1. భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) వసబంధుడు
2) ఆచార్య నాగార్జునుడు
3) ధర్మకీర్తి
4) దిగ్నాగుడు
సమాధానం : 4
2. శాతవాహనుల కాలంనాటి తవ్వకాల్లో ఏ దేశ నాణేలు విస్తారంగా లభించాయి?
1) గ్రీస్
2) రోమన్
3) ఈజిప్టు
4) ఇరాక్
సమాధానం : 2
3. రజాకారుల దళంలో చివరిస్థాయి అధికారి?
1) మర్‌కాజ్
2) సాలార్-ఇ-సాఘిర్
3) సాలార్-ఇ-కబర్
4) అప్సర్-ఇ-అలాగా
సమాధానం :1
4. ఒకటో సాలార్జంగ్ కిందివారిలో ఏ పాలకుడి వద్ద దివాన్‌గా పనిచేశాడు?
1) నాసిరుద్దౌలా
2) అఫ్జలుద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) పై వారందరూ
సమాధానం : 4
5. తెలుగులో ‘జపాన్ చరిత్ర’ను రాసి మునగాల రాజుకు అంకితం ఇచ్చిన వారెవరు?
1) శ్రీరామ వీరబ్రహ్మం
2) ఆదిపూడి సోమనాథరావు
3) అయ్యదేవర కాళేశ్వరరావు
4) రామశాస్త్రి నాయుడు
సమాధానం :2
6. కాకతీయుల కాలంలో ప్రధానంగా వేటిని ఎగుమతి చేసేవారు?
1) సుగంధ ద్రవ్యాలు
2) వస్త్రాలు
3) అలంకార వస్తువులు
4) గుర్రాలు
సమాధానం : 2
7. ‘బగేలా’ అనే వెట్టిచాకిరి పద్ధతి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది?
1) తెలంగాణ
2) కోస్తాంధ్ర
3) రాయలసీమ
4) పైవన్నీ
సమాధానం : 1
8. 1988లో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ‘భూగోళమంత మనిషి’, ‘దృక్పథం’, ‘కలం సాక్షిగా’, ‘కర్పూర వసంతరాయలు’ తదితర రచనలు చేసిన ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త ఎవరు?
1) కాళోజీ నారాయణరావు
2) విశ్వనాథ సత్యనారాయణ
3) బోయి భీమన్న
4) సి.నారాయణరెడ్డి
సమాధానం : 4
9. నిజాం సంస్థానంలోని పాఠశాలల్లో బోధన ఏ భాషలో ఉండేది?
1) తెలుగు
2) హిందీ
3) ఉర్దూ
4) ఇంగ్లిష్
సమాధానం : 3
10. గోల్కొండ కుతుబ్‌షాహీ వంశానికి చెందిన రాజుల్లో చివరివారెవరు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) అబుల్‌హసన్ తానీషా
4) మహమ్మద్ కులీకుతుబ్‌షా
సమాధానం : 3
11. ఆంధ్రదేశంలో ఎవరి కాలంలో బంగారు నాణేలను ‘మాడ’ అని పిలిచేవారు?
1) శాతవాహనులు
2) కాకతీయులు
3) విజయనగర పాలకులు
4) చాళుక్యులు
సమాధానం : 2
12. శాసనాల్లోని తొలి తెలుగు పదం ‘నాగబు’ ఎవరి కాలం నాటిది?
1) శాతవాహనులు
2) హూణులు
3) కాకతీయులు
4) ఇక్ష్వాకులు
సమాధానం : 1
13. ‘సల్లేఖనం’ ఏ మతానికి సంబంధించింది?
1) బౌద్ధమతం
2) శైవం
3) సిక్కు
4) జైనమతం
సమాధానం : 4
14. కిందివాటిలో 1972 నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రధాని ప్రకటించిన పంచసూత్రాల్లోని అంశం ఏది?
1) జంటనగరాల్లో ఇరు ప్రాంతాల వారిని తీసుకొని పోలీసు దళాన్ని ఏర్పాటు చేయాలి
2) జంటనగరాల్లో ఆంధ్ర ప్రాంత అభ్యర్థులకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి
3) ముల్కీ నిబంధనలు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, అసిస్టెంట్ ఇంజనీర్లకు తెలంగాణ ప్రాంతమంతా వర్తిస్తాయి
4) పైవన్నీ
సమాధానం : 4
15. మట్టిపాడు శాసనాన్ని ఎవరు వేయించారు?
1) కందరుడు
2) అత్తివర్మ
3) దామోదరవర్మ
4) సోమశేఖరవర్మ
సమాధానం : 3
16. ‘చిన్‌కిలిచ్ ఖాన్’ అనే పేరున్న అసఫ్ జాహీ పాలకుడు ఎవరు?
1) నాజర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) నిజాం-ఉల్-ముల్క్
4) ఉస్మాన్ అలీఖాన్
సమాధానం : 3
17. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం మొగలు సుబేదారైన నిజాం ఉల్ ముల్క్ దక్కన్‌లో ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు?
1) 1724
2) 1794
3) 1734
4) 1726
సమాధానం : 1
18. 1930లో నిర్వహించిన తొలి ఆంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన జోగిపేట ఏ జిల్లాలో ఉంది?
1) రంగారెడ్డి
2) నల్గొండ
3) మెదక్
4) వరంగల్
సమాధానం :3
19. ‘ఏక బ్రాహ్మణ’ బిరుదు ఉన్న శాతవాహన చక్రవర్తి ఎవరు?
1) మొదటి శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) శ్రీముఖుడు
4) రెండో శాతకర్ణి
సమాధానం : 2
20. ‘ఆపరేషన్ పోలో’ ఎప్పుడు జరిగింది?
