాలపుంతకు సమీపంలో ఉన్న గెలాక్సీ ఏది?
- ఆండ్రోమెడా

31. తాత్కాలిక అంతర్గత విస్ఫోటనాలు సంభవించే నక్షత్రాలను ఏమంటారు?
- నోవా

32. ‘కృష్ణ బిలం’ను ఊహించింది ఎవరు?
- ఐన్‌స్టీన్‌

33. సూర్యుడిలో మనకు అక్కడక్కడ తాత్కాలికంగా కనిపించే కాంతిహీనమైన మచ్చలను ఏమంటారు?
- సూర్యాంకాలు

34. సూర్యునిలో ఎక్కువగా ఉండే రెండు వాయువులు?
- హైడ్రోజన్‌, హీలియం

35. సూర్యుని ఆత్మభ్రమణ కాలం ఎంత?
- 25 రోజుల 9 గంటలు

36. సూర్యుడు- సౌరకుటుంబం పాలపుంత కేంద్రకం చుట్టూ తిరిగిరావడానికి పట్టే కాలం?
- కాస్మిక్‌ సంవత్సరం
(దాని విలువ 225x106 సంవత్సరాలు

37. సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య?
- ఎనిమిది

38. గ్రహగోళాలకు ఉన్న ఇతర పేర్లు?
- గ్రహశకలాలు, లఘు గ్రహాలు, ఆస్టరాయిడ్స్‌

39. ఆస్టరాయిడ్స్‌లో పెద్దది, చిన్నది?
- సెరస్‌, హెర్మ్యస్‌

40. ఎక్కువ సహజ ఉపగ్రహాలు ఉన్న గ్ర హం ఏది?
- బృహస్పతి(గురుడు)

41. కవల గ్రహాలు అని వేటిని అంటారు?
- బుధుడు, శుక్రుడు

42. భూమి కవల గ్రహం?
- శుక్రుడు

43. భ్రమణ కాలం తక్కువ/భ్రమణ వేగం ఎక్కువగా ఉన్న గ్రహం ఏది?
- బృహస్పతి(గురుడు)

44. భ్రమణ కాలం ఎక్కువ/భ్రమణ వేగం తక్కువగా ఉన్న గ్రహం ఏది?
- శుక్రుడు

45. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
- క్లాడియస్‌ టాలెమి(ఈజిప్ట్‌)

46. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
- నికోలస్‌ కోపర్నికస్‌(పోలాండ్‌)

47. అంతర గ్రహాలు లేదా భౌమ గ్రహాలకు ఉదాహరణ?
- బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు

48. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం?
- బుధుడు

49. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం?
- శుక్రుడు

50. అధిక బరువు, అతిక తేలికైన గ్రహాలు?
- భూమి, శని

51. అందమైన దేవతగా గ్రీకులు పూజించిన గ్రహం?
- శుక్రుడు

52. రోమన్‌ల వ్యవసాయ అధిపతి ఎవరు?
- శని

53. సౌర కుటుంబంలోని గ్రహాల పరిమాణాన్ని బట్టి, సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి భూమి ఎన్నో స్థానంలో ఉంది?
- పరిమాణంలో ఐదు, దూరంలో మూడు
 
54. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు గ్రహాల రంగులు ఏవి?
- బూడిద, పసుపు, నీలి, ఎరుపు, తెలుపు, నారింజ, ఆకుపచ్చ, లేతనీలి

55. ఫ్లూటో(యముడు) గ్రహాన్ని ఏ సమావేశంలో ఏ కారణంగా గ్రహ హోదా నుంచి తొలగించారు?
- చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో జరిగిన సమావేశం (2006)లో తొలగించారు.
కారణాలు: 1. గ్రహంగా గుర్తింపు పొందటానికి తగిన పదార్థం లేకపోవడం.
2. కక్ష్యా నిర్దిష్టత లేకపోవడం

56. భూమి ఏ ఆకారంలో ఉంటుంది?
- దీర్ఘగోళాకారం

57. భూ కక్ష్య ఆకారం?
- దీర్ఘవృత్తాకారం

58.భూమి అక్షం ఎన్ని డిగ్రీలు వాలి ఉంటుంది?
- 23 1/2 డిగ్రీలు తూర్పు వైపునకు

59. భూమి అక్షం తూర్పునకు వాలి ఉండటానికి గల కారణం?
- ఉత్తరార్థగోళంలో ఉన్న భూభాగాల బరువు కంటే దక్షిణార్థగోళంలో ఉన్న జల భాగం, మంచుతో కూడిన అంటార్కిటికా ఖండం బరువు ఎక్కువగా ఉండటం

60. చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
- సెలినాలజీ

61. చంద్రుడిపై ఉన్న ఎత్తయిన శిఖరం పేరు?
- లీబ్‌నిడ్జ్‌

62. 1969 జూలై 21న చంద్రుడిపై కాలుమోపిన తొలి మనిషి?
- నీల్‌ ఆర్మ్‌స్ర్టాంగ్‌, అతని సహ రోదసి యాత్రికులు ఎడ్విన్‌ ఆల్ర్టిన్‌బుర్జ్‌, మైఖే ల్‌ కొలిన్‌

63. భూమిపై నుంచి చూసేవారికి చంద్రుడు ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తాడు, రెండో వైపు కనిపించకపోవటానికి కారణం?
- చంద్రుడు తన చుట్టూ తాను తిరగటానికి, భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఒకే సమయం పడుతుంది

64. చంద్రనక్షత్ర మాసంలో రోజులు ఎన్ని?
- 28 రోజులు (వాస్తవంగా 27 1/3)

65. చంద్రమాసం లేదా చంద్రమాన మాసంలో రోజులెన్ని?
- 30 రోజులు

66. ఖగోళ ప్రమాణం అంటే?
- భూమికి సూర్యుడికి మధ్య గల సగటు దూరం. దీని విలువ 150 మి.కి.మీ. (15 కోట్ల కి.మీ.)

67. ఖగోళ ప్రమాణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
- అంతర్‌ గ్రహరోదసిలో దూరాలను కొలవడానికి

68. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం?
- విశ్వంలో దూరాలను కొలవడానికి

69. భూమి సూర్యుడికి దగ్గరగా వచ్చే స్థితిని ఏమంటారు, అది ఏ తేదీన సంభవిస్తుంది?
- పరిహేళి(రవి నీచ). ఇది జనవరి 3వ తేదీన సంభవిస్తోంది. అప్పుడు భూమికి సూర్యుడికి మధ్య దూరం 147 మి.కి.మీ.

70. భూమి సూర్యుడికి దూరంగా వచ్చే స్థితిని ఏమం టారు, అది ఏ తేదీన సంభవిస్తుంది?
- అపహేళి (రవి ఉన్నతి). ఇది జూలై 4వ తేదీన సంభవిస్తోంది. అప్పుడు భూమికి సూర్యుడికి మధ్య దూరం 152 మి.కి.మీ.

71. భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం?
- 3,84,365 కి.మీ.

72. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే స్థితిని ఏమంటారు?
- పెరీజీ (భూ నీచ). అప్పుడు దూరం 3,64,000 కి.మీ.

73. భూమి చంద్రుడికి ఎక్కువ దూరంగా వచ్చే స్థితిని ఏమంటారు?
- అపోజీ (భూ ఉన్నతి) అప్పుడు దూరం 4,06,000 కి.మీ.

74. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
- 8 నిమిషాలు
(వాస్తవంగా 8 నిమిషాల 20 సెకన్లు)
75. చంద్రకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
- 1.3 సెకన్లు

No comments:

Post a Comment

Pages

close