VERY IMPORTANT BITS ON POLITY FOR for group 2, group 3, vro, vra, group d, dsc, pet, si, constable tet other competitive exams - Grate Thing

Breaking

Home Top Ad

Monday, October 28, 2019

VERY IMPORTANT BITS ON POLITY FOR for group 2, group 3, vro, vra, group d, dsc, pet, si, constable tet other competitive exams



1. ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికరణం ప్రకారం చట్టం చేయవచ్చు?
ఎ. ఆర్టికల్‌ 32 
బి. ఆర్టికల్‌ 33
సి. ఆర్టికల్‌ 34 
డి. ఆర్టికల్‌ 35
2. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు?
ఎ. ఆర్మీలో పనిచేసేవారికి 
బి. పోలీసు శాఖకు
సి. ఎ.సి.బి 
డి. సి.బి.ఐ
3. భారత రాజ్యాంగంలోని అధికరణ 14 కింద దీనిని నిషేధించలేదు?
ఎ. క్లాస్‌ చట్టం 
బి. న్యాయమైన వర్గీకరణ
సి. తారతమ్యం 
డి. విడదీయడం
4. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందు పరచక ముందు రాజ్యాంగంలోని కింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి?
ఎ. అధికరణలు 14 నుండి 18
బి. అధికరణలు 19 నుండి 22
సి. అధికరణలు 23 నుండి 24
డి. అధికరణలు 25 నుంచి 28
5. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులు?
ఎ. పది విధులు
బి. పదకొండు విధులు
సి. తొమ్మిది విధులు
డి. పన్నెండు విధులు
6. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును ఎవరి పదవీ కాలంలో తొలగించారు?
ఎ. మొరార్జీ దేశారు 
బి. రాజీవ్‌గాంధీ
సి. చరణ్‌ సింగ్‌ 
డి. ఇందిరా గాంధీ
7. జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు కాని హక్కు?
ఎ. సమానత్వపు హక్కు
బి. జీవనం వ్యక్తి స్వాతంత్య్రము హక్కు
సి. మతపరమైన స్వేచ్ఛ
డి. భావప్రకటన స్వేచ్ఛ
8. 2002 తరువాత విద్యాహక్కు ఏ రూపం సంతరించుకుంది?
ఎ. న్యాయపరమైన హక్కు
బి. మానవ హక్కు
సి. ప్రాథమిక హక్కు డి. సివిల్‌ హక్కు
9. ఓటుహక్కు దీని కిందికి వస్తుంది?
ఎ. న్యాయపరమైన హక్కు
బి. ప్రాథమిక హక్కు
సి. రాజ్యాంగపరమైన హక్కు
డి. పైవన్నీ సరియైనవి కావు
10. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ 'రాజ్యం' అనే పదాన్ని నిర్వచిస్తుంది?
ఎ. 12 
బి. 13 
సి. 14 
డి. 15
11. భారత రాజ్యాంగంలోని 15వ అధికరణ ఈ కింది వాటికి వర్తిస్తుంది?
ఎ. పౌరులకు మాత్రమే
బి. పౌరులు కానివారికి మాత్రమే
సి. పౌరులు, పౌరులు కానివారికి
డి. కార్పొరేషన్‌లకు, సంఘాలకు
12. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది?
ఎ. గోలక్‌నాధ్‌ - పంజాబ్‌ రాష్ట్రం
బి. కేశవానంద భారతి - కేరళ రాష్ట్రం
సి. శంకర ప్రసాద్‌ - భారత యూనియన్‌
డి. వీటిలో ఏదీకాదు
13. భారత రాజ్యాంగపు మౌలిక లక్షణం కానిది?
ఎ. పార్లమెంటరీ వ్యవస్థ
బి. న్యాయస్థాన ఆధిక్యం
సి. సమాఖ్య వాదం
డి. ప్రాథమిక హక్కులు
14. రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ. 1946 డిసెంబర్‌ 13
బి. 1946 డిసెంబర్‌ 11
సి. 1948 డిసెంబర్‌ 13
డి. 1948 డిసెంబర్‌ 11
15. ప్రవేశికలో ఈ విధంగా ఉంది?
ఎ. భారత ప్రజలమైన మేము
బి. హిందూ దేశ ప్రజలమైన మేము
సి. యూనియన్‌ ప్రజలమైన మేము
డి. ఫెడరల్‌ ప్రజలమైన మేము
16. ప్రవేశికలో లేని పదాలు?
ఎ. సమగ్రత 
బి. సార్వభౌమత్వం
సి. న్యాయం 
డి. సమాఖ్య
17. బెరుబారి అనేది?
ఎ. బెరుబారి 
బి. ప్రాంతం పేరు
