శాతవాహనులకు ముందు ఆంద్రదేశంలో పరిస్థితులు:
- క్రీ.పూ 1000సంవత్సరాల నాటిదైన ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా.. ఆంధ్రులను గూర్చి ప్రశంస కనిపిస్తుంది. సునశ్శేపుని దత్తత తీసుకోడానికి అంగీకరించని తన 50 మంది కుమారులను విశ్వామిత్రుడు.. బ్రాహ్మణవర్గం నుంచి బహిష్కరించాడు. ఈ విధంగా బహిష్కరించబడ్డ విశ్వామిత్ర సంతతికి చెందిన వారుగా ఆంధ్రులతో.. పాటు పుండ్రులు, సవరులు, పుళిందులు, మూలిబులను పేర్కొనడం జరిగింది
- మహాభారత యుద్ధంతో ఆంధ్రులు, కౌరవుల పక్షాన పోరాడినట్లు తెలుస్తోంది.
- ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగంలో.. భాగంగా సహదేవుడు.. ఆంధ్రరాష్ట్రాన్ని కూడా జయించినట్లు పేర్కొనడం జరిగింది.
ఆంధ్రదేశంలో.. చారిత్రక యుగం మౌర్యులతోనే ప్రారంభమైంది. క్రీ.పూ 3వ శతాబ్దిలో మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్రదేశంలో ఒక భాగంగా ఉండేది. కర్నూలు జిల్లా ఎర్రగుడిలో కన్పించిన ఆశోకుడి శాసనమే దీనికి నిదర్శనం.
చంద్రగుప్తమౌర్యుడి ఆస్థానంలో గ్రీకు రాయబారిగా ఉన్న మొగస్తనీస్.. తాను రచించిన ఇండికా అన్న గ్రంధంలో.. పలు చోట్ల ఆంధ్రులను గూర్చి ప్రస్తావించాడు. ఆంధ్రులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కలిగి, సర్వస్వతంత్రుల వలె ఉన్నారని మెగస్తనీస్ తెలిపాడు. ఆంధ్రులకు 30 కోటలు, ఒక లక్ష కాల్బలము, 2000 అశ్వాలు, 1000 ఏనుగులు ఉండేవని తెలుస్తుంది.
శాతవాహనులు ఎవరు..?
కణ్వ వంశీయుల్లో చివరివాడైన సుశర్మ అనే మగధరాజును.. ఆంధ్ర రాజైన శ్రీముఖుడు హతమార్చి మగధను ఆక్రమించినట్లు.. మత్య్స, వాయు పురాణాలు చెబుతున్నాయి.
శాతవాహనులు ఆంధ్రులే: వి.ఎ . స్మిత్, రాప్సన్, బండార్కర్
శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారు: శ్రీనివాస అయ్యంగార్
శాతవాహనులు కర్ణాటక: వి.ఎస్ సుక్తాంకర్
పురాణాలు.. శాతవాహనులను గూర్చి ప్రస్తావించేటప్పుడు ఆంధ్రదేశీయ, ఆంధ్ర జాతీయ అని వ్యవహరించాయి.
అశోకుని శాసనాలు.. శాతవాహనులను ఆంధ్రభృత్యులుగా వర్ణించాయి.
శాతవాహనుల చరిత్రకు ఆధారాలు:
సాహిత్య ఆధారాలు:
- సోమదేవయసూరి కథా సరిత్సాగరం ప్రకారం దీపకర్ణి అనే ఆంధ్ర రాజుకి చెందిన పట్టపురాణి చనిపోతే.. దిగులుతో ఉన్న రాజుకి.. సాతుడనే.. బ్రాహ్మణ బాలుడు సింహంమీద కనిపిస్తాడు. దీంతో.. దీపకర్ణి సింహాన్ని చంపి… సాతుడిని రాజుగా చేస్తాడు. సాతుడు బ్రాహ్మణుడు కావడం.. సాతుడి పేరిటే శాతవాహన మంశం అని పేరురావడం గమనించదగ్గ అంశం. కనుక శాతవాహనులు బ్రాహ్మణులు. ఈ కథ బృహత్కథలోనూ ఉంది.
- మత్స్య, వాయు, భాగవత, బ్రహ్మాండ పురాణాలు శాతవాహనుల గురించి స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా మత్స్య పురాణం 3 మంది శాతవాహనరాజుల గురించి వివరిస్తోంది.
- స్కందపురాణం.. ఆంధ్రులను త్రైలింగులు అని చెప్పింది.
4.గుణాడ్యుడి బృహత్ కథ , హాలుడు గాథాసప్తశతి.. శాతవాహనుల కాలంనాటి.. సాంఘిక సాంస్కృతిక జీవనానికి అద్దం పడుతున్నాయి.
పురావస్తు ఆధారాలు:
- శాసనాధారాలు: ( ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది )
శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి. వీరి అధికార భాష ప్రాకృతం
1.నానాఘాట్ శాసనం: దేవీ నాగానిక.. మొదటి శాతకర్ణి గురించి రాశారు. ఈమె ఇందులో తన భర్తకు దక్షిణాధిపతి, అప్రతిహతచక్రవర్తి అనే బిరుదులిచ్చారు.
2.నాసిక్ శాసనం: గౌతమీపుత్ర శాతకర్ణి ఘన విజయాల గురించి గౌతమి బాలశ్రీ( తల్లి ) నాసిక్ శాసనం వేశారు. శివస్వామి, మహాగుప్తులు ఈ శాసనాన్ని రచించారు. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణిని .. బేనాకటక స్వామి అని బాలశ్రీ సంబోధించారు. త్రి సముద్రలోయ పీతవాహన, ఆగమనిలయ, క్షత్రియ దర్పమాన మర్థన, శక సంహారి లాంటి బిరుదులు ఇచ్చారు. ( నోట్: అయితే ఈ శాసనాన్ని బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయలేదు. తన మనవడైన, గౌతమీపుత్రశాతకర్ణి కొడుకైన వాశిస్టీపుత్ర పులోమావి కాలంలో వేసింది. )
3.భట్టిపోటు నిగమసభ శాసనం: దీనిని కుబేరుడు జారీ చేశాడు. శాతవాహనుల కాలంలో నగరాలను పాలించిన నిగమసభల గురించి చర్చిస్తోంది.
- ఉన్నాఘర్ శాసనం:. దీనిని జారీ చేసింది ఎవరో తెలియదు. అయితే.. దీంట్లో శాతవాహనుల పాలన, మంత్రిమండలి గురించి పూర్తిగా వివరిస్తుంది.
5.మ్యాకదోని/మేకదోని శాసనం: ఈ శాసనం కర్ణాటకలోని బళ్లారిలో లభించింది. చివరి శాతవాహనరాజైన మూడో పులోమావి జారీచేశాడు. ఇది .. శాతవాహన రాజ్యం పతనం గురించి వివరిస్తోంది.
- అశోకుడి శాసనాలు: ఎర్రగుడిపాడు శాసనం, రాజుల మందగిరి శాసనం( కర్నూల్ ) పాకృత శాసనాలు శాతవాహనులను ఆంధ్ర భృత్యులు అంటున్నాయి.
- ఉన్నాఘర్ శాసనం.శాతవాహనుల పాలనా విధానాన్ని వివరిస్తోంది.
- నాణేలు: ( ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది )
- శాతవాహన నాణేలను పోటిన్ నాణేలు అంటారు. అంటే.. రాగి-సీసం ( రాగి-తగరం ) మిశ్రమంతో తయారైనవి. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడి ఉనికి కేవలం నాణేల ద్వారానే తెలుస్తోంది. చిముఖ.. పేరిట ఇతడి నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో లభ్యమయ్యాయి.
- గౌతమీపుత్ర శాతకర్ణి.. శకరాజైన నహపాణుడిని ఓడించి అతడి నాణేలపై తిరిగి తన పునర్ముద్ర వేయడం జరిగింది. ఈ నాణేలు సుమారుగా 3200నాణేలు మహారాష్ట్రలోని జోగల్ తంబి దగ్గర లభించాయి. ఈ నాణేలకు ఒక పక్క చిల్లు పొడిచి ఉంది. అందుకే వీటిని జోగల్ తంబి నాణేలు, పంచ్ మార్క్ డ్ నాణేలు, లేదా విద్దంక నాణేలు , లేదా వత్తుడు నాణేలు అనిపేరు.
- నాణేల్లో యజ్నశ్రీ శాతకర్ణి నాణేలు ముఖ్యమైనవి. తెరచాప గుర్తుగల నాణేలను యజ్నశ్రీ శాతకర్ణి వేయించాడు. ఈ నాణేలు ప్రకాశం జిల్లా చిన గంజాం, పెదగంజా సముద్ర తీరంలోనూ, గుంటూరు సరిహద్దు ప్రాంతంలోనూ లభించాయి. తెరచాప గుర్తుగల నాణేలు.. రాజుల సముద్ర వ్యాపారాన్ని తెలియపరుస్తున్నాయి. ముఖ్యంగా శాతవాహనులు సింహళం, మలయా, రోమ్ దేశాలతో వర్తకం చేసేవారు.
- శాతవాహనుల కాలంలో సువర్ణం అనేది బంగారు నాణెం.