1) 1948 సెప్టెంబర్ 13
2) 1947 ఆగస్టు 15
3) 1949 ఆగస్టు 15
4) 1950 జనవరి 26
సమాధానం : 1
21. ‘నీతిశాస్త్ర ముక్తావళి’ రచన ఏ భాషలో వెలువడింది?
1) సంస్కృతం
2) ప్రాకృతం
3) తెలుగు
4) తమిళం
సమాధానం : 3
22. కిందివాటిలో దేన్ని ‘జూన్ ప్రణాళిక’గా పేర్కొంటారు?
1) క్రిప్స్ ప్రతిపాదనలు
2) అట్లీ ప్రకటన
3) మౌంట్ బాటన్ ప్రణాళిక
4) కేబినెట్ మిషన్ ప్లాన్
సమాధానం : 3
23. నిజాం సంస్థానంలో ‘బలూతాదార్’ అంటే ఎవరు?
1) జమీందారీ వర్గం
2) వర్తకులు
3) ప్రభుత్వ అధికారులు
4) వెట్టిచాకిరి వర్గం
సమాధానం : 4
24. కింద పేర్కొన్న ఏ రాజవంశానికి వరాహం రాజ లాంఛనంగా ఉండేది?
1) శాతవాహనులు
2) చాళుక్యులు
3) శాలంకాయనులు
4) పల్లవులు
సమాధానం : 3
25. 1950లో హైదరాబాద్ రాష్ట్రానికి సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) బూర్గుల రామకృష్ణ
2) యం.కె. వెల్లోడి
3) జె.ఎన్. చౌదరి
4) టంగుటూరి ప్రకాశం పంతులు
సమాధానం :
26. మొదటిసారిగా ‘స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1948
2) 1949
3) 1953
4) 1956
సమాధానం : 3
27. శాతవాహన కాలంనాటి 13 అడుగుల శివలింగం ఎక్కడ ఉంది?
1) వీరాపురం (కర్నూలు)
2) గుడిమల్లం (చిత్తూరు)
3) జగ్గయ్యపేట (కృష్ణా)
4) హనమకొండ (వరంగల్)
సమాధానం : 2
28. అజంతా గుహల్లో శాతవాహన యుగానికి చెందినవి ఏవి?
1) 6, 7వ గుహలు
2) 8, 9వ గుహలు
3) 9, 10వ గుహలు
4) 11, 12వ గుహలు
సమాధానం : 3
29. భారతదేశ గ్రంథాలయోద్యమ చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందిన సంస్థానం ఏది?
1) గ్వాలియర్
2) జమ్ము-కశ్మీర్
3) బరోడా
4) జునాఘడ్
సమాధానం : 3
30. నక్సల్‌బరీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1965
2) 1967
3) 1969
4) 1970
సమాధానం : 2
31. కుతుబ్‌షాహీలు భూమి శిస్తు వసూలు చేసిన పద్ధతి ఏది?
1) రైత్వారీ
2) మహల్వారీ
3) వేలం
4) మున్సబ్‌దారీ విధానం
సమాధానం : 3
32. శ్రీ లక్ష్మీనృసింహ విలాస గ్రంథాలయం ఎక్కడ ఉంది?
1) అశ్వారావుపేట
2) ఇబ్రహీంపట్నం
3) కొడిమ్యాల
4) పజ్జూరు
సమాధానం : 2
33. హైదరాబాద్‌లో నెలకొల్పిన మొదటి విద్యాసంస్థ ఏది?
1) మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల
2) వివేకవర్ధిని పాఠశాల
3) నిజాం పాఠశాల
4) సుందరయ్య పాఠశాల
సమాధానం : 2
34. ఘటికల గురించి ప్రస్తావించిన తొలి శాసనం ఏది?
1) హిరె సముద్ర
2) అమరావతి
3) ఇంద్ర భట్టారకవర్మ
4) పల్లవుల శాసనాలు
సమాధానం : 4
35. నిజాం పాలనా కాలంలో శాసనసభ్యులను ఎవరు నియమించేవారు?
1) బ్రిటిష్ ప్రభుత్వం
2) భారత యూనియన్
3) నిజాం నవాబు
4) ప్రజలు
సమాధానం : 3
36. శాతవాహనుల కాలంలో ‘ఆహారాలు’గా వేటిని పేర్కొనేవారు?
1) సామంత రాజ్యాలు
2) రాష్ట్రాలు
3) గ్రామాలు
4) పట్టణాలు
సమాధానం : 2
37. మొట్టమొదటి తెలుగు శాసనం ఏది?
1) పల్నాడు శాసనం
2) విప్పర్ల శాసనం
3) వేంగి శాసనం
4) అమరావతి శాసనం
సమాధానం : 2
38. ఇక్ష్వాకుల కాలంలో ప్రజలు ఏ దేశంతో వ్యాపారం నిర్వహించారు?
1) ఈజిప్టు
2) రోమన్
3) సింహళం
4) అరబ్బు
సమాధానం : 2
39. ‘క్షత్రీయ దర్పమాణ’గా గుర్తింపు పొందిన పాలకుడు ఎవరు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) శ్రీముఖుడు
4) పులోమావి
సమాధానం : 2
40. శ్రీముఖునికి చెందిన ఏడు నాణేలు ఎక్కడ లభించాయి?
1) నాగార్జునకొండ
2) ధూళికట్ట
3) కోటిలింగాల
4) రామతీర్థం
సమాధానం : 3
41. భారతదేశ ‘ఐన్‌స్టీన్’గా ఎవరిని పేర్కొంటారు?
1) హాలుడు
2) ఆర్యభట్ట
3) సోమదేవుడు
4) నాగార్జునుడు
సమాధానం : 4
42. దేశంలో మొదటి ద్వీపపు మ్యూజియం ఎక్కడ ఉంది?
