1. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
- జమ్ము & కశ్మీర్
2. INDIA - AFRICA ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్ సైజ్ ఎక్కడ జరిగింది?
-పుణె
3. సామాజిక మాధ్యమ వేదిక INSTAGRAM లో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు?
- నరేంద్ర మోదీ
4. గ్లోబల్ ఏవియేషన్ సమిట్ ఎక్కడ జరిగింది?
-ముంబై
5. ఇటీవల ఏ రాష్ట్రంలో లా కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
- జమ్ము & కశ్మీర్
6. ఏ మంత్రిత్వ శాఖ యువ సహాకర్ పథకాన్ని ప్రారంభించింది?
- వ్యవసాయ శాఖ
7. ఏ రాష్ట్రంలో గోసంరక్షణపై పన్ను విధించాలని నిర్ణయించారు?
- ఉత్తరప్రదేశ్
8. సహజీవనంలో శారీరక సంబంధం అనేది లైంగిక దాడి కాదు అని వ్యాఖ్యానించింది ఎవరు?
- సుప్రీంకోర్టు
9. 2019 జనవరి 1న 3.95 లక్షలమంది జన్మించారని ప్రకటించిన సంస్థ?
- UNICEF
10. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రంపై వంద కోట్ల జరిమానా విధించింది?
-మేఘాలయ
11 బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?
- అవామీ లీగ్
12. క్రిషక్ బంధు పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- పశ్చిమ బెంగాల్
13. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైంది?
- జలంధర్
14. ఏ రాష్ట్రంలో 12 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?
- మణిపూర్
15. రేణుక నీటిపారుదల ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?
-యమునా
16. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏషియా రీజినల్
సెంటర్ (ISARC)ని ఎక్కడ ప్రారంభించారు?
- వారణాసి
17. ఒడిశా ప్రభుత్వం ఎవరికి వడ్డీలేని రుణాలు మంజూరు చేసింది?
- మహిళలకు
18. అంతర్జాతీయ కైట్ (గాలిపటాలు) ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది?
- అహ్మదాబాద్
19. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలిచిన
- ఆంధ్రప్రదేశ్
20. GMR గ్రూపు ఆధ్వర్యంలో ఏ సెజ్ లో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు?
-కాకినాడ
21. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడికి రాని బాలకలకు పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన పథకం ?
- సబల
22. ఆంధ్రప్రదేశ్ లో వృద్ధాప్య పింఛన్లను రూ.2000 నుంచి ఎంతకు పెంచారు?
-రూ.2250
23. తెలంగాణ సభాపతి (స్పీకర్)గా ఎన్నికైనవారు ఎవరు?
- పోచారం శ్రీనివాస రెడ్డి
24. ఏ రాష్ట్రంలో తల్లీ సురక్ష పథకాన్ని ప్రారంభించారు?
- ఆంధ్రప్రదేశ్
25. గుంటూరులో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఎన్ని కొత్త వంగడాలను రూపొందించారు?
-13
26. ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెమింగో ఫెస్టివల్ - 2019 ఏ జిల్లాలో జరిగింది?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
27. ఆదరణ పథకం రాయితీని ప్రభుత్వం ఎంత శాతానికి పెంచింది?
-90%
28. ఏ నగరంలో పర్యావరణ హిత డేటా పార్క్, సోలార్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు?
- విశాఖపట్టణం
29. పీవీ నరసింహారావు జీవన సాఫల్య పురస్కారం ఎవరి కి లభించింది?
- మన్మోహన్ సింగ్
30. 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది?
- హైదరాబాద్
31 ICC ఏ క్రీడాకారుడి బౌలింగ్ పై నిషేధం విధించింది?
- అంబటి తిరుపతి రాయుడు
32. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత?
-నోవాక్ జొకోవిచ్
33. ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్ ఏది?
- దుబాయ్
34. టెన్నిసకు వీడ్కోలు పలికిన ఆండీ ముర్రే ఏ దేశస్థుడు?
- బ్రిటన్
35. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను గెలిచిన దేశం?