- శాతవాహనుల కాలంలో కర్షపణం అనేది వెండినాణెం. 35 కార్షపణాలు కలిస్తే.. ఒక సువర్ణం.
- శాతవాహనుల నాణేలపై వివిధ జంతువుల బొమ్మలు ఉన్నాయి. అయితే జింక బొమ్మ మాత్రం లేదు.
- శాతవాహనుల కాలంలో.. రోమ్ నాణేలు.. హైటెక్ సిటీ – కొండాపూర్, తాండూరు ( రంగారెడ్డి జిల్లా ), సూర్యాపేట ( నల్గొండ ), కోటిలింగాల ( కరీంనగర్ ), పెదబంకూరు, మనులగుట్ట, థూళికట్ట ( కరీంనగర్ ) ప్రాంతాల్లో దొరికాయి.
శాతవాహనుల పరిపాలనా కాలం, సామ్రాజ్య విస్తృతి:
క్రీ.పూ 221 నుంచి క్రీ.శ 218 సంవత్సరాల మధ్య కాలంలో శాతవాహనుల సామ్రాజ్యం విలసిల్లింది. ఉత్తరాన నర్మదా నది నుంచి, దక్షిణాన తుంగభద్ర వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ శాతవాహనుల ఆధిపత్యం కొనసాగింది.
వీరి పాలన అత్యున్నత దశలో ఉన్నప్పుడు. ఆంధ్రదేశమే కాకుండా.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతాలు సైతం శాతవాహన సామ్రాజ్యపరిధిలో ఉండేవి.
భారత దేశ చరిత్రలోనే అతి సుదీర్ఘమైన పాలన చేసిన రాజవంశంగా ప్రసిద్ధికెక్కారు.
శాతవాహన రాజధాని:
తెలంగాణాలో కరీంనగర్ జిల్లా కోటిలింగాల రాజధాని . ఆ తర్వాత కొంతకాలానికి మహారాష్ట్రలో పైఠాన్ లేదా ప్రతిష్టానపురం
ఆంధ్రాలో అమరావతి లేదా ధరణికోట రాజధానిగా చేసుకొని పాలించారు.
శాతవాహన రాజులు:
- శ్రీముఖుడు: అశోకుడి మరణం తర్వాత మౌర్యసామ్రాజ్యం క్రమక్రమంగా క్షీణించింది. ఉత్తరభారతంలోని అస్థిరతను ఆసరాగా చేసుకొని.. శాతవాహనులు తమ స్వతంత్ర్యతను ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శ్రీముఖుడు పాలన ప్రారంభించాడు. శ్రీముఖుడు దాదాపు 23 ( కొంతమంది 33) సంత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. ఇతనికాలంలో.. రాజ్యం దక్కన్ వరకు వ్యాప్తి చెందింది. శ్రీముఖుడి చరిత్రను కేవలం నాణేల ద్వారా మాత్రమే పొందగలం. ఇతడి నాణేలు.. గుట్టలు గుట్టలుగా కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో లభ్యమయ్యాయి. శ్రీముఖుడిని సాహిత్యం రకరకాల పేర్లతో పిలుస్తోంది. బ్రహ్మాండ పురాణం సింధ్రకుడని, విష్ణుపురాణం బలిపుచ్ఛక అని, మత్స్యపురాణం శిముకుడని, బాగవత పురాణం బలి అని పేర్కొంటున్నాయి. నాణేల్లో సిముఖుడు అనే పేరు ఉంది. ఇతడు అశోకుడికి సమకాలీనుడని, అశోకుడు శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఇచ్చాడని .. డి.సి సర్కార్ అనే చరిత్రకారుడి అభిప్రాయం. ఏనుగు చిత్రంతో నాణేలు వేశాడు. శ్రీముఖుని తర్వాత.. అతని తమ్ముడు కృష్ణ.. 198లో రాజ్యపాలన చేపట్టాడు. ఇతడు జైన మతాభిమాని. ఇతని కాలంలో కొండకుందనాచార్య దిగంబర జైనాన్ని దక్షిణాదిన విస్త్రృతంగా దక్షిణాదిన ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. శ్రీముఖుడి ఆధ్వర్యంలోనే శకులపై ఎదురుదాడికి సిద్ధమై సౌరాష్ట్ర పాలకుడైన మహారథి త్రణకైరోను ఓడించారు. మహారథి త్రణకయిరో కూతురైన నాగానికను.. తన కొడుకైన మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయించాడు.
నానాఘాట్ శాసనంలో శ్రీముఖుడిని రాయనిముఖ శాతవాహానో సిరిమతో అని సంబోంధించారు.
శ్రీముఖుని నాణేలు లభించిన ప్రాంతాలు:
- విదర్భలోని – అకోలా, 2. పూణెలోని – జున్నార్, 3.అహ్మద్ నగర్ లోని – నేవస, ఈ మూడు ప్రాంతాలు మహారాష్ట్రలో ఉన్నాయి.
- తెలంగాణాలో కోటిలింగాల, సంగారెడ్డి, పటాన్ చెరు, కొండాపూర్ మొదలైన ప్రాంతాలు.
- కృష్ణ లేదా కన్హం
శ్రీముఖుడి అడుగుజాడల్లో నడిచి.. రాజ్యాన్ని పశ్చిమాన నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కన్హేరి గుహలను ఇతను నిర్మించాడు. ఇతడు సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కించుకుంటాడని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇతడి పాలన గురించి విశేషాలు మనకంతగా లభించలేదు.
- మొదటి శాతకర్ణి ( క్రీ.పూ 180- 170): శాతవాహన సామ్రాజ్య నిజమైన స్థాపకుడు. నోట్: శ్రీముఖుడి కాలంలో శాతవాహనులు మౌర్యులకు సామంతలు. కానీ మొదటి శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని స్వతంత్ర్య రాజ్యంగా తీర్చిదిద్దాడు.
ఇతడి భార్య నాగానిక/నాయనిక వేసిన నానాఘాట్ శాసనం వల్ల మొదటి శాతకర్ణి పాలన గురించి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. పశ్చిమ మాల్వా, అనుప లేక నర్మదా నదీ లోయ ప్రాంతాన్ని , విదర్భను శాతకర్ణి ఆక్రమించినట్లు నానేఘాట్ శాసనం తెలియజేస్తుంది. ఈ ప్రాంతాలను జయించినందుకు విజయచిహ్నంగా.. శాతకర్ణి. అశ్వమేథ యాగాన్ని, రాజసూయ యాగాన్ని నిర్వహించినట్లు చెబుతోంది. ఏకవీర అనే బిరుదును పొందాడు. పురాణాల్లో ఇతడిని మల్లకర్ణిగా పేర్కొన్నారు.
నాగానిక.. మహారథి త్రణకైరో కుమార్తె.
ఇతడికి.. మగధ పాలకుడు పుష్యమిత్రుశుంగుడు, కళింగ రాజు ఖారవేలుడు సమకాలీనులు. ( నోట్: పుష్యమిత్రశుంగుడు బ్రాహ్మణ పాలకుడు. బౌద్ధ మతాన్ని విద్వేషించాడు. ఒక్కో బౌద్ధ బిక్షువు తలకు 100వరహాలిచ్చాడని.. ఒక సిద్ధాంతం. తనకు లభించిన జైన విగ్రహాలను భూస్తాపితం చేసేవాడు. )
కళింగరాజు ఖారవేలుడు – మొదటి శాతకర్ణి సంబంధాలు: ఈ సంబంధాలలో ఖారవేలుడిదే పైచేయ.
కళింగరాజు ( ఒడిషా ) ఖారవేలుడు.. జైన మతాభిమాని కనుక.. తొలుత మొదటి శాతకర్ణిపై దాడిచేసి.. విజయం సాధించాడు.
తన సైన్యాన్ని కన్నబెణ్ణ నది ( ఇది విదర్భలో ప్రవహించే కృష్ణా నది. ) అసిక నగరం/ మూషికా నగరంపై ( నాగ్ పూర్ జిల్లాలోని ఆడం దగ్గర అసిక జనపదం ) దాడిచేశాడు.
ఖారవేలుడి సైన్యం నల్గొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిని దాడి.. పితుండ నగరంను ( భట్టిప్రోలు – గుంటూరు జిల్లాలోనిది ) ధ్వంసం చేశి..అక్కడి భూమిని గాడిదలతో దున్నించాడు. అనంతరం.. జైన విగ్రహాలను బందీ నుంచి విడిపించడానికి మగధపై దాడిచేశాడు. దక్షిణాది నుంచి .. ముఖ్యంగా ఒరిస్సా నుంచి మగధపై దాడిచేసిన తొలిరాజు ఖారవేలుడు. జైన విగ్రహాలను ఉత్తరాది నుంచి దక్షిణాదికి తెచ్చి మహానదిలో శుభ్రం చేసి.. మూడో జైన పరిషత్‌ను ఒరిస్సాలోని కుమారగిరి లేదా ఉదయగిరి గుహల్లో నిర్వహించాడు. ఇదే విషయాన్ని హాతీగుంఫా శాసనం చెబుతోంది. హాతీ అంటే ఏనుగు. గుంఫా అంటే పాదం అని అర్థం. అంటే ఏనుగు పాదం ఆకారంలో ఉన్న గుహపై ఖారవేలుడు ఈ శాసనం వేయించాడు.