1) అమరావతి
2) నాగార్జునకొండ
3) నలంద
4) భట్టిప్రోలు
సమాధానం : 2
43. దేవరకొండలో నిర్వహించిన రెండో ఆంధ్ర మహాసభల్లో మహిళా సభ అధ్యక్షురాలిగా నియమితులైనవారెవరు?
1) బి. వరలక్ష్మమ్మ
2) సీతాకుమారి
3) ఎన్. సుందరమ్మ
4) మాణిక్యమ్మ
సమాధానం : 1
44. కింది వాటిలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన హరప్పా నగరం?
1) మొహంజోదారో
2) లోథాల్
3) చన్హుదారో
4) బనవాలి
సమాధానం: 4
45. కింది వాటిలో హరప్పా ప్రజలు పూజించిన పక్షి?
1) పావురం
2) నెమలి
3) కాకి
4) గద్ద
సమాధానం: 1
46. హరప్పా ప్రజలు కింది వారిలో ఎవరితో అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉన్నారు?
1) ఇరాన్
2) ఈజిప్టు
3) బహ్రెయిన్
4) మెసపటోమియా
సమాధానం: 4
47. సరైన దాన్ని గుర్తించండి?
అ) కాలిబంగన్
1. కుండలు
ఆ) లోథాల్
2. టైట బొమ్మలు
ఇ) చన్హుదారో
3. పశుపతి ముద్రిక
ఈ) మొహంజోదారో
4. ఇటుకతో నిర్మించిన ప్రాంగణం
1 అ-1 ఆ-3 ఇ-4 ఈ-2
2) అ-4 ఆ-1 ఇ-2 ఈ-3
3) అ-3 ఆ-2 ఇ-4 ఈ-1
4) అ-2 ఆ-4 ఇ-1 ఈ-3
సమాధానం: 2
48.సింధూ లిపికి చిహ్నంగా సిరా పాత్ర లభించిన నగరం?
1) చన్హుదారో
2) అమ్రి
3) లోథాల్
4) హరప్పా
సమాధానం: 1
49. గుర్రం ఆధారాలు లభించిన ప్రాంతం?
1) హరప్పా, లోథాల్
2) లోథాల్, రంగపూర్
3) సుర్కొటోడా, బనవాలి
4) సుర్కొటోడా, లోథాల్
సమాధానం: 4
50. సతి ఆచారాన్ని సూచించే సమాధి బయటపడిన సింధూనగరం?
1) కాలిబంగన్
2) హరప్పా
3) లోథాల్
4) కోట్‌డిజి
సమాధానం: 3
51. కింది వాటిలో సింధన్ అంటే?
1) వరి
2) గోధుమ
3) బార్లీ
4) పత్తి
సమాధానం: 4
52. కింది వాటిలో సరికాని జత?
సింధూ నగరాలు ప్రస్తుత రాష్ట్రాలు
1) మొహంజోదారో సింధూ రాష్ర్టం
2) రోపార్ పంజాబ్
3) మాండ జమ్మూకశ్మీర్
4) దైమాబాద్ గుజరాత్
సమాధానం: 4
53. హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్న ప్రాంతం?
1) కాలిబంగన్, రోపార్
2) లోథాల్, రంగపూర్
3) చన్హుదారో, ఖేత్రి
4) మొహంజోదారో, హరప్పా
సమాధానం: 1
54. నాగలిబొమ్మ బయటపడిన సింధూ నగరం?
1) కాలిబంగన్
2) బనవాలి
3) లోథాల్
4) రంగపూర్
సమాధానం: 2
55. సింధూ నాగరికత అవశేషాలను మొదటగా గుర్తించినవారు?
1) చార్లెస్ మాసన్
2) డి.ఆర్. సాహ్ని
3) ఎం.ఎం.వీలర్
4) ఎం.ఎస్.వాట్స్
సమాధానం: 1
56. కింది వాటిలో సింధూ ప్రజల దిగుమతులు, వాటి ప్రాంతాల్లో సరికానిది?
దిగుమతులు - ప్రాంతాలు
1) జేడ్ - మధ్య ఆసియా
2) స్టీ టైట్ - ఇరాన్
3) లేపిస్ లెజులి - బదక్షాన్
4) రాగి - మోసపటోమియా
సమాధానం: 4
57. అత్యధిక జనాభా కలిగిన సింధూ నగరం?
1) హరప్పా
2) మొహంజోదారో
3) కాలిబంగన్
4) లోథాల్
సమాధానం: 2
58. ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించిన వారు?
1) ఈజిప్టు ప్రజలు
2) చైనీయులు
3) సింధూ ప్రజలు
4) మోసపటోమియన్లు
సమాధానం: 3
59.రుగ్వేదంలోని గాయత్రీమంత్రం ఏ దేవతకు సంబంధించింది?
1) అదితి
2) ఉషస్సు
3) సావిత్రి
4) అరణ్యాని
సమాధానం: 3
60. కింది నాలుగు వేదాలు - వాటి పురోహితులతో సరికాని జత?
1) రుగ్వేదం- హోత్రి
2) సామవేదం - ఉద్గాత్రి
3) యజుర్వేదం - అధ్వర్యు
4) అధర్వణ వేదం - శ్రామణుడు
సమాధానం: 4
61. కుటుంబ గ్రంథాలు అని ఏ వేదాన్ని పిలుస్తారు?
1) రుగ్వేదం
2) సామవేదం
3) యజుర్వేదం
4) అధర్వణ వేదం
సమాధానం: 1
62. ప్రసిద్ధమైన ‘‘తమసోమా జ్యోతిర్గమయ’’ అనే శ్లోకం ఏ గ్రంథంలో ఉంది?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) బృహదారణ్యక ఉపనిషత్
3) యజుర్వేద సంహిత
4) భాగవత పురాణం
సమాధానం: 2
63. ఏ వేదాన్ని కృష్ణ, శుక్ల అనే రెండు భాగాలుగా విభజించారు?