- భారత్
36. ఆసియా చెస్ ఛాంపియన్ షిప్లో ఎవరికి స్వర్ణం లభించింది?
- గోలి సంధ్య
37. ప్రో కబడ్డీ లీగ్ - 6 విజేత ఎవరు?
- బెంగళూరు
38. BCCI సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేత ఎవరు?
- బెంగాల్
39. మరణ శిక్ష రాజ్యాంగబద్దమేనని ఏ కోర్టు తీర్పుని చ్చింది?
- సుప్రీంకోర్టు
40. నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ఎక్కడ జరి గింది?
-కటక్
41. ఇండోనేషియా మాస్టర్ టైటిల్‌ను గెలుచుకుంది ఎవరు?
- సైనా నెహ్వల్
42. పాత్రికేయులకు ప్రమాదకర దేశాల్లో మొదటి స్థానంలో ఉంది ఏది?
- ఆఫ్ఘనిస్థాన్
43. 2019లో 3వ ప్రపంచ కవుల సమ్మేళనం ఎక్కడ జరుగుతుంది?
- ఒడిశా (భువనేశ్వర్)
44. ఐటీ సేవల్లో ఏ భారత కంపెనీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది?
- టీసీఎస్
45. ప్రపంచంలో అత్యధిక గిరిజన భాషలకు లిపులు తయారుచేసినవారు ఎవరు?
- ప్రసన్నశ్రీ
46. భారత ప్రసారాలపై ఏ దేశంలో నిషేధం విధించారు?
-పాకిస్తాన్
47. గోల్డెన్ గ్లోబ్ ఉత్సవాలు ఎక్కడ జరిగాయి?
- కాలిఫోర్నియా
48. అత్యాధునిక నేవీ మారిటైమ్ రాడార్‌ను ఏదేశం అభివృద్ధి చేసింది?
- చైనా
49. జాబిల్లి పై మొక్కను నాటిన దేశం ఏది? - చైనా
50. బొగ్గు గని పైకప్పు కూలి 21 మంది మరణించిన దేశం ఏది?
- చైనా
51. ఏ దేశ సరిహద్దుల్లో భారత్ 44 వ్యూహాత్మక రహదారులు వేయాలని నిర్ణయించింది?
- చైనా
52. మహిళా కాంగ్రెస్ నేతగా నియమితులైన ట్రాన్స్ జెండర్ ఎవరు?
- అప్సరా రెడ్డి
53. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 ఎక్కడ జరిగింది?
- న్యూఢిల్లీ
54. ఏ రాష్ట్రంలో యువ సౌభ్యమాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు?
- మధ్య ప్రదేశ్
55. 15వ ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరిగింది?
- వారణాసి
56. ఫల, పుష్ప ప్రదర్శన ఎక్కడ జరిగింది?
-యానాం
57. కోయెల్ కరో ప్రాజెక్టును ఏ రాష్ట్రం నిర్మిస్తుంది?
- ఝార్ఖండ్
58. అగ్రవర్ణ పేదలకు ఎంతశాతం రిజర్వేషన్ అమలు
చేయాలని కేంద్రం నిర్ణయించింది?
- 10%
59. అమెరికాలో నివశించేవారిలో ఏ దేశాలవారు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు?
- భారత్, చైనా
60. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై 'నీతి ఆయోగ్ విడుదల చేసిన నాణ్యమైన విద్య సూచీలో మొదటి స్థానం సంపాదించిన రాష్ట్రం?
- కేరళ
61. భారత్ కు నిధుల సాయాన్ని ఏ బ్యాంక్ పెంచింది?
- ADB
62. సౌర వ్యవస్థలో నాసా కనుగొన్న కొత్త గ్రహం?
- HD21749B
63. చంద్రుని ఆవలవైపునకు వ్యోమనౌక పంపిన దేశం?
-చైనా
64. చిన్న వ్యాపారులను ఏ పన్ను నుంచి కేంద్రం మినహాయించింది?
-జీఎనీ
65. కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 2018 - 19 కి వృద్ధి రేటు?