మొదటి శాతకర్ణి విజయాలు:
మహారాష్ట్ర , తెలంగాణా, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ప్రాంతాల రాజైన సూర్యమిత్రుడిని ఓడించి.. అతడి నాణేలపై తన పేరుని ముద్రించుకున్నాడు. తనను తాను సామ్రాట్టుగా ప్రకటించుకొని.. దక్షణాపతి, అప్రతిహతచక్ర, ఏకవీర వంటి బిరుదులను ధరించాడు.
వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సుగుడు:
మొదటి శాతకర్ణి తర్వాత ఆయన చిన్న కుమారుడు వేదశ్రీ రాజ్యానికి వచ్చాడు. తల్లి నాగానిక వేదశ్రీ పేరుతో రాజ్యకార్యకలాపాలను నిర్వహించింది.
ఈ వేదశ్రీ కాలంలోనే నాగానిక (నాగవరదాయి ) నానాఘాట్ శాసనం వేయించింది.
నానాఘాట్ శాసనంలో.. శ్రీముఖుడు, కన్హుడి బొమ్మలను చిత్రించారు. ఈ శాసనంలో. 1 కుమార ఛాయ 2. కుమార హరికుసిరి 3. కుమార శాతవాహన అనేవాళ్లు తన సోదరులని వేదశ్రీ చెప్పుకున్నాడు. దీంతోపాటే తనకుటుంబానికి సహకరించిన.. మహారథి త్రణకైరో ( నాగానిక తండ్రి), ఇతర బంధువుల బొమ్మలను చెక్కించారు.
ఈ శాసనంలో మొదటి శాతకర్ణిని ఏకవీర అని ప్రస్తావించారు.
వేదశ్రీ కాలంలోనే కళింగ రాజు ఖారవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు.
వేదశ్రీ యుక్తవయస్సుకు రాకముందే చనిపోయాడు. ఆ తర్వత వేదశ్రీ తమ్ముడు సతిశ్రీ రాజ్యానికి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రాజుల గురించి ఎక్కువ ప్రస్తావన లేదు. తర్వాత వచ్చిన రాజుల్లో రెండవ శాతకర్ణి ముఖ్యుడు.
- రెండవ శాతకర్ణి ( క్రీ.పూ 152-96): (134-78) బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణి
56 సంవత్సరాల పాటు సాగిన రెండవశాతకర్ణి పాలన శాతవాహన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇతని కాలంలోనే మగధ రాజధానియైన పాటలీపుత్రం మొదటిసారిగా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది. విదిష, కళింగ రాజ్యాల్ని కూడా ఆక్రమించినట్లు ఇతడి ఆస్థాన కళాకారుడు వశిష్టపుత్ర ఆనందుడు అనే కవి తన రచనలో వివరించాడు. గార్గి సంహిత ప్రకారం ఇతడు శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడు.
యుగ పురాణం ప్రకారం ఇతడు కళింగను జయించాడు.
ఇతడు సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు.ఇతడి శాసనం విదిశ ( సాంచి ) దగ్గర్లో లభించింది.
రెండవ శాతకర్ణి చివరి రోజుల్లో శాక్యులు పశ్చిమ దక్కను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
లంబోదర, అప్పీలక ( మధ్రప్రదేశ్ లోని బిలాస్ పూర్‌లో ఇతడి నాణేలు లభించాయి )
మేఘస్వాతి, స్వాతి,
స్కంధ స్వాతి: ఇతడి కాలంలో గ్రీకుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి.
మృగేంధ్రుడు – క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం మధ్య పాలించిన రాజు. ఏసుక్రీస్తుకు సమకాలీనుడు.
కుంతల శాతకర్ణి :
ఇతడి కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామం.. సంస్కృతం రాజభాషగా మారింది.
మహారాష్ట్ర లోని దక్షిణ ప్రాంతాలను, కర్ణాటక లోని ఉత్తర ప్రాంతాలను జయించి.. వాటికి కుంతల దేశమని పేరుపెట్టి పాలించాడు కాబట్టి కుంతల శాతకర్ణి అనే పేరు వచ్చింది.
రాజశేఖరుని కావ్యమీమాంస, వాత్సాయనుని కామసూత్ర, గుణాఢ్యుడి బృహత్కథలలో కుంతల శాతకర్ణి ప్రస్తావన ఉంది.
కుంతల శాతకర్ణి భార్య మలయావతి కరిర్త అనే కామ క్రీడ వలన చనిపోయింది.
నోట్: కామసూత్ర రాసిన వాత్సాయనుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు. కామసూత్ర కేవలం శృంగారపరమైన రచనే కాదు. ఆనాటి ప్రజల జీవన విధానం, మనస్తత్వం, రాజకీయ విధానం కళ్లకు కట్టినట్లు వివరించాడు. ప్రపంచంలోనే 58 భాషల్లోకి అనువాదం చేయబడిన ఏకైక గ్రంథం ఇదే. నోట్: వాత్సాయనుడి కామసూత్రపై యశోధరుడు అనే కవి జయమంగళ అనే వ్యాఖ్యానం రాశాడు.
శర్వవర్మ కాతంత్ర్య వ్యాకరణం ( సంస్కృత గ్రంథం ) దీనిని కుంతల శాతకర్ణికి నెలరోజుల్లో సంస్కృతాన్ని నేర్పించడానికి రచించాడు.
నోట్: ఇతడి ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన సవాల్ ను గూర్చి వివరించిన గ్రంథం సోమదేవుడి కథా సరిత్సాగరం.
బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం : శర్వవర్మ, గుణాఢ్యుడు హాలుడి ఆస్థానంలో ఉన్నారనే వాదన కూడా కలదు.
గుణాడ్యుడి బృహత్ కథ : దీనిని పైశాచీ పాకృతంలో రాశారు. ఇతడు తొలి తెలంగాణా కవి ( పాల్కురికి కూడా తెలంగాణా ఆదికవి అంటారు ). బృహత్కథలో హీరో నరవాహనుడు.
మొదటి పులోమావి : రెండో శాతకర్ణి తర్వాత.. శాతవాహన సామ్రాజ్యాన్ని దిగంతాలకు వ్యాప్తి చేసింది. మొదటి పులోమావి. ఉత్తర భారతదేశంలోని మగధపై దండెత్తి కాణ్వాయన సుశర్మను వధించాడు. మగధను సైతం శాతవాహన సామ్రాజ్యంలో కలిపేశాడు. అవంతి ( పశ్చిమ మాళవ ), అకర ( తూర్పు మాళవ ) లను కూడా జయించాడు. అయతే పులోమావి తన విశాల రాజ్యాన్ని పాలించకుండానే మరణించాడు. వెంటనే ఇరాన్‌కు చెందిన శకక్షాత్రపులు అవంతి, అకర ప్రాంతాలను తిరిగి ఆక్రమించారు. పశ్చిమక్షాత్రవులలో నహపాణుడనే రాజు నేటి దక్షిన రాజస్థాన్, దక్షిణ గుజరాత్, ఉత్తర కొంకణం, నాసిక్ ప్రాంతాలను పాలిస్తూ ఉన్నాడు.
హాలుడు ( క్రీ.పూ. 19- 24):
హాలుడు శాతవాహన రాజుల్లో 17వ వాడు.
వాత్స్యాయనుడి కామసూత్రలోనూ, రాజశేఖరుడి కావ్యమీమాంసలోనూ హాలుడు ప్రస్తావన ఉంది.
హాలుడు సాహిత్యాన్ని, కళల్ని ఆదరించి పోషించాడు. అందుకే హాలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది.
స్వయంగా ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు.
బృహత్కథ రచయితయైన గుణాడ్యుడు హాలుడికి సమకాలీనుడు.
హాలుడు సప్తగోదావరి, భీమ నదుల ఒడ్డున శ్రీలంక రాజకుమార్తెను పెళ్లిచేసుకున్నాడని.. కుతూహలుడు ప్రాకృత భాషలో రాసిన లీలావతి పరిణయం చెబుతోంది.
మలి శాతవాహనులు:
1 గౌతమీపుత్ర శాతకర్ణి : ( క్రీ.శ 78 – 102 )
మలి శాతవాహనుల్లో గొప్పరాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతడు 23వ రాజు. ఇతడి తల్లితండ్రులు శివస్వామి, గౌతమిబాలశ్రీ.
శాతకర్ణి విజయాలను గురించి.. బాలశ్రీ నాసిక్ శాసనం పూర్తిగా వివరిస్తుంది.
ఇతడి కాలంలోనే.. కుషాణుల దాడులు ఎక్కువయ్యాయి.
పశ్చిమదక్కను ప్రాంతం క్షహరాటుల చేతుల్లోకి పోయింది.
హిందూమతాన్ని స్వీకరించిన విదేశీ తెగలు.. శాక్యులు, యవనులు, పహ్లవులను ఓడించాడు.