1) అధర్వణ వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) రుగ్వేదం
సమాధానం: 2
64. అష్టాదశ పురాణాల్లో అతి ప్రాచీనమైంది?
1) విష్ణు పురాణం
2) భాగవత పురాణం
3) వాయుపురాణం
4) గరుడ పురాణం
సమాధానం: 3
65. కిందివాటిలో రేఖాగణిత శాస్త్రం మూలాలు కలిగి ఉంది?
1) సుళ్వ సూత్రాలు
2) శ్రౌత సూత్రాలు
3) గృహ సూత్రాలు
4) ధర్మ సూత్రాలు
సమాధానం: 1
66. రుగ్వేదంలో ప్రస్తావించని పర్వతశ్రేణి?
1) వింధ్య, సాత్పురా
2) సాత్పురా, ఆరావళి పర్వతాలు
3) ఆరావళి, హిమాలయాలు
4) హిమాలయాలు, ముజావంత్ పర్వతాలు
సమాధానం: 4
67. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి?
లిస్ట్-ఎ లిస్ట్-బి
అ) వేదాంగాలు 1. 4
ఆ) ఉపనిషత్తులు 2. 108
ఇ) పురాణాలు 3. 6
ఈ) ఉపవేదాలు 4. 18
1) అ-3 ఆ-2 ఇ-4 ఈ-1
2) అ-3 ఆ-4 ఇ-1 ఈ-2
3) అ-4 ఆ-3 ఇ-2 ఈ-1
4) అ-1 ఆ-2 ఇ-3 ఈ-4
సమాధానం: 1
68. ప్రపంచంలోనే అతి ప్రాచీన గ్రంథం?
1) రుగ్వేదం
2) సామవేదం
3) యజుర్వేదం
4)అధర్వణ వేదం
సమాధానం: 1
69. కిందివాటిలో సరికాని జత?
వేదాలు-అనుబంధంగా ఉన్న ఉపనిషత్తులు
1) రుగ్వేదం- ఐతరేయ, కౌసితాకి
2) సామవేదం- చాంద్యొగ్య, కేనోపనిషత్
3) యజుర్వేదం- కథ, బృహదారణ్యక
4) అధర్వణవేదం- తైత్తిరీయ, శ్వేతాశ్వ తార, ఇసా
సమాధానం: 4
70. కిందివాటిలో చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించిన మొదటి సంకేతం దేనిలో కనిపిస్తుంది?
1) పురుష సూక్తం
2) రుగ్వేదం
3) శతపథ బ్రాహ్మణం
4) మనుస్మృతి
సమాధానం: 1
71.పురాణాల్లోని ప్రసంగాలు దేనికి సంబంధించినవి?
1) గాథలు
2) మత నియమాలు
3) నైతిక న్యాయ నిబంధనలు
4) పైవన్నీ
సమాధానం: 4
72. కిందివాటిలో ఇండో-ఆర్యన్ భాషా సమూహానికి సంబంధించనిది?
1) అవెస్తా
2) ఇంగ్లిష్
3) అరబ్బీ
4) పర్షియన్
సమాధానం: 3
73. కిందివాటిలో మలివేద సాహిత్యంగా దేన్ని పరిగణిస్తారు?
1) అధర్వణ వేదం
2) బ్రాహ్మణాలు, అరణ్యకాలు
3) ఉపనిషత్తులు
4) పైవన్నీ
సమాధానం: 4
74. మాక్స్‌ముల్లర్ ప్రకారం రుగ్వేద సంకలన కాలం?
1) క్రీ.పూ. 2000- 1500
2) క్రీ.పూ. 1500- 1000
3) క్రీ.పూ. 2000- 1200
4) క్రీ.పూ. 1200- 1000
సమాధానం: 2
75. పూర్తిగా గద్యశైలిలో రచించిన వేదం?
1) రుగ్వేదం
2) సామవేదం
3) యజుర్వేదం
4) అధర్వణ వేదం
సమాధానం: 4
76. విజ్ఞానేశ్వరుని ‘మితాక్షర’కు మూలంగా ఉన్న స్మృతి?
1) మనుస్మృతి
2) యాజ్ఞవల్క్య స్మృతి
3) పరాశర స్మృతి
4) నారద స్మృతి
సమాధానం: 2
77.ఆర్యేతరుల కృతిగా భావించే వేదం?
1) రుగ్వేదం
2) సామవేదం
3) యజుర్వేదం
4) అధర్వణ వేదం
సమాధానం: 4
78. రుగ్వేదంలో వ్యవసాయదారుడిని ఏ పేరుతో సూచించారు?
1) కినాస
2) శూద్ర
3) క్షేత్రక
4) కర్షక
సమాధానం: 1
79. కిందివాటిలో సరికాని జత?
1) గొఘన - అతిధి
2) దౌహిత్రి- కూతురు
3) గొప - పశుకాపరి
4) గవిష్టి- యుద్ధం
సమాధానం: 3
80. పురోహితుల దైవంగా ఎవరిని పరిగణించారు?
1) ఇంద్రుడు
2) అగ్ని
3) వరుణుడు
4) సూర్యుడు
సమాధానం: 2
81. పురోహితుల దైవంగా ఎవరిని పరిగణించారు?
1) ఇంద్రుడు
2) అగ్ని
3) వరుణుడు
4) సూర్యుడు
సమాధానం: సి
82. కిందివారిలో వైదిక యుగంలోని ఏ సభలను ప్రజాపతి (బ్రహ్మ) పుత్రికలుగా భావిస్తారు?
