పెదకోమటి వేమారెడ్డి పాలనాకాలం ?
క్రీ.శ.1402 - 1420
విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన నికోలోకోంటి ఏ దేశస్థుడు ?
ఇటలీ
విజయనగర రాజులకాలంలో ‘చంద్రశాలలు’ అంటే ?
ఉన్నత కుటుంబాల గృహాలలో మధుపానసేవన గదులు
జైన, వైష్ణవులకు క్రీ.శ.1368లో వివాదం వచ్చినప్పుడు దానిని పరిష్కరించిన విజయనగరరాజు ఎవరు ?
మొదటి బుక్కరాయలు
‘మాలదాసరికథ’ ఏ గ్రంథంలో ఉంది ?
ఆముక్తమాల్యద
గోల్కొండ సుల్తానుల కాలంలో ఆయకట్టు భూములకు నీరు పెట్టేవారిని ఏమంటారు ?
వడ్డెర
‘రెండవ ఈజిప్ట్’ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు ?
గోల్కొండ
శిస్తు వసూలు హక్కు కొన్నవారిని గోల్కొండ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు ?
ముస్తజీర్‌లు
భక్తరామదాసును ఖైదుచేయించిన గోల్కొండ నవాబు ?
అబుల్‌హసన్ తానీషా
గోల్కొండరాజ్యాన్ని ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు ?
క్రీ.శ.1687
శాతవాహనుల చరిత్రకు సంబంధించని సమకాలీన శాసనమేది ?
అత్తివర్మ గోరంట్ల శాసనం
ఆంధ్రుల వంశావళిని తెలిపే ‘‘కలియుగ రాజ వృత్తాంతం’’ ఏ పురాణంలోని భాగం ?
భవిష్యపురాణం
పురాణాలను ‘‘డైనాస్టీస్ ఆఫ్ కలి ఏజ్’’ (Dynasties of Kali age) అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన వారు ?
పార్గిటర్
శాతవాహనుల కాలంలో వాడుకలోనున్న కార్షపణం, కుశనము, సువర్ణము, పదక /ప్రతీక నాణాల ఆకృతి ?
గుండ్రం, చతురస్రం, అండాకృతి
భండార్కర్, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సన్‌లు శాతవాహన ఆంధ్రులని పేర్కొనడానికి కారణం ?
శాసనాలు, నాణాలపై ఉన్న శాతవాహన రాజుల పేర్లు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్రరాజుల పేర్లతో చాలా వరకు సరిపోతున్నాయి.
శాతవాహనులు, ఆంధ్రులు ఒకరేనని చెబుతూ, ఆంధ్రులు వింద్య పర్వత ప్రాంత తెగలలో ఒకరిగా పేర్కొన్న చరిత్రకారుడు?
P.T. శ్రీనివాస అయ్యంగార్
శాతవాహన; ఆంధ్ర పదాలను ఈ విధంగా పేర్కొనవచ్చు ?
రాజవంశావళి పేరు; గణనామం
‘‘శాతవాహనులు ఆంధ్రులుకారనీ, పురాణాలు తెలిపినట్టు ఆంధ్రభృత్యులు మాత్రమే’’ అనే V.S.సుక్తంకర్ వాదాన్ని బలపరచినవారు?
రాయచౌదరి, శ్రీనివాసశాస్త్రి
అశోకుని శాసనాల్లోని సాతేయపుత్రులే శాతవాహనులని అన్నది ?
V.S.భక్లే
ఖారవేలుని హాతిగుంఫా శాసనం, బాలశ్రీ నాసిక్ శాసనం ఆధారంగా విదర్భరాజ్యమే శాతవాహనుల జన్మస్థానమన్నవారు ?
వి.వి.మిరాశీ
ప్రాకృత భాషను ఉపయోగించినందున శాతవాహనులు మహారాష్ర్టులన్న చరిత్రకారుడు ?
పి.టి.శ్రీనివాస అయ్యంగార్
శాతవాహనులు ఆంధ్రులని అంగీకరిస్తే వారి సామ్రాజ్యం తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిందని చెప్పవచ్చు’ అని అన్నదెవరు ?
గొర్తి వెంకటరావు
శాతవాహనులు శుంగ వంశానికి సమకాలికులని, కృష్ణా గోదావరి ప్రాంతం నుంచి పశ్చిమ భాగానికి విస్తరించారన్న పండితుడు ?
రాప్సన్
బర్జెస్, బార్నెట్ పండితుల ప్రకారం శాతవాహనుల తొలి, తర్వాత రాజధానులు ?
శ్రీకాకుళం- ధాన్యకటకం
శాతవాహనుల వంశోత్పత్తిని తెలిపే జినప్రభాసూరి అనే జైనపండితుడి గ్రంధం ?