పశ్చిమ సరిహద్దుల్లో పాలిస్తున్నక్షాత్రపరాజు నహపానుడిని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని జయించడానికి ఇతడికి 18 సంవత్సరాలు పట్టింది. గౌతమీపుత్ర శాతకర్ణికి, నహపాణుడికి మహారాష్ట్రలోని జోగల్ తంబి దగ్గర యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్నే గోవర్థనాహార యుద్ధం అంటారు. ఇందులో నహపాణుడు ఓడిపోగా.. అనుప, అపరంత, సౌరాష్ట్ర, కుకుర, అంవంతి రాజ్యాలను సహపానుడి నుంచి గౌతమీపుత్రశాతకర్ణి స్వాధీనం చేసుకున్నాడు. నహపాణుడి నాణేలపై పునర్ముద్ర వేయించాడు. ఇవి వెండి నాణేలు. ఇవే కాక.. విదర్భ, అస్మక, మూలక రాజ్యాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
దీంతోపాటే శాతకర్ణికి త్రి సముద్రలోయ పీతవాహన ( మూడు సముద్రాల నీరు తాగిన గుర్రాలు కల వాడు ) అనే బిరుదు ఉంది. దీన్ని బట్టి శాతకర్ణి, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూమహా సముద్రందాకా దండయాత్రను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇతడి బిరుదులు: త్రి సముద్రలోయ పీతవాహన, ఆగమనిలయ, క్షత్రియ దర్పమాన మర్థన, శక సంహారి, ఏక బ్రాహ్మణ. ఇతడి శాసనాలలో రాజరాజు అని కూడా ఉంది.
- వాశిష్టీపుత్ర రెండో పులోమావి:
ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి, రాణి వశిష్టల కుమారుడు. నాసిక్ శాసనం వేయించిన గౌతమి బాలశ్రీ తన మనవడైన రెండో పులోమావికి దక్షిణ పథేశ్వరుడని బిరుదును ఇచ్చింది. దీంతోపాటే.. ఇతడికి నవనగర స్వామి అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలోనే.. క్షాత్రపరాజు చస్తనుడు.. మరాఠా, ఉజ్జయిని ప్రాంతాలనుజయించాడు.
ఇతడి పాలనా కాలంలోనే.. శాతవాహనరాజ్యానికి అమరావతి, ధరణికోట, ధాన్యకటకం రాజధానిగా మారింది.( నోట్: శాతవాహనుల తొలిరాజధాని కరీంనగర్ జిల్లా కోటిలింగాల. రెండో రాజధాని.. మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం, మూడో రాజధాని అమరావతి )
ఓడగుర్తు గల నాణేలను వేయడం ప్రారంభించిన తొలిరాజు రెండో పులోమావి. ( నోట్: ఓడగుర్తు గల నాణేలను ఎక్కువగా వేసిన రాజు యజ్నశ్రీ శాతకర్ణి )
3.గౌతమీ పుత్ర యజ్నశ్రీ ( క్రీ.శ 174-203 ):
ప్రసిద్ధి చెందిన శాతవాహన రాజుల్లో చివరివాడు గౌతమీపుత్ర యజ్నశ్రీ. రుద్రదమనుడి మరణం తర్వాత ఉజ్జయినిలో చెలరేగిన అల్లకల్లోలాన్ని ఆసరాగా తీసుకొని యజ్నశ్రీ ఆ రాజ్యంపై దండెత్తాడు.
అమరావతి స్తూపాన్ని విస్త్రుత పరచి. మహా చైత్యానికి ఇనుపకంచెను ఏర్పాటు చేశాడు. ఇతడి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు కొంతకాలం ఉన్నాడు. ఇతడి తర్వాత.. శాతవాహన సామ్రాజ్యం పూర్తిగా క్షీణించింది.
ఇతడి కాలంలో వర్తక వ్యాపారాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి. తెరచాప, ఓడగుర్తు కల నాణేలు రోమ్‌తో శాతవాహనుల వర్తక వాణిజ్యాన్ని గురించి వివరిస్తున్నాయి.
సమకాలీన రాజు :క్షత్రప రాజైన రుద్రదాముడు. ఇతడి కూతురు రుద్రదమనిక..
తీరాంధ్రను.. తమిళనాడు వరకు పాలించాడు. ఇతడి నాణేలు.. తమిళనాడులోని కడలూరు దగ్గర లభించాయి.
బాణ మహాకవి.. యజ్నశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వర అని సంబోధించినాడు.
ఇతడి కాలంలోనే.. తమిళంలో సంగమ కాళం ఉంది. ( చోర-చేర- పాండ్య రాజుల కవిపరిషత్తును సంగం అన్నారు. ) సంగం సాహిత్యంలో యజ్నశ్రీ ప్రస్తావన ఉంది. పొసాండసుత్తాన్ అనేది తమిళంలో .. యజ్నశ్రీ శాతకర్ణి పేరు.
ఆచార్య నాగార్జునుడి ప్రభావంతో.. బౌద్ధం ( మహాయాన) తీసుకున్నాడు. నాగార్జునుడు తాను రాసిన సుహృల్లేఖ గ్రంధాన్ని యజ్నశ్రీకి అంకితమివ్వగా.. యజ్నశ్నీ.. ఆచార్య నాగార్జునుడికి .. పారావతా విహారాన్ని నాగార్జున కొండలో నిర్మించి ఇచ్చాడు.
శాతవాహన రాజులు: వివాహ సంబంధాలు:
- హాలుడు.. శ్రీలంకకు చెందిన లీలావతిని పెళ్లిచేసుకున్నాడు. ( ఆధారం కుతూహలుడి లీలావతి పరిణయం )
- కుంతల శాతకర్ణి మగధ అమ్మాయి మలయవతిని పెండ్లాడాడు. మగధను రాజధానిగా చేసుకొని పాలించాడు. కుంతల శాతకర్ణి కరిర్త… అనే కామక్రీడ ద్వారా మలయవతి మరణానికి కారణమైనాడనే ఒక అభిప్రాయం ఉంది.
3.మొదటి శాతకర్ణి మహారథి త్రణకైరో కుమార్తె నాగానికను పెండ్లి చేసుకున్నాడు.
4.వాశిస్టీపుత్ర శాతకర్ణి శక రాజయిన రుద్రదాముడి కుమార్తె రుద్రదమనికను పెండ్లి చేసుకున్నాడు.
ఇతర విషయాలు:
రెండో శాతకర్ణి కాలంలో.. కర్నాటకలోకి మస్కి ( మూషికానగరం )పై దాడి చేసిన కళింగరాజు ఖారవేలుడు.. పితుండనగరాన్ని తగలబెట్టాడనేది ఒక వాదం.
శాతవాహనయుగం అంతం:
యజ్నశ్రీ శాతకర్ణి తర్వాత.. మరో ముగ్గురురాజులు పాలించారు. వారిలో మూడో పులోమావి కొంచెం గొప్పవాడు. ఇతను కర్నాటక లోని .. బళ్లారిలో మేకదోని శాసనం వేయించాడు. క్షీణిస్తున్న శాతవాహన సామ్రాజ్యాన్ని చుటులు, అభిరులు, ఇక్ష్వాకులు, క్షత్రవులు పంచుకున్నారు.
మూడో పులోమావిని..శ్రీ పర్వతప్రాంతం( నాగార్జునకొండ) లో పరిపాలన చేస్తున్న ఇక్ష్వాక రాజు శ్రీశాంతమూలుడు పారద్రోలి ధాన్యకటకం ప్రాంతాన్ని ఆక్రమించాడు.
శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ:
శాతవాహనులు బ్రాహ్మణులు. కనుక చాలా వరకు బ్రాహ్మణత్వం తొంగిచూసింది. సాధారణంగా ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ రాజు విధి. కానీ ఇక్కడ మాత్రం.. శాతవాహన రాజు ప్రధాన విధి వర్ణాశ్రమ ధర్మం రక్షణ. ఏక బ్రాహ్మణ అనే బిరుదులు కూడా ధరించారు.
శాతవాహనులు మొదట్లో మౌర్యులకు సామంతులు కాబట్టి.. వారి పాలనా విధానం కూడా. మౌర్యులనే పోలి ఉంది. కౌటిల్యుడు అర్థశాస్త్రం, మనువు ధర్మశాస్త్రం ఆధారంగా పాలించేవారు. రాజ్యాధికారం కోసం అంతర్యుధ్దాలు, వారసత్వ గొడవలు అసలే లేవు. కౌటిల్యుడి అర్ధశాస్తం ప్రకారమే.. సప్తాంగ సిద్ధాంతం ద్వారా పాలన కొనసాగేది. (రాజు, మంత్రి, రాజ్యం, దుర్గం, కోశం, సైన్యం, మిత్రులు అనేవి సప్తాంగాలు.)
రాజ్యం వారసత్వంగా పెద్దకుమారుడికి సంక్రమించేది. బిరుదులు ధరించడంలో రాజులు ఎంతో శ్రద్ధ చూపించేవారు. గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన శాసనాలలో రాజరాజు అని ఉంది.( నోట్: వాస్తవానికి రాజా పేరిట బిరుదులు ధరించడాన్ని భారతదేశంలో ప్రారంభించిన మొదటి రాజు కుషాణులు. శాతవాహనులకు చెందిన పాలన వివరాలను ఉన్నాఘర్ శాసనం తెలియజేస్తుంది. దీని ప్రకారం.. రాజ్యవారసులు బాలురైనప్పుడు.. రాజ్యమాత, మేనమామలు అతనికి యుక్తవయస్సు వచ్చేదాకా.. పరిపాలన కొనసాగిస్తారు.
శాతవాహనులు బ్రాహ్మణులు కాబట్టి.. పాలనలో బ్రాహ్మణుల ప్రాధాన్యత పెరిగింది. యజ్నయాగాది క్రతువులు బాగా నిర్వహించేవారు.