1) సభ, సమితి
2) సమితి, విధాత
3) విధాత, గణ
4) గణ, పరిషత్
సమాధానం: 1
83. వేదకాలంలో ఏ వృత్తివారికి ఉపనయనం ధరించే అర్హత కల్పించారు?
1) స్వర్ణకారులు
2) రథకారులు
3) చర్మకారులు
4) లోహకారులు
సమాధానం: 2
84. కిందివాటిలో సరైన జతను గుర్తించండి?
1) కులాల-కుండలు తయారు చేసేవారు
2) నిషాద - చేపలు పట్టేవారు
3) కైవర్త -బుట్టలు అల్లేవారు
4) వేణ - వేటాడేవారు
సమాధానం: 1
85. మహావీరుడు ఏ భాషలో తన బోధనలను కొనసాగించాడు?
1) అర్థమాగధి
2) పాళి
3) బ్రాహ్మి
4) మార్వారీ
సమాధానం: 1
86. అజీవిక మత స్థాపకుడు?
1) పురాణ కశ్యప
2) పకుద కాత్యాయన
3) గోసల మస్కరిపుత్ర
4) అజిత కేశ కంబలి
సమాధానం: 3
87. కింది వారిలో అశోక వృక్షాన్ని పూజించిన మతశాఖ?
1) శక్త
2) పాశుపత
3) దిగంబర
4) అజీవిక
సమాధానం: 4
88.జైన మత వాస్తవ స్థాపకుడు?
1) రుషభనాథ
2) పార్శ్వనాథ
3) నేమినాథ
4) వర్థమాన మహావీర
సమాధానం: 2
89. మహావీరుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం?
1) కుంద గ్రామం
2) వైశాలి
3) గయ
4) జృంభిక గ్రామం
సమాధానం: 4
90. మహావీరుడి మొదటి శిష్యుడు?
1) జామాలి
2) ఆనందుడు
3) గోసల మస్కరిపుత్ర
4) భద్రబాహు
సమాధానం: 1
91. మహావీరుడు మరణించిన ప్రదేశం?
1) కుశినగర
2) వైశాలి
3) రాజగృహ
4) పావా
సమాధానం: 4
92. మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది?
1) పాటలీపుత్రం
2) వల్లభి
3) జృంభిక గ్రామం
4) వైశాలి
సమాధానం: 1
93. జైన పండితుడు హేమచంద్రుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
1) అమోఘవర్షుడు
2) కుమార పాలుడు
3) జయసింహ సిద్ధరాజు
4) ఖారవేలుడు
సమాధానం: 3
94. దక్షిణాదిలో జైనమతాన్ని ప్రచారం చేసినవారు?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) భద్రబాహు
3) స్థూలబాహు
4) సుదర్శన్
సమాధానం: 2
95. జైనమతాన్ని లిచ్చవీల రాజమతంగా చేసినవారు?
1) చేతక
2) కుమారదేవ
3) అభయ
4) ఉదయనుడు
సమాధానం: 3
96. జైనమతంలో పోసద లేదా ఉపోసత అంటే?
1) కొత్తవారిని జైన మతంలోకి సభ్యు లుగా తీసుకునే కార్యక్రమం
2) జైన ఉపాసకులు పున్నమి రోజు ఉప వాసం ఉండడం
3) జైనులు తమ తప్పులను అంగీకరించే కార్యక్రమం
4) నియమ ఉల్లంఘనకు విధించే శిక్ష
సమాధానం: 2
97. బసదులు ఏ మతానికి సంబంధించినవి?
1) బౌద్ధం
2) జైనం
3) హిందూ
4) అజీవిక
సమాధానం: 2
98. జైన కల్ప సూత్ర గ్రంథకర్త?
1) కల్కాచార్య
2) గార్థబిల్ల
3) భద్రబాహు
4) స్థూల భద్ర
సమాధానం: 3
99. కింది వాటిలో సరికాని జత?
1) రుషభనాథుడు - వృషభం
2) అరిష్టనేమి- గవ్వ
3) పార్శ్వనాథ- పాము
4) వర్థమాన మహావీరుడు - ఏనుగు
సమాధానం: 4
100. భారతదేశంలో వాడుకలోకి వచ్చిన మొదటి లిపి?
1) బ్రాహ్మి
2) దేవనాగరి
3) ఖరోష్టి
4) అరామిక్
సమాధానం: 1
101. బౌద్ధమతంలో తొలి చీలిక ఏ సమా వేశంలో సంభవించింది?
1) మొదటి
2) రెండవ
3) మూడవ
4) నాలుగవ
సమాధానం: 2
102. శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టిన వారు?
1) మహేంద్ర, సంఘమిత్ర
2) చారుమతి, మహాదేవ
3) అతిష దీపాంకర, పద్మసంభవ
4) సంతరక్షిత, కమలశీల
సమాధానం: 1
103. బౌద్ధ తర్క సిద్ధాంత స్థాపకుడు?
1) అసంగుడు
2) వసుబంధుడు
3) దిగ్నాగుడు
4) బుద్ధఘోషుడు
సమాధానం: 3
104. భారతదేశంలో తొలిసారిగా విగ్రహారా ధనను ప్రారంభించినవారు?
1) హీనయానులు
2) మహాయానులు
3) వజ్రయానులు
4) హిందువులు
సమాధానం: 2
105. బార్హుత్ శిల్పాల్లో కిందివారిలో ఏ రాజు బుద్ధుడితో సమావేశమైన దృశ్యం కనిపిస్తుంది?
1) అజాతశత్రు
2) బింబిసార
3) బిందుసార
4) అశోకుడు
సమాధానం: 1
106. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మి లిపిని తొలిసారిగా కనుగొన్నది?