-7.2%
66. రెండో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఎక్కడ జరిగింది?
- చెన్నై
67. అంతర్జాతీయ సృజనాత్మక వ్యవసాయ సదస్సు 2018 ఎక్కడ జరిగింది?
- రోమ్
68. భారత్ - దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సు ఎక్కడ జరిగింది?
- న్యూఢిల్లీ
69. 29వ భారత్ పెయింట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
- ఆగ్రా
70. అగ్రి విజన్ సదస్సు ఎక్కడ జరిగింది?
- హైదరాబాద్
71. 2019కి గాను ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు?
- 112
72. హుస్సేన్‌షా స్మారక పురస్కారం ఎవరికి లభించింది?
- చంద్రబోస్
73. వరల్డ్ ఓషియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది?
- విశాఖపట్టణం
74. Global Indian Inspiration Award ఏ విద్యాసంస్థకు లభించింది?
- నారాయణ
75. ఇండియా రబ్బర్ ఎక్స్పో - 2019 ఎక్కడ జరిగింది?
-ముంబై
76. ఇంటర్‌పోల్ నూతన అధ్యక్షుడు ఎవరు?
-కిమ్ జోంగ్ యాంగ్
77. అణుశక్తి నియంత్రణ మండల నూతన ఛైర్మన్ ఎవరు?
- నాగేశ్వరరావు
78. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు?
-ప్రభాత్ సింగ్
79. SOPAN-19 ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
- న్యూఢిల్లీ
80. ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థిక వేత్తగా ఎవరు నియమితు లయ్యారు?
- గీతా గోపీనాథ్
81. 40వ అంతర్జాతీయ వార్షిక ఎడారి పండుగ ఎక్కడ జరిగింది?
- జైసల్మీర్
82. డ్రైనేజీ క్లీనింగ్ రోబోట్ ను ఎక్కడ ప్రవేశపెట్టారు?
- చెన్నై
83. భారత్ ఏ దేశానికి Most Favoured Nation హోదాను రద్దు చేసింది?
-పాకిస్తాన్
84. యునెస్కో నుంచి వైదొలగిన దేశాలు ఏవి?
- అమెరికా, ఇజ్రాయెల్
85. అంతర్జాతీయ మేథో హక్కుల సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
- అమెరికా
86. భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు ఏ దేశానికి చెందినవి?
- అమెరికా
87. భారత్ ఏ దేశానికి వెళ్లే జలాలను నిలిపి వేయాలని నిర్ణయించింది?
-పాకిస్తాన్
88. ఆపరేషన్ బాలాకోట్ లో ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?
-మిరాజ్ 2000
89. 2018కిగాను మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గాఎంపికైనవారు ఎవరు?
- స్మృతి మందాన
90. ఢిల్లీ నుంచి కశ్మీర్ ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎవరికి ఉచిత విమాన ప్రయాణాన్ని కేంద్రం కల్పించింది?
-పారామిలిటరీ జవాన్లకు
91. FIFAలో భారత్ ర్యాంక్?
-103
92. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఎక్కడ ప్రారంభించారు?
- గోరఖ్ పూర్
93. పీఎఫ్ పై వడ్డీని ఎంతశాతానికి పెంచారు?
- 8.65
94. దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన నది?
- కావేరి
95. భారతరత్నను తిరస్కరించిన హజారికా తనయుడు?
-తేజ్ హజారికా
96. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వంటగ్యాస్ కనెక్షన్లు ఎన్ని కోట్లకు చేరాయి?
-ఆరు కోట్లు
97. ఆపరేషన్ గ్రీన్ ఏ పంటకు చెందింది?
- టమోటా ,
98. జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు?
-న్యూఢిలీ
99. NSSO ప్రకారం ఇండియా నిరుద్యోగ రేటు (2017 - 18) ఎంత శాతం ?
- 6.1%
100. ఏ రాష్ట్రంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్నిఏర్పాటు చేయాలని నిర్ణయించారు?
- ఉత్తరాఖండ్
No comments:
Post a Comment