మంత్రిమండలి:
శాతవాహనుల మంత్రిమండలికి.. రాజోద్యోగులు అనిపేరు. వీరినే రాజపుత్రులు అనికూడా పిలిచేవారు. వీరితో పాటే విశ్వాసామాత్యులు, మహామాత్యులు, శ్రమణ మహామాత్యులు ( కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను పత్రాలను భద్రపరచేవారు.) శ్రవణమహామాత్యులనే.. నిబంధనాకారులని, అక్ఫపటలికులు అని పిలిచేవారు. ఉండేవారు. బాంఢాగారికుడు ( వస్తుసంచయాన్ని భద్రపరిచేవాడు ). హిరణ్యకుడు ( ద్రవ్యరూప ఆదాయాన్ని భద్రపరిచేవాడు. )
- మహామాత్యులు: ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైనవారు
2.అమాత్యులు: శాతవాహనుల రాష్ట్రాల ( ఆహారం )కు అధిపతులుగా ఉండేవారు.
3.రాజామాత్యులు: రాజుసమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిచ్చేవారు
4.విశ్వాసామాత్యులు: చక్రవర్తికి చెందిన అధికార రహస్యాలను కాపాడేవారు
5.భాండగారికుడు: వస్తువులను భద్రపరిచేవాడు
- హిరణ్యకుడు: ద్రవ్యరూప ఆదాయాన్ని భద్రపరచేవాడు.
- మహాసేనాపతి: సైనిక వ్యవహారాలకు ప్రధాన అధికారి.
నోట్: ఈ మంత్రులు, ముఖ్యమైన అధికారులతో.. కేంద్ర సచివాలయం ఉండేది.
రాజ్యవిభజన:
శాతవాహన సామ్రాజ్యం బలమైన కేంద్రీకృత రాచరికం కాదు.
వీరి రాజ్యం రెండు రకాలుగా విభజించబడింది.
ఎ. సామంత రాజ్యాలు బి. సామంతరాజ్యాలకు పోనూ.. మిగిలిన శాతవాహన రాజ్యం
రాష్ట్రం / ఆహారం:
రాష్ట్రాలు లేదా ఆహారాలుగా విభజించబడింది. కోడూరుహార, సోపారహార, గోవర్ధనాహార, మైసోలియాహార అనేవి పేర్లు. ఒక్కో ఆహారంలో ఒక ప్రధాన నగరం మరియు ఎన్నో గ్రామాలుండేవి. ఈ ఆహారాల పాలకులు అమాత్యులు. అమాత్యులకు బదిలీలు ఉండేవి.
విషయం:
ఆహారాలను మళ్లీ విషయాలు ( జిల్లాలు) గా విభజించారు. దీని పాలకులు విషయపతులు. వీరు ప్రతిభ ఆధారంగానే నియమితులయ్యేవారు.
గ్రామం: పాలనా విభాగంలో అతి చిన్నది గ్రామం. గ్రామ పాలనాధికారిణి గ్రామణి అన్నారు. ఒక గ్రామణి ఆధీనంలో 5 నుండి 10 గ్రామాల వరకు ఉండేవి. మత వ్యవహారాలను చూసే..గ్రామ పాలనాధికారిని మహా ఆర్యక అన్నారు.
పట్టణ పాలన:
నిగమం అంటే పట్టణాలు. శాతవాహనుల పట్టణ పాలనను నిర్వహించే సభలను నిగమసభలు అని పిలిచారు. ఈ నిగమసభల గురించి కుబేరుడు వేయించిన భట్టిప్రోలు పేటికా శాసనం తెలుపుతుంది. కేవలం ఈ శాసనం ద్వారానే.. శాతవాహనుల పట్టణాల పాలన మనకు తెలుస్తుంది.
సోపార, బరుకచ్చం, కన్హేరి, కళ్యాణి, పైఠాన్, తగర, జున్నాఘర్, కార్లే, ధనకటకం ( అమరావతి) అప్పటి ముఖ్యమైన పట్టణాలు.
పట్టణపాలన చూసే నిగమసభలో కులపెద్దలైన గహపతులు సభ్యులుగా ఉండేవారు. దాదాపుగా నిగమ సభలు స్వంతంత్ర పాలనాధికారాలు కలిగి ఉండేవి.
శాతవాహన కాలంలో.. సామంత రాజ్యాల పాలన:
శాతవాహన రాజ్యం మౌర్యుల లాగా బలమైన కేంద్రం ఉన్న రాజ్యం కాదు. ఎందుకంటే.. రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో సామంత రాజ్యాల పాలనలో కొనసాగుతుండేది. వీరిని మహాభోజ, మహారధి, మహాతలవర, మహాసేనాధిపతి పేర్లతో వీరు పాలించారు. వీరందరిలో మహారధి స్థాయి ఎక్కువ. మహారధి త్రణకైరో కుమార్తె నాగానికను మొదటి శాతకర్ణి వివాహం చేసుకోవడం చూస్తే.. శాతవాహన రాజులు రాజ్య సుస్థిరత కోసం సామంతరాజులతో వివాహ సంబంధాలను నెరుపుకున్నారని తెలుస్తోంది.
మహాభోజకులు: వీరు పశ్చిమదక్కన్ ( గుజరాత్, మహారాష్ట్ర) ప్రాంతంలో ఉండేవారు. వీరు కొంత వైశాల్యం కలిగిన ప్రావిన్స్ కు గవర్నర్‌గా ఉండేవారు.
మహాతలవరి: సామంత రాజ్యాల్లో శాంతి భద్రతలను కాపాడుతూ కొనసాగేవాడు.
సైనిక పాలన:
సప్తాంగాలలో సైన్యం ఒకటి. శాతవాహనులు.. భారీ సైన్యాన్ని పోషించారు.వీరి సైన్యంలో కాల్బలం, అశ్విక దళం, గజదళం, రథదళం ఉండేవి. శాతవాహనుల సైనిక విన్యాసాలను మనం అమరావతి శిల్పాలపై చూడవచ్చు. శాతవాహనుల కాలంనాటి మిలటరీ క్యాంపులను లేదా సైనిక శిబిరాలను స్కందావారాలు ( ముఖ్యమైన విషయం ) అనేవారు. సైనిక కంటోన్మెంట్‌లను కటకం అనేవారు.
శాతవాహనులు – ఆర్ధిక పరిస్థితులు :
- ప్రజల ప్రధాన వృత్తి – వ్యవసాయం
- ప్రధాన పంటలు – వరి, గోధుమ, బార్లీ. శాతవాహనుల కాలంలో.. ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి.
- కాలువలు, చెరువుల ద్వారా వ్యవసాయం జరిగింది.
- పండించిన పంటలో. చెల్లించే పన్నుని దేవమేయం లేదా రాజమేయం అంటారు.
- చక్రవర్తులకు చెందిన భూములను రాజకంభేట అని పిలిచేవారు. పంటలు పండే క్షేత్రాలను సీత క్షేత్రాలు అనేవారు. వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని సీతాధ్యక్ష అంటారు.
- శాతవాహనుల కాలంలో దేశ, విదేశీ వ్యాపారాన్ని నిర్వహించేవారిని సార్థవాహులు అని పిలిచేవారు.
- శాతవాహనుల విదేశీ వ్యాపారం ఎక్కువగా రోమ్ మరియు వియత్నాం దేశాలతో జరిగింది.
- వియత్నాంని శాతవాహనుల కాలంలో అన్నాం అని పిలిచారు.
శాతవాహనుల విదేశీ వాణిజ్యానికి గల ఆధారాలు:
- టాలమీ రాసిన ఏ గైడ్ టూ జాగ్రఫీ: ఈ గ్రంధంలో ప్రాచీన కాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఓడరేవుల గురించి రాసి ఉంది. అందులో భాగంగా.. మైసోలియా( మచిలీపట్నం), కొంటక శిల( ఘంటసాల ), కొడ్డూర ( కోడూరు ), ఎఫిటేరియన్ ( కోరంగి,తూ.గో జిల్లా), ఆల్లోసనయి ( ఇంతవరకూ కనుక్కోలేదు ). అల్లాసనై అనగా అవనిగడ్డ అనేది ఒక వాదం.
- స్ట్రాబో : ఇతను గ్రీకు చరిత్రకారుడు. శాతవాహనులకు, రోమన్లకు జరిగిన వర్తక వ్యాపారాల గురించి వివరించాడు.
- పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ. ఒక అజ్ఞాత నావికుడు రచించిన పుస్తకం. దీనిని ఎర్ర సముద్రంపై దినచర్య అని తెలుగులో అంటారు. ఈ గ్రంథంలో తూర్పు, పడమర రేవు పట్టణాల గురించి వివరిస్తుంది. ఈ పుస్తకంలో ఎక్కువగా ప్రస్తావించిన ఓడరేవు పేరు.. బోచ్ ( బరుకచ్చం, గుజరాత్ ). అలాగే ఈ గ్రంథంలో అప్పట్లో ఎక్కువ హడావుడిగా ఉన్న ఓడరేపు కళ్యాణి ఓడరేవు.
ఈ పుస్తకంలో పేర్కొన్న ఏకైక తూర్పు తీర రేవు పట్టణం మైసోలియా.