1) కన్నింగ్ హామ్
2) మాక్స్‌ముల్లర్
3) జేమ్స్ ప్రిన్సెప్
4) మార్టిమమ్ వీలర్
సమాధానం: 3
107. కింది వాటిలో మౌర్యుల గురించి సమాచారమివ్వని గ్రంథం?
1) మహావంశం
2) దీపవంశం
3) దివ్యవదన
4) అశోక వదన
సమాధానం: 4
108. భారత చరిత్రలో తొలిసారిగా సింహాసనాన్ని త్యజించిన రాజు?
1) చంద్రగుప్తమౌర్య
2) బిందుసార
3) అశోకుడు
4) దశరథ
సమాధానం: 1
109. చంద్రగుప్త మౌర్యుడు, అలెగ్జాండర్‌ను ప్రత్యక్షంగా కలిసినట్లు తెలిపింది?
1) ప్లూటార్క్
2) జస్టిన్
3) మెగస్తనీస్
4) అరియన్
సమాధానం: 2
110. గ్రీకు గ్రంథాల్లో అమిత్రోఖేటస్‌గా పేర్కొన్న మౌర్యరాజు?
1) చంద్రగుప్తుడు
2) బిందుసారుడు
3) అశోకుడు
4) సంప్రతి
సమాధానం: 2
111. చంద్రగుప్తుడికి నందులతో జరిగిన యుద్ధంలో నంద సేనాని?
1) బద్దసాల
2) దీర్ఘబారాయణ
3) సుసమ
4) ధననంద
సమాధానం: 1
112. బిందుసారుడు ఆదరించిన మతశాఖ?
1) బౌద్ధం
2) జైనం
3) అజీవిక
4) లోకాయత
సమాధానం: 3
113. అశోకుడి ఎన్నో పాలనా సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగింది?
1) 1వ
2) 2వ
3) 8వ
4) 13వ
సమాధానం: 3
114. అశోకుడి శాసనాల్లో ఉపయోగించని లిపి?
1) ఆరామిక్
2) ఖరోష్టి
3) బ్రాహ్మి
4) సంస్కృతం
సమాధానం: 4
115. అశోకుడు శ్రీనగర్ పట్టణ నిర్మాత అని తెలిపే గ్రంథం?
1) రాజతరంగిణి
2) పరిశిష్ట పర్వన్
3) అశోకవదన
4) దివ్యవదన
సమాధానం: 1
116. అశోకుడి శాసనాలు.. ఎవరి శాసనాలను పోలి ఉన్నాయి?
1) ఆంటియోకస్-2
2) టాలమీ-2
3) మాగాస్
4) డేరియస్
సమాధానం: 4
117. మౌర్యుల కాలంలో శిస్తు వసూలుకు అధిపతి?
1) సమాహర్త
2) సన్నిధాత
3) రూపదర్శక
4) కరణిక
సమాధానం: 1
118. ఏ సమయంలోనైనా తనను కలిసేందుకు ఏ అధికారులకు అశోకుడు అనుమతినిచ్చాడు?
1) రజ్జుకలు
2) యుక్తలు
3) పతివేదకులు
4) ధమ్మ మహామాత్రులు
సమాధానం: 3
119. సుదర్శన తటాకాన్ని నిర్మించినవారు?
1) చంద్రగుప్త మౌర్య
2) అశోకుడు
3) రుద్రదమన
4) ఆర్యాతుషస్ప
సమాధానం: 1
120. మౌర్యుల కాలంలో విష్టి అంటే..?
1) ఒక రాష్ర్టం
2) ఒక జిల్లా
3) బలవంతపు శ్రమ
4) ఒక నాణెం
సమాధానం: 3
121. పన్నుల వ్యవస్థను ప్రస్తావించిన అశోకుని శాసనం?
1) రుమ్మిందై శాసనం
2) నిగాలిసాగర్ శాసనం
3) కాందహార్ శాసనం
4) బారాబర్ శాసనం
సమాధానం: 1
122. మౌర్యుల కాలంలో గొప్ప విద్యాకేంద్రం?
1) తక్షశిల
2) ఉజ్జయినీ
3) నలంద
4) వల్లభి
సమాధానం: 1
123. రాణి శాసనంలో పేర్కొన్న అశోకుడి రాణి ఎవరు?
1) విదీష మహాదేవి
2) అసంధిమిత్ర
3) కారువాకి
4) తిస్యరక్షిత
సమాధానం: 3
124. మౌర్యుల ఆస్థానానికి రాయబారిగా రానివారు?
1) మెగస్తనీస్
2) డైమాకస్
3) డైనోసియస్
4) పాట్రోకిల్స్
సమాధానం: 4
125. మెగస్తనీస్ ప్రకారం.. మౌర్యుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు?
1) రెండు
2) నాలుగు
3) ఆరు
4) ఏడు
సమాధానం: 4
126. ‘ఒకే చక్రంతో బండి ఏ విధంగా నడవలేదో పరిపాలన కూడా ఒకే వ్యక్తి ద్వారా నడవలేదు’ అని వ్యాఖ్యానించినవారు?
1) మెగస్తనీస్
2) కౌటిల్యుడు
3) చంద్రగుప్తుడు
4) వి.ఎ. స్మిత్
సమాధానం: 2
127. అశోకుడు ధమ్మ ప్రచారానికి చేపట్టిన చర్యల్లో లేనిది?
1) ధమ్మ గురించి తెలుపుతూ శిలా శాసనాలు, స్తంభ శాసనాల జారీ
2) ధమ్మ మహామాత్రల నియామకం
3) స్వీయ ధమ్మ యాత్రలు చేయడం
4) ధమ్మ ఉల్లంఘనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం
సమాధానం: 4
128. అశోకుడు ఏటా తన పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా మానవతా దృక్పథంతో కొంత మంది ఖైదీలను విడుదలచేసేవారని తెలిపే శాసనం?
