important bits on satavahanas telugu ll శాతవాహనులు ఇంపార్టెంట్ బిట్స్ - Grate Thing

Breaking

Home Top Ad

Tuesday, September 17, 2019

important bits on satavahanas telugu ll శాతవాహనులు ఇంపార్టెంట్ బిట్స్

1.చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న దక్షిణ రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యం చేసిన ఘనత శాతవాహనులకు దక్కింది అని  ఎవరు పేర్కొన్నారు ?
జవాబు డాక్టర్ ఫణిక్కర్ 
2.శాతవాహన రాజులు ఎంతమంది ఎన్ని శతాబ్దాలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు?
జవాబు 30 మంది రాజులు, నాలుగున్నర శతాబ్దాలు, 450 సంవత్సరాలు
3.శాతవాహనులు ఆంద్రులే అని చెప్పిన వారు ఎవరు?
 జవాబు బండార్కర్, వి స్మిత్, రాప్ సర్ 
4.మగధ లో సింగుల పాలనలో శాతవాహనులు పశ్చిమం వైపు ఉన్నా ప్రాంతాలని విజృంభించారు ఎవరు అభిప్రాయం వ్యక్తం చేశారు
జవాబు రాప్ సార్
5.శ్రీకాకుళం ధాన్యకటకం మొదటి శాతవాహనుల రాజధాని అని ఎవరు చెప్పారు
జవాబు బార్నెట్ 
6.శాతవాహనులు ఆంధ్రులు కారు అని ఎవరు వ్యాఖ్యానించారు
జవాబు సుక్తాంకర్ 
7.సుక్తాంకర్ మాటని గాలి వాదం అని ఎవరు అన్నారు
జవాబు డాక్టర్ గోపాల చారి 
8.ఆంధ్ర భృత్యు అనే పదాన్ని తత్పురుష సమాసం కన్నా కర్మదారయ సమాసం బాగుంటుంది అని ఎవరు అన్నారు
జవాబు బండార్కర్ 
9.శాతవాహన తొలి సామ్రాజ్య స్థాపకుడు ఆంధ్ర జాతి వాడు అని ఏ పురాణం తెలియజేస్తుంది?
జవాబు భాగవత పురాణం 
10.ఎవరి కాలంలో మత్స్య పురాణం సంకరణం చేయబడింది ?
జవాబు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో 
11.చరిత్రకారులకు చరిత్ర నిర్మాణం చేయుటకు ఆధారమైన పురాణం ఏది?
జవాబు మత్స్య పురాణం 
12.గుణాఢ్యుడు రాసిన కథ ఏది?
జవాబు బృహత్కథ 
13.గుణాఢ్యుడు బృహత్కథను ఏ భాషలో వ్రాశాడు?
జవాబు పైశాచి భాషలో
14.కర్ణాటక శాతవాహనుల జన్మస్థలం అని ఎవరు చెప్పారు?
జవాబు సుక్తాంకర్ 
15.వి వి మిరాశీ శాతవాహనుల జన్మస్థలం అని పేర్కొన్నాడు?
జవాబు విదర్భ 
16.మహారాష్ట్ర శాతవాహనుల జన్మస్థలం అని ఎవరు చెప్పారు
జవాబు పి టి శ్రీనివాస్ అయ్యంగార్ jogalekar 
17.మేక ధోని శాసనం ఇచ్చింది ఎవరు?
జవాబు మూడవ పులోమావి
18.ఖారవేలుడు ఏ శాసనాన్ని ఇచ్చాడు ?
జవాబు హతిగుంపశాసనం 
19.మేక dhoni శాసనం దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు శాతవాహనుల వంశ పతనం గురించి తెలియజేస్తుంది 
20.నాసిక్ ప్రశస్తి శాసనాన్ని ఎవరు ఇచ్చారు?
జవాబు బాల శ్రీ 
21.కళింగ రాజు ఎవరు ?
జవాబు ఖారవేలుడు 
22.కృష్ణానదిని బౌద్ధ సాహిత్యం లో ఏమంటారు?
జవాబు kanna chenna nadi 
23.నవ నర స్వామి అని ఎవరికి బిరుదు?
జవాబు పులోమావి 
24.ప్రాకృత భాషలో రాయబడిన ఏ కావ్యం లో  హాలుడుకి - గోదావరికి మధ్య గల సంబంధం గురించి వివరించడం జరిగింది
జవాబు లీలావతి కావ్యం 
25.హాలుడు రచించిన గ్రంథం?
జవాబు గాదాసప్తశతి 
26.గౌతమ పుత్ర సామ్రాజ్యంలో ఏ కనుమ లో ఏ పర్వతాలు ఉన్నాయి
జవాబు తూర్పు కనుమలలో మహేంద్రగిరి, sirithana ,శటగిరి 
27.బౌద్ధ సాహిత్యంలో ధాన్యకటకం ని ఏమంటారు
జవాబు పూర్వ శైలము
28. ఏ చైనా యాత్రికుడు ధాన్యకటకం తూర్పున వజ్ర పర్వతం ఉందని చెప్పాడు?
జవాబు యువాన్ సాంగ్ ఏడవ శతాబ్దంలో బౌద్ధ సాహిత్యంలో 
29.వజ్ర పాణి ఆలయంలో ఎవరు ఉంటారు?
జవాబు బుద్ధుడు 
30.గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు ఎక్కడ ఎక్కువగా లభించాయి?
జవాబు ఆంధ్రాలో 
31.ఆంధ్రాకు పెద్ద సైనిక బలం ఉందని ఎవరు చెప్పారు?
జవాబు గ్రీకు రాయబారి మెగస్తనీస్ 
32.అశోకుని ఎన్నో శిలాశాసనం ఆంధ్రులు బౌద్ధమతం స్వీకరించినట్లు తెలియజేస్తుంది ?
జవాబు 13వ శిలాశాసనం(కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం వాళ్లు) 
33.దక్షిణాది పతి అని ఎవరిని అంటారు?
జవాబు మొదటి శాతకర్ణి 
34.దక్షిణాదిపతి అంటే అంటే అర్థం ఏమిటి?
జవాబు నర్మద కావేరి ల మధ్య ప్రాంతం 
35.శాతవాహనుల అధికార పీఠం తూర్పు నుంచి పశ్చిమంవైపు అని ఎవరు అభిప్రాయం వ్యక్తం చేశారు?
జవాబు ఆచార్య గోర్తి, వెంకటేశ్వర రామ గారు

No comments:

Post a Comment

Pages

close