- ప్లినీ : రోమ్: ఇతను రాసిన గ్రంథం నేచులర్ హిస్టరీ.
రోమన్ వెండి, బంగారు నాణేలు భారత్ కు తరలిపోతున్నాయని తద్వారా రోమ్ దేశం దివాలా తీస్తుందని రోమన్ శాసన సభలో ఆవేదన వ్యక్తం చేసినవాడు ప్లినీ.
ఆ రోజుల్లో మచిలీపట్నం నుంచి వరశెల్లాలు లేదా మస్లిన్ అనే సన్నని దారంతో చేసిన వస్త్రాలు భారత్ నుంచి రోమ్ కు ఎగుమతి అయ్యేవి. ఈ వస్త్రాలను తొడిగిన రోమన్ యువతులు సిగ్గు, బిడియం లేకుండా తిరిగేవారు. అందువల్ల శాతవాహనుల వస్త్రాలను నిషేదించాలని రోమన్ శానససభ నిర్ణయం తీసుకుంది.
రోమన్ నాణేలు తెలంగాణాలో దొరికిన ప్రాంతాలు:
శాతవాహనులు, రోమన్లకు మధ్య జరిగిన వ్యాపారంలో మనదే పైచేయి. మనం రోమన్లకు ఎగుమతులు మాత్రమే చేశాం, కానీ అక్కడి నుంచి ఏమీ దిగుమతి చేసుకోలేదు. శాతవాహనుల కాలంలో తయారయ్యే మేలురకం వస్త్రాలను కొనేందుకు రోమన్ వ్యాపారులు ఎగబడేవారు. వారు బంగారు, వెండి నాణేలను మనకు ఇచ్చి.. ఈ నాణేలపై రోమన్ చక్రవర్తి టైబీరియస్ ముద్రలున్నాయి.
- హైటెక్ సిటీ – కొండాపూర్, తాండూరు ( రంగారెడ్డి జిల్లా ), సూర్యాపేట ( నల్గొండ ), కోటిలింగాల ( కరీంనగర్ ), పెదబంకూరు, మనులగుట్ట, థూళికట్ట ( కరీంనగర్ ) ప్రాంతాల్లో రోమన్ నాణేలు దొరికాయి.
- శాతవాహనుల ఆర్దిక వ్యవహారాల్లో రెండు నాణేలు ముఖ్యమైనవి. 1 సువర్ణం ( బంగారు నాణెం ), 2. కర్షపణం ( వెండి నాణెం )
- 35 కార్షపణాలు ఒక సువర్ణంతో సమానం ( చాలా ముఖ్యమైన విషయం )
పన్నులు:
భాగ : పండిన పంటలో 1/6వ వంతు వసూలు చేస్తే దానిని దేవమేయం లేదా రాజ్యమేయం అంటారు.
బలి : యజ్ఞాల సమయంలో రాజు ప్రజలపై ప్రత్యేకంగా విధించే పన్ను.
శుల్క : నీటి పన్ను
కారుకర వివిధ వృత్తి సంఘాల వారు చెల్లించే పన్ను
కార / కర : కూరగాయలపై, పండ్ల తోటలపై విధించి వసూలు చేసిన పన్ను.
వర్తక వాణిజ్యాలు:
దేశ విదేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించాడు.
శాతవాహనుల నాణేలపై కనిపించే ఓడబొమ్మ వారి సముద్రవర్తకానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
కృష్ణా నదీ లోయలో రోమను నాణేలు దొరకడం.. వీరి విదేశీ వ్యాపారాన్ని సూచిస్తుంది.
ఆర్ధిక రంగంలో శ్రేణులు కీలక పాత్ర పోషించాయి.
సమాజం:
శాతవాహన రాజులు బ్రాహ్మణులు. వర్ణాశ్రమధర్మానుసారం ఏర్పడ్డ చారుత్వర్ణ వ్యవస్థను పటిష్టం చేశారు.
సాంఘిక వ్యవస్థను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజించడమే కాక.. సాంఘిక హోదాను అనుసరించి.. మరో విభజన ఏర్పడింది.
ఉన్నతోద్యోగులైన మహారథులు, మహాభోజులు, మహాసేనాపతులు మొదటివర్గంగా వ్యవహరించబడ్డారు.
అమాత్యులు, మహామాత్రులు, బాండాగారికులు, నైగములు, సార్థవాహులు మొదలగు మధ్యతరగతి వర్గం రెండో వర్గంలో ఉన్నారు.
మూడో వర్గంలో .. చిన్న ఉద్యోగులైన లేఖకులు, సువర్ణకారులు, ఘండికులు ఉన్నారు.
నాలుగో వర్గంలో వార్దకులు, మాలాకారులు, దాసకులు మొదలగువారు నాలుగోవర్గంగా పరిగణించబడేవారు.
- శాతవాహనుల కాలంలో.. ఖచ్చితంగా వర్ణవ్యవస్థ ఉంది. అయితే.. అది కఠినంగా లేదు.
- దక్షిణభారత దేశంలో మొట్టమొదటిగా కులాలు శాతవాహనకాలంలోనే జన్మించాయి. కుల వ్యవస్థ ఉంది. అది కఠినంగా ఉంది. ఒక కులంనుంచి మరో కులంలోకి మారకుండా.. ఏర్పాటు చేసిన నియమనిబంధనల అంశాన్ని సమయధర్మం అంటారు. ( చాలా సార్లు బిట్ అడిగారు. )
- పితృస్వామిక వ్యవస్థ కొనసాగింది. అయితే.. స్త్రీలకు కూడా సముచిత స్థానం, గౌరవం ఇవ్వడం శాతవాహనుల ప్రత్యేకత.
- స్త్రీలకు సొంత ఆస్థులు ఉండేవి. దీనినే స్త్రీధనం అంటారు. అనగా కుమార్తెకు వివాహం జరగబోయే ముందు తండ్రి కుమార్తె పేరిట రాసే ధనం
- అనులోమ, ప్రతిలోమ వివాహాలు జరిగాయి.
అనులోమ వివాహం : అగ్రవర్ణాలకు చెందిన అబ్బాయి.. దిగువవర్ణాలకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ( బ్రాహ్మణ అబ్బాయి.. శూద్ర అమ్మాయి ) వీళ్లకు పుట్టిన సంతానాన్ని ఉగ్రసంతానం అంటారు. ( ముఖ్యమైన విషయం )
విలోమ లేదా ప్రతిలోమ వివాహం: తక్కువ కులం ఉన్న అబ్బాయి.. ఎక్కువ కులం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. వీరి సంతానాన్ని ఛండాల సంతానం అంటారు.
బహుభార్యత్వం: శాతవాహన సమాజంలో బహుభార్యత్వం ఉంది. అయితే ఇది కేవలం ఉన్నత వర్గాలలో మాత్రమే ఉంది.
సతీసహగమనం: సతీసహగమనం దురాచారం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే.. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యమవ్వడంలేదు.
వితంతువులు: శాతవాహన సమాజంలో వితంతువులున్నారు. అయితే వితంతుపునర్వివాహాలు మాత్రం లేవు.
వేశ్యావృత్తి: సామాజిక వ్యవస్థలో వేశ్యావృత్తికి గౌరవప్రదమైన స్థానం ఉంది.
వర్ణవ్యవస్థ:
ఉత్తర భారతదేశంలో మనువు సృష్టించిన వర్ణవ్యవస్థ.. ఆగస్త్య మహాముని ద్వారా దక్షిణాదికి దిగుమతి అయ్యింది. శాతవాహనుల కన్నా ముందే తెలుగు నేలలో వర్ణవ్యవస్థ వచ్చినట్లు ఆధారాలున్నాయి. దీనికి తోడు శాతవాహనరాజులు బ్రాహ్మణులే కాబట్టి.. వర్ణవ్యవస్థకు ప్రాధాన్యమిచ్చారు. అయితే వర్ణవ్యవస్థ కఠినంగా మాత్రం లేదు.(ఇది గుర్తుంచుకోవాలి ). ఇదే సమయంలో.. విదేశీయులైన శకకార్తమకులు మన హిందూ సమాజంలో కలిసిపోయి.. క్షత్రియులుగా పరిణామం మాత్రం చెందారు.
వర్ణాశ్రమధర్మాలంటే…: బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం.
కుల వ్యవస్థ:
శాతవాహనుల కాలంలో తమ కులం ద్వారా పొందిన సంతానాన్ని.. ఉత్తమ సంతానం అని పిలిచారు. సూత్రవాజ్ఞయం ఇలా చెబుతోంది.
- క్షత్రియ లేదా.. వైశ్య పురుషునికి శూద్ర స్త్రీ వలన కలిగిన సంతానాన్ని ఉగ్ర అని పిలిచారు.
- శూద్రునివల్ల బ్రాహ్మణ స్త్రీకి జన్మించే సంతానం ఛండాల జాతికి చెందినవారని పిలిచారు.