1) 5వ స్తంభ శాసనం
2) మొదటి శిలాశాసనం
3) 13వ శిలాశాసనం
4) 4వ స్తంభ శాసనం
సమాధానం: 1
129. భారతదేశంలో తొలిసారిగా నౌకాదళాన్ని ఏర్పాటు చేసిన పాలకులు?
1) నందరాజులు
2) మౌర్యులు
3) కుషాణులు
4) గుప్తులు
సమాధానం: 2
130. మౌర్యుల కాలంలో ఎంత శాతం భూమిశిస్తు (భాగ)గా వసూలు చేశారు?
1) 1/8
2) 1/6 - 1/4
3) 1/3
4) 1/2
సమాధానం: 2
131. మౌర్యులు గయ వద్ద నిర్మించిన గుహల్లో అతి పెద్దది?
1) కర్ణచౌపార గుహ
2) సుధాముని గుహ
3) లోమస రుషి గుహ
4) గోపికా గుహ
సమాధానం: 4
132. సముద్రగుప్తుడి అలహాబాద్ ప్రశస్తిపై ఏయే రాజుల శాసనాలు ఉన్నాయి?
1) అశోకుడు, జహంగీర్
2) అశోకుడు, కనిష్కుడు
3) జహంగీర్, ఫిరోజ్ షా తుగ్లక్
4) అశోకుడు, అక్బర్
సమాధానం: 1
133. అశోకుడిలానే ‘దేవానాం ప్రియ’ అనే బిరుదు ధరించిన మౌర్యచక్రవర్తి ఎవరు?
1) సంప్రతి
2) బిందుసారుడు
3) దశరథుడు
4) బృహద్రధుడు
సమాధానం: 3
134. అశోకుడి సామ్రాజ్యంలో లేని ప్రాంతం?
1) కేరళ
2) తమిళనాడు
3) కాశ్మీర్
4) 1, 2
సమాధానం: 4
135. అశోకుడు తన పొరుగు రాజులుగా కింది వారిలో ఎవరిని పేర్కొన్నాడు?
1) చోళులు, పాండ్యులు
2) సత్య పుత్రులు
3) కేరళ పుత్రులు
4) పైవారందరూ
సమాధానం: 4
136. కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాల్లో లేనిది?
1) స్వామి
2) కోశ
3) ప్రదేశ
4) దండ
సమాధానం: 4
137. గ్రీకు రాజ్యాల్లో అశోకుడి సమకాలీనులు కానివారు?
1) ఆంటియోకస్
2) మాగాస్
3) జేక్జెస్
4) టాలమీ ఫిలడెల్ఫస్
సమాధానం: 3
138. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి రాసిన అశోకుడి శిలా శాసనం ఏది?
1) ఎర్రగుడి సూక్ష్మ శిలాశాసనం
2) లంపక శిలాశాసనం
3) షాబాజ్‌గరి శిలాశాసనం
4) మాన్‌షేరా శిలాశాసనం
సమాధానం: 1
139. మౌర్య ప్రభుత్వ గుత్తాధిపత్యం లేని అంశం?
1) అడవులు
2) గనులు
3) రేవులు
4) జూద గృహాలు
సమాధానం: 4
140. మౌర్యుల పాలనా భాష?
1) సంస్కృతం
2) ప్రాకృతం
3) ఖరోష్టి
4) అర్ధమాగధి
సమాధానం: 2
141. కిందివాటిలో మౌర్యుల రాగి నాణెం ఏది?
1) పణం
2) సువర్ణం
3) నిష్క
4) మషాక
సమాధానం: 4
142. జాతీయ పాలకుడిగా పేరొందిన తొలి భారతీయ రాజు?
1) చంద్రగుప్త మౌర్య
2) అశోకుడు
3) సముద్రగుప్తుడు
4) అక్బర్
సమాధానం: 1
143. అలెగ్జాండర్ తర్వాత భారతదేశ లోపలి ప్రాంతాలపై దండయాత్ర చేసిన గ్రీకు రాజు?
1) యూథిడియస్
2) యూకటైడస్
3) డెమిట్రియస్
4) మినాండర్
సమాధానం: 3
144. మహేశ్వర అనే బిరుదును ధరించిన విదేశీ రాజు?
1) కుజుల కాడ్‌ఫెసైస్
2) ఆంటియాల్ సిడాస్
3) విమా కాడ్‌ఫెసైస్
4) హెలియో డోరస్
సమాధానం: 3
145. వీమా కాడ్‌ఫెసైస్ ఆదరించిన శైవమత శాఖ?
1) పాశుపతం
2) కాపాలికం
3) కాలాముఖం
4) అఘోర శైవం
సమాధానం: 1
146. పాంచావొ అనే చైనా సేనాని చేతిలో ఓడిన కుషాణ చక్రవర్తి?
1) కుజుల కాడ్‌ఫెసైస్
2) కనిష్కుడు
3) వీమా కాడ్‌ఫెసైస్
4) హువిష్కుడు
సమాధానం: 2
147. కనిష్కుడు ఎవరి సలహాపై కుందల వనంలో నాలుగో బౌద్ధ సంగీతి నిర్వహించాడు?
1) వసుమిత్రుడు
2) అశ్వఘోషుడు
3) శీలభద్రుడు
4) పార్శ్వ
సమాధానం:4
148. శివుడు, నంది గుర్తు కలిగిన నాణేలను జారీ చేసిన కుషాణ చక్రవర్తి?
1) హువిష్కుడు
2) వాసుదేవుడు
3) రెండో కనిష్కుడు
4) వశిష్కుడు
సమాధానం: 4
149. ఎవరి పాలనా కాలంలో కశ్యపమాతంగ చైనాలో బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు?