ప్రతిష్ఠానపురకల్ప
‘‘శాలివాహన’’ పదం ‘‘శాతవాహన’’ కు అపభ్రంశ రూపంగా చెప్పిన ప్రాకృత వ్యాకరణవేత్త ?
హేమచంద్రుడు
పురాణాల్లో మొదటిగా పేర్కొన్న ఏ వ్యక్తి, శాతవాహనుల వంశ మూలపురుషుడైన సాదవాహనుడు ఒక్కరే అని కోటిలింగాల వద్ద దొరికిన నాణాల ఆధారంగా నిర్ధారించవచ్చు ?
సిముక
మహారాష్ర్టలోని నెవాసా, తెలంగాణలోని కొండాపూర్‌లలో లభించిన నాణాలు శాతవాహన రాజులలో ఎవరివి ?
సదవాహన
‘శాతవాహనులు తల్లివైపు గోత్రాలను పాటించని క్షత్రియులని’ అన్నది ?
కె. గోపాలాచారి
వృషలుడు అంటే వర్ణధర్మాన్ని విస్మరించడంవల్ల కులాన్ని పోగొట్టుకున్నవాడు లేదా కులంలేని వాడిగా పురాణాలు ఏ ఆంధ్రజాతీయుడిని పేర్కొన్నాయి ?
సిముక
కన్నడ దేశంలోని ఏ ప్రసిద్ధ రేవుపట్టణాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఆక్రమించాడు ?
వైజయంతి
గౌతమిపుత్ర శాతకర్ణి యవనుల కిచ్చిన కానుకల గురించి తెలిపే శాసనాలు ?
నాసిక్,కార్లే,జున్నార్
నాసిక్ ప్రశస్తి పేర్కొన్న దక్షిణాపథేశ్వరుడు ?
వాసిష్ఠిపుత్ర పులోమావి
ఆంధ్రప్రాంతంలో శాతవాహనుల శాసనాల లభ్యం ఎవరి కాలం నుంచి మొదలైంది ?
వాసిష్ఠిపుత్ర పులోమావి
తెలంగాణాలో శాతవాహన, చిముక, శాతకర్ణుల నాణాలు, తీరస్థ ఆంధ్రలో గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు లభించడాన్ని బట్టి వాసిష్ఠిపులోమావి _____వారసుడు.
విస్తార సామ్రాజ్యానికి
వాసిష్ఠిపుత్ర శాతకర్ణి శకరుద్రదామక కుమార్తె రుద్రదమనిక శాసనకర్తను వివాహం చేసుకున్నట్టు తెలిపే శాసంనం ?
కన్హేరి
ఏ శాతవాహన రాజు కాలంలో మత్స్యపురాణ సంకలనం జరిగినట్టు చరిత్రకారులు చెబుతున్నారు ?
యజ్ఞశ్రీ శాతకర్ణి
ఆచార్య నాగార్జునుని పోషించిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ కవిని త్రిసముద్రాధీశ్వరునిగా స్తుతించాడు ?
బాణుడు
యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని ఆదరించినట్టు, నాగార్జునాచార్యుని తన రాజ్యంలో నిలుపుకొని, ఆయన కోసం మహావిహారాలను, చైత్యాలను నిర్మించినట్టు పేర్కొన్న విదేశీ యాత్రికుడు ?
హుయాన్‌త్సాంగ్
పలు ప్రాంతాల్లో కనిపించే కడపటి శాతవాహనుల శాసనాలు, నాణాల ఆధారంగా, శాతవాహన వంశంలో అంతఃకలహాలు ప్రారంభమైనట్టు ఏ గ్రంథంలో హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు ?
కథాసరిత్సాగరం
చివరి శాతవాహనుల కాలంలో అంతఃపుర కలహాలు అధారంగా భిన్న భాగాల్లో భిన్న శాఖలకు చెందిన రాజకుమారులు స్వతంత్రరాజ్యాలు స్థాపించారని తెలిపే పురాణం?
యుగ
మూడో పులోమావి కాలంలో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో శాతవాహనరట్టిని పాలించడానికి నియమించబడిన మహా సేనాధిపతి ?
స్కందనాగుడు
శాతవాహనులను అంతం చేసి శ్రీపర్వతీయులు రాజ్యానాక్రమించారని యుగపురాణం తెల్పుతోంది. దీని ప్రకారం ఇక్ష్వాక వంశస్థుడు శాంతమూలుడు ఏ శాతవాహనరాజును ఓడించి ధరణికోటను ఆక్రమించాడు ?
పులోమావి - iii
శాతవాహన వంశ క్షీణతకు ముఖ్యకారణం ?
శక - శాతవాహన చిరకాల సంఘర్షణ
No comments:
Post a Comment