వర్ణవ్యవస్థ : మనువు రాసిన ఉత్తరాది వర్ణవ్యవస్థ ను దక్షణాదికి తీసుకువచ్చింది అగస్త్యుడు శాతవాహనులు బ్రహ్మణులే కాబట్టి దీన్ని స్వీకరించారు దీనికి అధిక ప్రధాన్యం ఇచ్చారు. వర్ణవ్యవస్థ చాలా సులభంగా ఉంటుంది అందుకే దీనిని విదేశీయులైన శకకార్దమకులు మన హిందూ ధర్మంలో కలిసి పోయి క్షత్రియులుగా పరిణామం చెంది వర్ణాశ్రమ ధర్మాలను పాటించారు. వర్ణాశ్రమ ధర్మం అంటే బ్రహ్మచర్యం,గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. శాతవాహనుల కాలంలో తమ కులం స్త్రీ ద్వారా పొందిన సంతానాన్ని ఉత్తమ సంతానం అంటారు. సూత్ర వాజ్మయం ప్రకారం క్షత్రియ లేదా వైశ్య పురుషునికి శూద్ర స్త్రీ కి కలిగిన సంతానం “ఉగ్ర” అని,శూద్రునికి బ్రాహ్మణ స్త్రీ కి కలిగిన సంతానం ఛండాల జాతి అని పిలిచారు.
హిరణ్య గర్భ యజ్ఞం : శాతవాహనుల కాలంలో హిరణ్య గర్భ యజ్నం. అనే కాన్సెప్ట్ ఉంది. అంటే.. దిగువ వర్గాల వారు.. ఎగువ వర్గాల్లోకి చేరేందుకు చేసే యజ్నం. ఉదాహరణకు.. వైశ్యులు.. క్షత్రియుల హోదా పొందాలంటే.. ఈ హిరణ్య గర్భ యజ్నం చేయాల్సి ఉంటుంది.
కులవ్యవస్థ : దీని పుట్టుకకు దక్షిణాది లో ప్రారంభమైంది. మొదటి సారిగా శాతవాహనుల కాలంలోనే వృత్తులు, కులాలు రూపాంతరం చెందాయి. కొన్ని కులాల సముదాయమే సమాజం. ప్రతి కుటుంబానికి వృత్తి ఆధారం కాబట్టి ఏ వృత్తి లో అయితే ఉన్నారో ఆ వృత్తి వారందరూ ఒక కులంగా ఏర్పడి ఒకే సామాజిక కట్టుబాటు కింద జీవనం సాగిస్తున్నారు.
శాతవాహనుల కాలంలో మనకు కనబడే వృత్తులు.. ఇవి కొంచెం ముఖ్యమైనవి
కోలికలు – సాలెవారు ; తిలపిష్టికలు – నూనె తీసేవారు; కసకారులు – కుమ్మరులు ; తెసకారులు – వస్తువులను మెరుగు పెట్టెవారు ; చంకుకారులు – చర్మకారులు ; గధికులు – సుగంధ ద్రవ్యాలను తీసి అమ్మేవారు; పసకారులు – మేదరపనివారు.
ఈ వృత్తులవారు స్థానిక ప్రభుత్వాలకు చెల్లించిన పన్నును కారుకం అంటారు. ఒక్కో వృత్తి చేసేవారందరిని ఒక్కో సంఘం గా మారి శ్రేణిగా పిలవబడినారు. శ్రేణికి అధిపతి శ్రేష్టి. ఒక వృత్తి వారు మరొక వృత్తి లోకి వెళ్లకుండా శ్రేష్టి నియమ నిబంధనలు విధించాడు.దీనినే ఒక సామాజిక కట్టుబాటు అని చెప్పవచ్చు. ఈ శ్రేణులు వృత్తి సంఘలుగానే కాక బ్యాంకులుగా మారాయి. దీంట్లో 12% వడ్డికి అప్పులు కూడా ఇచ్చారు. ఒక దశ దాటిన తర్వాత శ్రేణి కులం అయ్యింది.
కుటుంబ వ్యవస్థ :
శాతవాహన పేర్ల ముందు వారి తల్లుల పేర్లు రావడం గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి మొదలైంది.అలా అని వీళ్లది మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ కాదు. ఇలాతల్లుల పేర్లు ముందు పెట్టుకొవడానికి గల కారణం రాజుల్లో, ఉన్నత వర్గీయుల్లోనూ బహు భార్యత్వం ఉండటం కోసం ఇలా తల్లు పేర్లు ను పెట్టుకున్నారు. ఇలా తమ పేరు ముందు తల్లుల పేర్లు పెట్టుకున్నా వారు గౌతమీపుత్ర శాతకర్ణి, శివశ్రీ పుత్ర శాతకర్ణి, చోరపుత్ర శాతకర్ణి, వాశిష్టీపుత్ర శాతకర్ణి.
స్త్రీ స్థానం :
అప్పట్లో మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి ఎలాగంటే
- స్త్రీలు ధనం కలిగి ఉండేవారు
- వితంతు రాణులు తమ కుమారుల బాల్యంలో పాలనాభారం నిర్వహించేవారు.
- నాసిక్, కార్లే, అమరావతి బౌద్ధ విహారాలకు విరివిగా దానాలు చేశారు.
- యజ్నాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొన్నారు. హాలుడు రాసిన గాథాసప్తపతి లో చాలా భాగం రాసింది మాధవి, శ్రోత, ఆంగిక లాంటి రచయిత మహిళలే కావడంతో శాతవాహనుల కాలంలో మహిళలకు స్వతంత్రలే అనే అంశాన్ని బలపరుస్తున్నాయి. అయితే హాలుడు రాసిన గాథాసప్తపతి ఒక్కోసారి స్త్రీ స్వాతంత్రాన్నే ప్రశ్నిస్తోంది. ఆ రోజుల్లో దూరప్రాంతాలకు వెళ్లే వ్యాపారులైన బేహారులు తమ భార్యలపై విశ్వాసం లేక చిలుకలను కాపాలాగా పెట్టేవారు. అలా 700 చిలుకలు తమ యజమానులకు చెప్పిన గాధలే గాథాసప్తపతి అనేది వాదం.
దీంతోపాటు తమ భార్యలు పరాయిపురుషులతో సంబంధం పెట్టుకోకుండా.. ఇనుపకచ్చడాలు తొడిగేవారనే ఆధారాలు కూడా లభ్యమౌతున్నాయి.
శాతవాహనుల కాలంలో స్త్రీలు, పురుషులు తమ ఆభరణాలను చాలా అందంగా తయారుచేయించుకునేవారు. వీటికి సంబంధించి ఆధారాలు అమరావతి, నాగర్జున కొండ, గుమ్మడి దుర్రు, రామిరెడ్డి పల్లుల్లో లభించిన వాటిని చేస్తే సౌందర్య పిపాశ అర్థమవుతుంది. ఈ కాలంలో ప్రజల ప్రధాన వినోదాలలో నాట్యం, సంగీతం, పాచికలాట, కోడిపందేలు, పోట్టేళ్ల పందేలు, ఎడ్ల పందేలు.
మతం:
- శాతవాహన రాజులు వైదిక మతాన్ని అవలంబించారు. వర్ణాశ్రమధర్మం ఆధారంగా ఏర్పడిన చాతుర్వర్ణ వ్యవస్థను పటిష్టం చేశారు. కానీ వీరు మతోన్మాదులు మాత్రం కాదు. రాజులే అశ్వమేధం, రాజసూయ యాగాలు చేయడం విశేషం.
- శాతవాహన కాలంలో ద్రవిడ మతం కూడా ఉంది. శివుడిని లింగ రూపంలో ఆరాధించడం దీనికి ముఖ్యమైన లక్షణం.
- శాతవాహన కాలంలో భాగవత వైష్ణవం ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అంటే శివుడిని, విష్ణువుని కొలవడం.
బౌద్ధమతాన్ని ఆదరించడమే కాకుండా.. చాలా మంది శాతవాహన రాణులు బౌద్ధమత విశ్వాసాల్ని ఆచరించారు. వీరు అనేక బౌద్ధ విహారాలను, చైత్య గృహాలను నిర్మించడానికి సాయపడ్డారు.
గుర్తుంచుకోవాల్సినవి: శాతవాహనరాజులు మొదట జైన మతస్థులు. వీరి అధికారిక మతం వైదికం. అయితే రాణులు, సామాన్యప్రజలు, సైనికులు, శిల్పాలు చెక్కేవారు, స్త్రీలు.. వీరందరూ బౌద్ధమతాన్ని ఆదరించారు.
బౌద్ధమత శాఖలు : 1. భద్రనీయ 2. చైత్యకవాదం 3. మహాసాంఘీక 4. మహస్థవిరవాదులు 5. మహా ధేరవాదులు
బౌద్ధం :
- శాతవాహనుల రాజైన యజ్నశ్రీ శాతకర్ణి కాలంలోనే బౌద్ధం హీనయాన, మహాయానాలుగా విభజింపబడింది.
- శాతవాహన రాజులలో మొదటి కృష్ణుడు తన రాజ్యంలో నివసించే బౌద్ధ భిక్షువుల కోసం ఒక మహామాత్రుడిని నియమించాడు.
- మొదటి శాతకర్ణి మహాఆర్యకుడు అనే బౌద్ధ సన్యాసి నేతృత్వంలో ఒక బృందాన్ని శ్రీలంకకి పంపాడు. అప్పటి శ్రీలంక బౌద్ధరాజు దుప్పిగామణి.
- రెండవ శాతకర్ణి మధ్యప్రదేశ్ లో సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం కట్టించాడు.