1) మౌర్యులు
2) శుంగులు
3) శకులు
4) కుషాణులు
సమాధానం: 4
150.హుయాన్‌త్సాంగ్ ప్రకారం హర్షుడు చాతుర్వర్ణాల్లోని ఏ వర్ణానికి చెందినవాడు?
1) బ్రాహ్మణ
2) క్షత్రియ
3) వైశ్య
4) శూద్ర
సమాధానం: 3
151.స్థానేశ్వర్ నుంచి కనౌజ్‌కు రాజధానిని మార్చిన ఉత్తర భారతదేశ రాజు?
1) నరవర్ధన
2) ఆదిత్యవర్ధన
3) ప్రభాకరవర్ధన
4) హర్షవర్ధన
సమాధానం: 4
152.హర్షుడి చేతిలో ఓడిన వల్లభి పాలకుడు?
1) రెండో ధ్రువసేనుడు
2) రెండో ప్రవరసేనుడు
3) మూడో ధ్రువసేనుడు
4) మూడో ప్రవరసేనుడు
సమాధానం: 1
153.హర్షుడి దిగ్విజయ యాత్రలకు నాయకత్వం వహించిన సేనాపతి ఎవరు?
1) దండి
2) భండి
3) వ్యాఘ్రకేతు
4) నిఘ్రాత
సమాధానం: 2
154.సకలోత్తరపథేశ్వర అనే బిరుదు ఉన్న రాజు ఎవరు?
1) గ్రహవర్మ
2) శశాంక
3) హర్ష
4) భాస్కరవర్మ
సమాధానం: 3
155.భారతదేశ చరిత్రలో తొలిసారిగా అధికా రులకు భూదానాలు చేసిన రాజవంశం?
1) శాతవాహనులు
2) గుప్తులు
3) ఇక్ష్వాకులు
4) పుష్యభూతులు
సమాధానం: 4
156. ఏ వర్గాన్ని హుయాన్‌త్సాంగ్ వ్యవసాయ దారులుగా పేర్కొన్నాడు?
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
సమాధానం: 4
157. బాణుడి ప్రకారం హర్షుడి కాలంలో సర్వ సాధారణమైపోయిన దురాచారం?
1) సతీసహగమనం
2) వరకట్నం
3) కన్యాశుల్కం
4) వితంతు వివాహాల నిషేధం
సమాధానం: 2
158. హర్షుడు ఆదరించిన మతం?
1) హిందూ మతం
2) బౌద్ధ మతం
3) జైన మతం
4) వైష్ణవ మతం
సమాధానం: 2
159. హర్షుడి కాలంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న మతం?
1) వైష్ణవం
2) బౌద్ధం
3) శైవం
4) జైనం
సమాధానం: 3
160. ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటారు?
1) సముద్రగుప్తుడు
2) హర్షవర్ధనుడు
3) రెండో చంద్రగుప్తుడు
4) యశోధర్ముడు
సమాధానం: 4
161. రాజపుత్ర, శీలాదిత్య అనే బిరుదులు ధరించిన రాజు?
1) రెండో పులకేశి
2) మొదటి మహేంద్రవర్మ
3) హర్షుడు
4) రెండో నరసింహవర్మ
సమాధానం: 3
162. రెండో పులకేశి ఏ యుద్ధంలో మొదటి మహేంద్రవర్మను అంతం చేశాడు?
1) పుల్లలూరు యుద్ధం
2) కొప్పం యుద్ధం
3) సంగమేశ్వర యుద్ధం
4) మణిమంగళ యుద్ధం
సమాధానం: 1
163. గుజరాత్‌పై అరబ్బుల దాడిని తిప్పికొట్టిన చాళుక్యరాజు?
1) రెండో పులకేశి
2) మొదటి విక్రమాదిత్యుడు
3) రెండో విక్రమాదిత్యుడు
4) రెండో కీర్తివర్మ
సమాధానం: 3
164. రెండో పులకేశి క్రీ.శ.642లో జరిగిన ఏ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో అంతమయ్యాడు?
1) మణిమంగళ యుద్ధం
2) కంచి యుద్ధం
3) అనిల్‌వారా యుద్ధం
4) బనవాసి యుద్ధం
సమాధానం: 1
165. బాదామీ చాళుక్యుల రాజ చిహ్నం?
1) వరాహం
2) వృషభం
3) సింహం
4) పులి
సమాధానం: 1
166. ఐహోల్ శాసనాన్ని రచించిన వారు?
1) హరిసేనుడు
2) రవికీర్తి
3) మొదటి పులకేశి
4) బాణుడు
సమాధానం: 1
167. అవనీసింహ అనే బిరుదున్న పల్లవ రాజు?
1) సింహవిష్ణు
2) రెండో నరసింహవర్మ
3) మొదటి మహేంద్రవర్మ
4) మొదటి పరమేశ్వర వర్మ
సమాధానం: 1
168. మహాబలిపురంలోని ఆదివరాహ దేవాలయంలో ఉన్న పల్లవరాజు విగ్రహం ఎవరికి సంబంధించింది?
1) మొదటి నరసింహవర్మ
2) రెండో నరసింహవర్మ
3) సింహవిష్ణు
4) అపరాజిత వర్మ
సమాధానం:3
169.ఏ పల్లవరాజును సైనికుడు, పాలనాదక్షుడు, మత సంస్కర్త, భవన నిర్మాత, కవి, సంగీతకారుడు అని పిలిచేవారు?
1) రెండో నరసింహవర్మ
2) మొదటి మహేంద్రవర్మ
3) రెండో పరమేశ్వరవర్మ
4) రెండో నందివర్మ
సమాధానం: 2
No comments:
Post a Comment