1. శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) మైకాలజీ
బి) పైకాలజీ
సి) టెరిడాలజీ
డి) పేలినాలజీ
2. కిందివాటిలో ఎరువుగా ఉపయోగపడే శైవలం ఏది?
ఎ) స్పెరోగైరా
బి) క్లామిడోమోనాస్
సి) స్పేరులినా
డి) డయాటమ్స్
3. 'మొదటి నేల మొక్కలు'గా వేటినిపేర్కొంటారు?
ఎ) టెరిడోఫైటా
బి) శైవలాలు
సి) బ్రయోఫైటా
డి)జిమ్నోస్పెర్మ్
4. 'అయోడిన్' దేని నుంచి లభిస్తుంది?
ఎ) క్లామిడోమోనాస్
బి) క్లాడోపొరా
సి) లామినేరియా
డి) క్లోరెల్లా
5. కిందివాటిలో జీవ ఎరువుగా ఉపయోగపడేవి ఏవి?
ఎ) అజొల్లా
బి) రైజోబియం
సి) నీలి ఆకుపచ్చ శైవలాలు
డి) పైవన్నీ
6. 'కెర్బ్స్' అనేవి ఏ వర్గానికి చెందుతాయి?
ఎ) శిలీంధ్రాలు
బి) శైవలాలు
సి) బ్యా క్టీరియా
డి) బ్రయోఫైటా
7. ఆంథిరీడియం అంటే ఏమిటి?
ఎ) పురుష ప్రత్యుత్పత్తి భాగం
బి) స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం
సి) కేసరావళి
డి) అండకోశం
8. మొక్కల్లో 'ఫ్రాండ్స్' అనేవి?
ఎ) వేర్లు
బి) పత్రాలు
సి) కాండం
డి) పుష్పాలు
9. కిందివాటిలో మైకోరైజాలో ఉండేది ఏది?
ఎ) శిలీంధ్రం
బి) శైవలం
సి) ఎ, బి
డి) నీలి ఆకుపచ్చ శైవలాలు
10. కిందివాటిలో అలంకరణ కోసం పెంచేపుష్పించని మొక్కలు ఏవి?
ఎ) బ్రయోఫైటా
బి) శైవలాలు
సి) శిలీంధ్రాలు
డి) టెరిడోఫైటా
11. 'అగార్ - అగార్' వేటి నుంచి లభిస్తుంది?
ఎ) గ్రాసిల్లేరియా
బి) క్లామిడోమోనాస్
సి) నీలి ఆకుపచ్చ శైవలాలు
డి) పైవన్నీ
12. వ్యోమగాములు ఆహారం కోసం ఉపయోగించే శైవలం ఏది?
ఎ) క్లోరెల్లా
బి) వాల్ వాక్స్
సి) స్పెరులినా
డి) పైవన్నీ
13. పెన్సిలినను ఎవరు కనుగొన్నారు?
ఎ) వాక్సన్
బి) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
సి) వాట్సన్
డి) లివెన్ హక్
14. జన్యుశాస్త్ర ప్రయోగాల్లో వేటిని ఉపయోగిస్తారు?
ఎ) న్యూరోస్పొరా
బి) అగారికస్
సి) అజొల్లా
డి) రైజోబియం
15. జీవ పరిణామం ప్రకారం పుష్పించనిమొక్కల్లో చివరి దశలో ఉండేవి?
ఎ) బ్రయోఫైటా
బి) టెరిడోఫైటా
సి) శైవలాలు
డి) శిలీంధ్రాలు
16. లైకెన్స్ లో ఉండేవి?
ఎ) శిలీంధ్రం, శైవలం
బి) శైవలం, బ్రయోఫైటా
సి) శిలీంధ్రం, బ్రయోఫైటా
డి) బ్రయోఫైటా, టెరిడోఫైటా
17. 'వృక్ష రాజ్య తివాచీలు'గా ఏ మొక్కలను పేర్కొంటారు?
ఎ) శైవలాలు
బి) శిలీంధ్రాలు
సి) బ్రయోఫైటా
డి) టెరిడోఫైటా
No comments:
Post a Comment