- గౌతమీపుత్రుని తల్లి గౌతమీ బాలశ్రీ మహారాష్ట్రలోని నాసిక్ గుహలను భద్రనీయ బౌద్ధశాఖ మతస్థులకు దానంగా ఇచ్చింది. ( ఇటీవలే ఈ బిట్ అడిగారు)
- కోలికలు అనే సాలెవారు సంవత్సరానికి సరిపడా వస్త్రాన్ని నామమాత్రపు వడ్డీతో నాసిక్ గుహలలో నివసించే బౌద్ధ సన్యాసులకు దానం చేశారు.
- యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునికి నాగార్జున కొండవద్ద పారావతా విహారాన్ని నిర్మించి ఇచ్చాడు.
శాతవాహనుల కాలంలో జైన మతం: శాతవాహనుల కాలంనాటికి పేరుగాంచిన జైన మత గురువు కొండకుందాచార్య. ఇతడు అనంతపురం జిల్లా కొనకొండాపురానికి చెందినవాడు. ఇతడు సమయసారం అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఇతడు తమిళనాడులో కూడా బోధనలు చేశారు. తమిళులు కొండకుందాచార్యను.. తిరువళ్లూర్ అని పిలిచేవారు. ఇతడు సరస్వతి గచ్ఛలు.. అనే విద్యాలయాలు స్థాపించి.. ఆ పీఠాలకు నేతృత్వం వహించాడు. సరస్వతి గచ్చలు అనేవి.. జైన విద్యాలయాలు.
శాతవాహనుల సాంస్కృతిక సేవ:. భాష, సాహిత్యం, వాస్తు, శిల్పం
సుమారు 500 సంవత్సరాలు సాగిన శాతవాహనుల పాలన భారత దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.
భాష:
దక్షిణ భారత దేశంలో అతి ప్రాచీనమైన భాష, పుస్తకరూపంలో రాయబడిన భాష తమిళం. ఈ కాలంలో వచ్చిన సాహిత్యాన్నే సంగం సాహిత్యం అనేవారు. అయితే తమిళనాడు, కేరళ ప్రాంతాంల్లో తమిళ భాష వ్యవహారంలో ఉన్న సమయంలో.. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. అయితే ప్రజలు మాట్లాడిన భాష మాత్రం దేశీ భాష.
- తమిళ సాహిత్యంలో.. పోసాండ సుత్తాన్ అని.. శాతవాహనరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రస్తావన ఉంది.
- సామాన్య ప్రజలు మాట్లాడిన దేశీ భాష నుంచే.. కన్నడం, తెలుగు జన్మించాయి.
- అయితే మొదటి పులోమావి లేదా కుంతల శాతకర్ణి కాలంలో మాత్రమే సంస్కృతం అధికార భాషగా కొనసాగింది.
సాహిత్యం:
- హాలుడు గాధాసప్తశతి అనే గ్రంధాన్ని పాకృతంలో రాశాడు. ( మహారాష్ట్రీ మాండలికం )దీని గురించి ఇప్పటివరకూ చాలా ప్రశ్నలు అడిగారు.
- గాథాసప్తశతిలో ప్రధానంగా నీతి వాక్యాలున్నాయి. దీంట్లో నర్మద, గోదావరి నదుల ప్రస్తావన ఉంది. గాధాసప్తశతిని సంకలనం చేసింది శ్రీపాలితుడు. సుమారు 350 మంది కవులు గాధాసప్తశతిని రాశారని చరిత్రకారుల అంచనా.
- గుణాడ్యుడు బృహత్కథను ప్రాకృత భాష.. పైశాచీ మాండలికంలో రాశాడు. అయితే గుణాడ్యుడి బృహత్కథ మనకు పూర్తిగా లభించలేదు. ఈ గ్రంథాన్ని పైశాచీ ప్రాకృతంలో రచించిన గుణాడ్యుడు.. కాల్చివేశాడనే ప్రచారం ఉంది. అయితే ఈ పుస్తకంలో దొరికిన ఒక లంబకం ఆధారంగా.. సోమదేవయసూరి అనే రచయిత కథాసరిత్సాగరం అనే గ్రంథం రాశాడు. శాతవాహనుల తొలిచరిత్ర తెలుసుకోడానికి ఇది బాగా ఆధారం. గుణాడ్యుడు హైదరాబాద్ సమీపంలోని కొండాపూర్ ( కొండాపురానికి) చెందినవాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
- శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో రాయబడిన గ్రంధం కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం.
- శర్వవర్మ సంస్కృతంలో కాతంత్య్ర వ్యాకరణం రాశారు.
- శాతవాహనుల కాలంలో మరో ప్రముఖ గ్రంధం వాత్సాయనుడు రాసిన కామసూత్ర ( సంస్కృతం ). దీనినే జయమంగళ అనికూడా అంటారు.( ముఖ్యమైన విషయం). ప్రపంచంలోని 160 భాషల్లో ఈ జయమంగళ అనువాదితమైంది.
ఆచార్య నాగార్జునుడు రాసిన గ్రంధాలు:1. ప్రజ్ఞా పారమిత, 2. సహృల్లేఖ, 3. ప్రజ్ఞాదీపం, 4. శూన్యసప్తది 5. మూల మాధ్యమిక శాస్త్రం 6. మధ్యంతానుగతం, 7.దశభూమి విభాష 8 ప్రమాణ విమోచనం 9. ద్వాదశనికాయం. (నాగార్జునుడు: మాధ్యమిక వాద సిద్ధాంతకర్త. తత్వవేత్తగా చెప్పడంతో పాటు.. రసాయనిక శాస్త్రవేత్తగా కూడా గుర్తించవచ్చు. శ్రీపర్వతం/ నాగార్జున కొండలో నాగార్జునుడు నివసించాడు. కొంతకాలం పాటు గౌతమీ పుత్ర యజ్నశ్రీ ఆస్థానాన్ని అలంకరించాడు. )
వాస్తు, శిల్పకళలు:
స్థూపాలు: బుద్ధుడి లేదా బౌద్ధ బిక్షువుల అస్థికలు, అవశేషాలతో నిర్మించిన కట్టడాలు
విహారాలు: బౌద్ద బిక్షువులు, సన్యాసుల నివాస ప్రాంతాలు.
చైత్యాలు: బౌద్ద బిక్షువుల ప్రార్థనా మందిరాలు.
నోట్: స్థూపాలు, విహారాలు, చైత్యాలు అని వేటిని అంటారు.. అని చాలాసార్లు పరీక్షల్లో అడిగారు. బాగా గుర్తుంచుకోవాలి.
చివరి శాతవాహనరాజుల్లో గొప్పవాడైన యజ్నశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జునుడికి పారావత విహారాన్ని నాగార్జున కొండదగ్గర నిర్మించి ఇచ్చారు. ఈ పారావత విహారం.. ఐదు అంతస్థులతో.. ఐదవందల గదులతో .. ఐదు ఆకారాల్లో ఉంది.
మొదటి అంతస్థు.. ఏనుగు ఆకారంలో, రెండో అంతస్థు సింహం ఆకారంలో, మూడో అంతస్థు జింక ఆకారంలో, నాలుగో అంతస్థు వృషభాకారంలో, ఐదో అంతస్థు పావురం ఆకారంలో నిర్మించారు.
అమరావతి స్థూపానికి ప్రాకారం కట్టించింది ఆచార్య నాగార్జునుడు.
బౌద్ధ స్థూపాలు: తెలంగాణాలో స్థూపానికి నాగులు పునాది వేయగా.. శాతవాహనులు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా అమరావతి స్థూపాన్ని.
స్థూప నిర్మాణంలో ఉపయోగించే పదజాలం: 1.వేదిక 2. అండం 3. మేధి 4 ఛత్రావళి 5 తోరణాలు.
నోట్: ఏ స్థూపంపై అయినా.. బౌద్ధమతానికి చెందిన జాతక కథలు చెక్కబడి ఉంటాయి. జాతక కథలు అనగా.. బుద్ధుడి పూర్వ జన్మ గాథలు. తెలంగాణాలో నాగార్జున కొండలో స్థూపాలున్నాయి. ( ఏపీలో అమరావతి( అమరావతికి మరో పేర్లు దీపాల దిన్నె, వజ్రాల దిన్నె ), జగ్గయ్యపేట, గుంటుపల్లి, ఘంటసాల ). మహారాష్ట్ర కార్లే లో.. అత్యంత సుందరమైన, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన చైత్యం ఉంది.
మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాల్లో ఉన్న 30 అజంతా గుహల్లో 9,10 గుహలు శాతవాహనులవి. ( అసలు అజంతా గుహల నిర్మాణాన్ని మొదటగా ప్రారంభించిన వారు మౌర్యులు. తదనంతరం శాతవాహనులు, తర్వాత వాకాటకులు, తర్వాత గుప్తులు, తర్వాత బాదామి చాళుక్యులు.. వీటిని వరసక్రమంలో గుర్తుపెట్టుకోవాలి.
విహారాలు: బౌద్ధ బిక్షువులు నివసించే ఇండ్లు. వీళ్లు సాధారంగా వర్షాకాలం నాలుగు నెలలు విహారాల్లో ఉండేవారు. దీనిని వస్స అని పిలిచారు. బౌద్ధ విహారాలకు కేంద్రంగా నాగార్జున కొండను చెప్పవచ్చు .
No comments:
Post a Comment