సి. కమీషన్‌ పేరు 
డి. పైవేవీకావు
18. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదని చెప్పిన కేసు?
ఎ. బెరుబారి కేసు 
బి. కేశవానంద భారతి
సి. ఎల్‌.ఐ.సి 
డి. గోపాలన్‌
19. ప్రాథమిక హక్కును అమలు జరుపుట కొరకు రాజ్యాంగంలో కనబరిచిన పరిష్కారం?
ఎ. ఆర్టికల్‌ 14 
బి. ఆర్టికల్‌ 34
సి. ఆర్టికల్‌ 35 
డి. ఆర్టికల్‌ 32
20. రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం?
ఎ. ప్రాథమిక హక్కులు 
బి. ఆదేశిక సూత్రాలు
సి. ప్రాథమిక విధులు 
డి. ప్రవేశిక
21. భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని ధరించే హక్కును ఏ ప్రాథమిక హక్కు కల్పిస్తుంది?
ఎ. స్వాతంత్రపు హక్కు
బి. జీవించే హక్కు
సి. మత స్వాతంత్య్రపు హక్కు
డి. సాంస్కృతిక, విద్యా హక్కు
22. భారత రాజ్యాంగం పరిధిలో కింది వాటిలో ప్రాథమిక విధి కానిది?
ఎ. సార్వత్రిక ఎన్నికలలో ఓటువేయడం
బి. శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించడం
సి. ప్రజల ఆస్తిని కాపాడటం
డి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను గౌరవించడం
23. కొన్ని ఉద్యోగాలను స్త్రీలకు మాత్రమే రిజర్వ్‌ చేయడం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎ. యూనియన్‌ ఆఫ్‌ ఇండియా V/s ప్రభాకరన్‌ 1997
బి. సాగర్‌ V/S ఎ.పి. గవర్నమెంట్‌ - 1968
సి. పై రెండూ
డి. పై రెండూ కాదు
24. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ దేనిని గురించి తెలుపుతుంది?
ఎ. ఆస్తి హక్కు
బి. జీవించే హక్కు
సి. విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం
డి. ఆర్డినెన్స్‌ జారీ చేయడంలో రాష్ట్రపతి అధికారం
25. ఈ కింది వాటిలో ఏ విషయంలో భారత్‌, అమెరికా రాజ్యాంగాల పోలిక ఏది?
ఎ. ప్రాథమిక హక్కులు
బి. ఆదేశిక సూత్రాలు
సి.సమన్యాయపాలన
డి. రాజ్యాంగ దృఢత్వం
26. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ భావ స్వాతంత్య్ర హక్కును తెలుపుతుంది?
ఎ. 10 
బి. 19
సి. 14 
డి. ఏదీకాదు
27. కింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు?
ఎ. వాక్‌ స్వాతంత్య్రము, భావనా స్వాతంత్య్రము
బి. భారత్‌లో ఏ ప్రదేశంలో అయినా భావనా స్వాతంత్య్రము
సి. అల్ప సంఖ్యాక వర్గము వారి విద్యా పురోగతి కొరకు ఒక సంస్థను స్థాపించుట
డి. అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లోనికి ప్రవేశించుట
28. భారతరాజ్యాంగానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి?
1. ప్రాథమిక హక్కులు
2. ప్రాథమిక విధులు
3. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు
4. భారత రాజ్యాంగంలోని పైన పేర్కొన్న నిబంధనలలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వేటిని సంతృప్తి పరుస్తుంది?
ఎ. 1 మాత్రమే 
బి. 3 మాత్రమే
సి. 1, 3 మాత్రమే 
డి. 1, 2, 3
29. వయోజనులందరూ ఓటు వేసి, వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కును ఏమంటారు?
ఎ. సార్వత్రిక వయోజన ఓటుహక్కు
బి. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన
సి. సార్వత్రిక తపాలా సంఘం
డి. పైవి ఏవీకాదు
30. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన హక్కు ఏది?
ఎ. వాక్‌ స్వాతంత్య్రపు హక్కు
బి. మత స్వేచ్ఛ హక్కు
సి. ఆస్తి హక్కు
డి. న్యాయస్థానాలకు పోగల హక్కు
31. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వాతంత్య్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు అని వ్యాఖ్యానించింది?
ఎ. అంబేద్కర్‌ 
బి. నెహ్రూ
సి. గాంధీ 
డి. హిదయతుల్లా
32. ప్రాథమిక హక్కుల అమలుకు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమంటారు?
ఎ. రిట్లు బి. డిక్రీ
సి. ఆర్డినెన్సు 
డి. పైవన్నీ
33. రాజ్యాంగంలో పరోక్షంగా గుర్తించిన ప్రాథమిక హక్కు ఏది?
ఎ. రహస్యాలను కాపాడుకునే హక్కు
బి. సంఘాలను ఏర్పరుచుకునే హక్కు
సి. సంచార హక్కు
డి. స్థిర నివాస హక్కు
34. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ శక్తి ఏది?
ఎ. హెబియస్‌ కార్పస్‌ 
బి. మాండమస్‌
సి. ప్రొహిబిషన్‌ 
డి. పైవేవీకాదు
35. ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎ. కేశవానంద భారతి కేసు
బి. గోలక్‌నాథ్‌ కేసు
సి. ఏ.కె. గోపాలన్‌ కేసు
డి. ఎస్‌.ఆర్‌. బొమ్మరు
36. ఒక ప్రభుత్వం గొప్పతనం ఇది ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది?
ఎ. అరిస్టాటిల్‌ 
బి. హెచ్‌.జె. లాస్కి
సి. జె.యస్‌.మిల్‌ 
డి. ఐవర్‌ జెన్నింగ్స్‌
37. ప్రకరణ 12 ప్రకారం రాజ్య నిర్వచనంలోకి రాని అంశం?
ఎ. గ్రామ పంచాయతి 
బి. సహకార సంఘాలు
సి. యూనివర్సిటీలు 
డి. పైవేవీకావు
38. ప్రకరణ 13లో ప్రస్తావించిన అంశం/అంశాలు?
ఎ. రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు
బి. ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు
సి. చట్ట నిర్వచనం
డి. పైవన్నియూ సరైనవే
39. ప్రకరణ 13 ప్రకారం చట్ట నిర్వచనంలోకి రానిది?
ఎ. దత్త శాసనాలు 
బి. ఉపచట్టాలు
సి. రూల్స్‌ 
డి. రాజ్యాంగ సవరణ
40. హెన్రీ- (VIII) క్లాస్‌ అనగా?
ఎ. అనుచిత చట్టాలు 
బి. సరళచట్టాలు
సి. చట్టాలలోని దోషాలను తొలగించడం
డి. సవరణకు అతీతమైన చట్టాలు
41. హంస, పాలు నుండి నీరును వేరు చేస్తుందనే అంశం ఈ కింది సూత్రానికి అన్వయించవచ్చు?
ఎ. డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెవరబిలిటి
బి. డాక్ట్రిన్‌ ఆఫ్‌ వేయివర్‌
సి. డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఎక్లిప్స్‌
డి. డాక్ట్రిన్‌ ఆఫ్‌ పిత్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌
42. న్యాయ సమీక్ష అధికారం?
ఎ. పరోక్షంగా ఉంది
బి. ప్రత్యక్షంగా ఉంది
సి. ఆపాదించినది
డి. పైవేవీకావు
43. ప్రకరణ 14 దేనిని అనుమతిస్తుంది?
ఎ. వర్గ చట్టాలను 
బి. హేతుబద్ద వర్గీకరణను
సి. పై రెండింటిని 
డి. పైవి ఏవీకావు
44. విశాఖ V/s స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ 1997 వివాదంలో ముఖ్యాంశం?
ఎ. పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు
బి. బాలకార్మిక వ్యవస్థ
సి. అశ్లీల సాహిత్యం 
డి. పైవన్నియు
45. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడెవరు?
ఎ. రాష్ట్రపతి 
బి. ప్రధానమంత్రి
సి. పార్లమెంటు 
డి. సుప్రీం కోర్టు, హైకోర్టులు
సమాధానాలు
1. డి 2. ఎ 3. బి 4. డి 5. బి 6. ఎ 7. బి 8. సి 9. సి 10.ఎ 11.సి 12.బి 13.బి 14.ఎ 15.ఎ 16. డి 17.బి 18.ఎ 19.డి 20.డి 21. సి 22. ఎ 23. సి 24.బి 25.ఎ
26. బి 27. డి 28. బి 29.ఎ 30.సి 31. డి 32. ఎ 33. ఎ 34.ఎ 35.బి 36. బి 37. బి 38. డి 39.డి 40.సి 41. ఎ 42. బి 43. బి 44.ఎ 45.డి

No comments:

Post a Comment

Pages

close